వేగంగా ఆహారం తినే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా.!
Publish Date:Aug 13, 2026
Advertisement
మనుషుల నుండి ప్రాణం ఉన్న ప్రతి జీవి ఆహారం తీసుకోవడం పరిపాటి. తీసుకునే ఆహారం నుండి లభించే శక్తితోనే శరీరం నిలబడుతుంది. ఇక అన్ని ప్రాణులలోకి మనిషి చాలా విభిన్నమైన వాడు. మనుషుల్లో ఒక్కొక్కరికి ఒక్కో విధమైన అలవాట్లు ఉంటాయి. అంతేకాదు.. ఆహారం తినే విధానంలో కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. కొందరు నిదానంగా తింటారు. మరికొందరు చాలా వేగంగా తింటారు. అయితే.. వేగంగా తినే వ్యక్తుల వ్యక్తిత్వం గురించి వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చాలా ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నారు. వేగంగా ఆహారం తినే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? దీని గురించి వివరంగా తెలుసుకుంటే..
వేగంగా తినడం...
మన చుట్టూ చాలామంది ఉంటారు. కుటుంబ సభ్యులు అయినా, స్నేహితులు అయినా.. తెలిసిన వారు అయినా.. కలిసి భోజనం చేసేటప్పుడు లేదా ఏదైనా ఆహారం తినేటప్పుడు.. అందరూ కలిసి మొదలు పెడితే.. పక్క వాళ్లు ఇంకా సగం కూడా తినకుండానే మధ్యలోనే తమ ఆహారం పూర్తీ చేసే వారు కొందరు ఉంటారు. వారు చాలా బిజీ లైఫ్ స్టైల్ కు అలవాటు వడటం వల్ల అలా వేగంగా తినడం అలవాటు అయి ఉంటుందని అందరూ అనుకుంటారు. ఇది నిజమే అయినా ఇలా వేగంగా తినే వారి స్వభావం విభిన్నంగా ఉంటుందని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చెబుతున్నారు.
వేగంగా తినే వారిలో ఉండే వ్యక్తిత్వ లక్షణాలు..
వేగంగా తినే వ్యక్తులు ఎక్కువగా ఫినిష్ లైన్ ను చేరుకోవడంపై దృష్టి పెడతారు. అదే మనస్తత్వం జీవితంలోని ఇతర రంగాలలో కనిపిస్తుందట. వారు చేయవలసిన పనుల లిస్ట్ నుండి పనులను మార్క్ చేయడం, సమర్థవంతంగా పనిచేయడం , ఒక పనిలో ఆలస్యం కాకుండా ఆ తరువాత సవాలును స్వీకరించడం వంటివి వీరిలో ఉంటాయట.
స్ట్రాంగ్ ప్రాక్టీస్ ఉన్నవారు తరచుగా భోజనంతో సహా రోజువారీ దినచర్యలో వేగాన్ని , సామర్థ్యాన్ని ఇష్టపడతారని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు. తినడాన్ని ఆస్వాదించడం, అనుభూతి చెందడం కంటే తినడాన్ని కూడా ఒక పనిగా భావిస్తారని అంటున్నారు. తినే వేగాన్ని బట్టి వ్యక్తిత్వం లక్షణాలను, తినే వేగానికి, వ్యక్తిత్వానికి మధ్య గల సంబంధాలను వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు కనుక్కున్నారు.
వేగంగా తినేవారు తరచుగా వేచి ఉండటానికి ఇష్టపడరు. ఇది క్యూలలో నిలబడినా, నెమ్మదిగా మీటింగ్స్ లో ఉన్నా లేదా ఆహారం వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వచ్చినా.. ఇలా అన్ని సందర్బాలలో వారు అన్ని వేగంగానే జరగాలని కోరుకుంటారట. అన్ని విషయాలలోనూ సహజంగా వేగాన్ని వీరు ఇష్టపడతారట. ఈ ధోరణి భోజన చేయడం వరకు తీసుకువెళుతుందట. చాలామందిలో తినే స్వభావం మానసిక , పర్యావరణ కారకాల ద్వారా ఏర్పడతాయని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చెబుతున్నారు.
వేగంగా తినే వ్యక్తులలో ఇతర పనులను కూడా వేగంగా పూర్తీ చేసే సామర్థ్యం ఉంటుందట. వర్తమానంతో పూర్తీగా నిమగ్నమవడానికి బదులుగా తరువాత ఏమి జరుగుతుందో అనే విషయం పై దృష్టి పెట్టేలా చేస్తుందట. ఈ కారణంగా వీరికి భవిష్యత్తు గురించి స్పష్టమైన అంచనాలు, ప్రణాళికలు కూడా ఉంటాయట. అలాగని వేగంగా తినడాన్ని సమర్థించడం లేదు. ఎందుకంటే.. వేగంగా తినడం అనేది ఆహారం సరిగా నమలకపోవడం, తినే ఆహారం మీద దృష్టి పెట్టలేకపోవడం, ఆహారం అతిగా తినడం.. ఇలా చాలా సమస్యలకు కారణం అవుతుంది.
*రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/do-you-know-what-fast-eaters-personality-is-like-35-228867.html




