పశువులు మెచ్చిన ప్రభువు ఎవరో తెలుసా ?

Publish Date:Jul 27, 2022

Advertisement

నవ్వడానికి అయినా నవ్వించడానికి అయినా, కమేడియన్లే కానక్కర లేదు, బ్రహ్మానందమే రానక్కర లేదు. రాజకీయ నాయకులు కూడా ఇంచక్కా, చక్కగా నవ్వించగలరు. నవ్వనూ గలరు. మళ్ళీ మనకు పొలిటికల్ కమేడియన్స్ అనగానే,ఒక కేఏ పాల్ లేదంటే ఆ రేంజ్ నాయకులు ఎవరో గుర్తొస్తారు కానీ, పాల్ ని మించిన కమేడియన్లు ఉన్నారని మనం గుర్తించలేక పోతున్నాం. దటీజ్ అవర్ బాడ్ లక్ ..  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయాన్నే తీసుకోండి, ఆయన ఎంత చక్కగా నవ్వుతారు. నవ్వీ నవ్వనట్లుగా, అదో రకంగా భలేగా నవ్వుతారు. (గిట్టని వాళ్ళు ఆయన నవ్వు ముఖానికి పూసుకున్తున్నట్లు ఉంటుందంటారు అనుకోండి అదివేరే విషయం).

నవ్వడంలోనే కాదు, నవ్వించడంలోనూ జగన్ రెడ్డికి జగన్ రెడ్డే సాటి.  అయన భలే భలే జోకులేస్తారు. నిజానికి అయన మాటే ఒక జోకు... అందుకే, నవ్వడంలోనే కాదు, నవ్వించడంలోనూ జగన్ రెడ్డి మంచి మార్కులే వచ్చాయని అంటారు.  మార్కులంటే  గుర్తొచ్చింది. మీరు ఒక పరీక్ష రాసారు, అనుకోండి, మీకు ఆ పరీక్షలో ఎన్ని మార్కులొచ్చాయి, ఫస్ట్ క్లాసొచ్చిందా? అసలు పాస్ మార్కులు అయినా వచ్చాయా, పాసయ్యారా?  లేదా, అనేది ఎవరు నిర్ధారించాలి, మీకు ఎవరు మార్కులు వేయాలి  ఆ పరీక్ష పేపర్ దిద్దిన మాష్టారు కదా, కానీ, జగన్ రెడ్డి స్కూల్ లో అలాకాదు. పరీక్ష ఆయనే రాస్తారు. మార్కులు ఆయనే వేసుకుంటారు. ఆయనకు ఆయనే సర్టిఫికేట్  కూడా ఇచ్చుకుంటారు.  ఆ మధ్యన ఆయన మీటలు నొక్కే టెస్టులో నేను ఫస్టు క్లాస్ లో పాసై పోయాను.

నాకు ప్రజలు (ఏ ప్రజలు అని అడగకండి) 80 శాతం మార్కులు వేశారు. ఫస్ట్ క్లాస్ లో పాస్ చేశారు అని ఆయన జబ్బలు ఆయనే చరుచుకున్నారు. ఇప్పుడు మళ్ళీ గోదావరి వరదలను ట్యాకిల్ చేయడంలోనూ, తనకు తానే సాటని మరో మారు జబ్బలు చర్చుకున్నారు. మనుష్యులే కాదు, పశువులు కూడా తనను చూసి తెగ మురిసి పోతున్నాయని చెప్పుకొచ్చారు. పశువులకు నోరు లేక కానీ, లేదంటే, ఓహో జగనన్న .. ఆహ జననన్న.. నువ్వే మా రాజన్న .. అంటూ కీర్తి గీతాలు ఆలపించేవని, తమ కీర్తిని తానే చాటు కున్నారు. చాటింపు వేసుకున్నారు. తమకు వరద సాయం అందలేదని ఒక్కరూ కూడా చెప్పలేదని .. అందర్నీ ప్రభుత్వం ఆదుకుందన్నారు, అంతే కాదు,  కట్టు బట్టలతో మిగిలిపోయిన, ప్రజలు, జగనన్న ప్రభుత్వం ఇచ్చిన రెండు వేల రూపాయలు ఏమి చేసుకోవాలో తెలియక సంబరాలు చేస్కుంటున్నారనికూడా సంతోషంతో చిందులు వేశారు.

అంతే  కాదు, ఇంతవరకు, ఏ ముఖ్యమంత్రి చెప్పని మరో గొప్ప రహస్యాన్ని కూడా శ్రీ జగన్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి అంటే ఆదేశాలు మాత్రమే ఇవ్వాలి కానీ, జనంలోకి రారాదని. వచ్చినా పరదాల చాటున, పోలీసుల మాటున రావాలే కానీ, కష్టాల్లో ఉన్న ప్రజలను పలకరించడం ముఖ్యమంత్రి చేయవలసిన పని కాదని , చాలా చక్కని సందేశం ఇచ్చారు.  అంటే ఏంటి, నవ్వడానికి అయినా నవ్వించడానికి అయినా, కమేడియన్లే కానక్కర లేదు, బ్రహ్మానందమేరానక్కర లేదు. రాజకీయ నాయకులు కూడా ఇంచక్కా, చక్కగా నవ్వించగలరు. నవ్వనూ గలరు. ఇన్ ఫాక్ట్’ ఇతర రాజకీయ నాయకుల సంగతి ఎలా ఆన్నా, ఏపీ సీఎం జగన్ రెడ్డి లో మాత్రం ఓ మాంచి కమెడియన్ కూడా ఉన్నారు. సరే, ఆయన నవ్వుల సంగతి ఎలా ఉన్నా, అయన నవ్వుల పాలవుతున్నారు.. అంటారా ..అది  మీ ఇష్టం

By
en-us Political News

  
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.