మామిడి పండు తో ఏదైనా కలిపి తిన్నారో అంతే....

Publish Date:Apr 15, 2022

Advertisement

మీరు మామిడి పండు తింటున్నారా  తిన్నతరువాత ఇంకేమైనా తిన్నారో అంతే సంగతులు ప్రమాదం పొంచి ఉందన్న విషయం మీకు తెలుసా.?మామిడి పండు తిన్న వెంటనే 5 రకాల ఆహారాలు నిషిద్దం వాటిని మామిడి పండుతో కలిపి తిన్నారో అనారోగ్యం పాలైనట్లే.మామిడి పండును చూడగానే మీకు నోరు ఊరడం ఖాయం అసలు మామిడి పండు ప్రేమికులుఅయితే మాత్రం నోరు కట్టుకుంటారా చెప్పండి.ఎందుకంటే ఇది మామిడిపళ్ళ సీజన్ వచ్చేసింది. దీనికోసమే మామిడి పండుప్రియులు సంవత్సరం అంతా వీటికోసం ఎదురు చూస్తూ ఉంటారు.నోరు ఊరించే నూజివీడు రసాలు, కోసుకు తినే పళ్ళు, కలెక్టర్ కాయలు,తోతాపురి కాయలు,బెనిషా ,చిన్నరసాలు ,పెద్దరసాలు ఎన్నిరకాల మామిడిపళ్ళు అసలు మామిడి పండునుఆశ్వాదిస్తూ తింటుంటే ఎంత ఆనందంగా ఉంటుందోతినే వాళ్ళకే తెలుస్తుంది. అయితే మామిడి పండును తింటున్నప్పుడు కొన్నివిషయాలు తప్పనిసరిగా పాటించండి.వేసవి కాలం వస్తూనే మార్కెట్లో ఫలరాజు మామిడి పండు చేసే సందడి వేరు. రకరకాల మామిడిపళ్ళు మనకు మార్కెట్లో దర్సనమిస్తాయి.అసలు మామిడి పండు అంటే ఇష్టపడని వాళ్ళు ఉంటారా చెప్పండి. మామిడి పండ్లు మార్కెట్లో కనపడడం పాపం రాత్రి పగలు అదే పనిగా మామిడి పళ్ళను జుర్రేస్తూ ఉంటారు.వాటిధర ఎంతైనా కాని అవి తినితీరాల్సిందే అంటారు.అయితే మామిడి పండు తినే వారు కొన్నిఅంశాల పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.మామిడి పండు తిన్న వెంటనే మరి ఎఇతర వస్తువు తినకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. అలా చేయకుంటే మీరు అనారోగ్యం పాలవ్వడం ఖాయం.మీరు ముందు ముందు మామిడిపళ్ళు తిని ఆస్వాదించాలని జాగ్రత్తలు పాటించండి. మామిడి పండు తిన్న వెంటనే కొన్నిరకాల వస్తువులు తినకూడదు అన్న విషయం తెలిసిన వాళ్ళు తక్కువే.మిమ్మల్ని మీరు రక్షించుకోకుంటే అది మీకే కష్టం రండి అదిఎమిటో చూద్దాం.

1) మామిడి పండు తిన్నాక కూల్ డ్రింక్ తాగవద్దు...

ఏదైనా తిన్న తరువాత సహజంగా ఎవరికైనా దాహం వేస్తుంది. ముఖ్యంగా తీపి వస్తువులు తిన్నాక దాహం వేస్తుంది. దానికి నీళ్ళు తాగితే చాలు కూల్ డ్రింక్స్ శీతల పానీయాలు అంటే సోడా,పంచదార కలిపిన ఇతర పానీయాలు శరీరానికి హాని కలిగిస్తాయి.మామిడి పండులో సహజంగానే తీపి శాతం ఎక్కువగా ఉంటుంది. ఆతరువాత కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ పెరిగే ప్రమాదం ఉంటుంది.

2) పెరుగు తినవద్దు...

దక్షణాది రాష్ట్రాలలో సహజంగా భోజనం తరువాత పెరుగు అన్నం లో అరటి పండు,లేదా వేసవి కాలంలో  మామిడి పండు తినడం అలవాటు.ఇంకొందరు మామిడి పండు తిన్నాక చివరన చేతిలో పెరుగు వేసుకుని తినడం అలవాటు.అది సరైన పద్ధతి కాదు.ఎందుకంటే మామిడి పండు పెరుగు కలిపి తినడం వల్ల కార్బన్ డైయాక్సైడ్ తయారు అవుతుంది దీనివల్ల పొట్టలో పలు రకాల సమస్యలు వాస్తాయి.

౩)నీరు తాగడం...

ఏ మైనా తిన్న వెంటనే మంచినీళ్ళు తాగడం సరైన పద్దతికాదు. తిన్న తరువాత దాహం వేయడం సహజం. కొంతసేపు ఆగిన తరువాత నీటిని తాగడం మంచిది.మామిడి పండు తిన్న వెంటనే నీరు తాగితే అరగడానికి తీవ్ర ఇబ్బంది పడుతుంది.దీనివల్ల గ్యాస్ గుండెల్లో మంట వంటి సమస్యలురావచ్చు

ఖారం లేదా మసాలాలకు దూరంగా ఉండండి ...

సహజంగా వేసవి కాలం లో భోజనం తరువాత మామిడి పండు తినడానికి ఇష్టపడతారు.అయితే ప్రస్తుత పరిస్థితులలో ఈ పద్ధతి సరైనది కాదు.మసాలాతో కూడిన ఖారం తిన్న తరువాత మామిడి పండు తింటే పొట్టలో మంట, వికారం,తెమిలినట్లు గా ఉండడం వంటి సమస్యలు.వస్తాయి ఒక్కోసారి వెక్కిళ్ళు వంటి సమస్యలకు దారితీయవచ్చు.

కాకరకాయ తినవద్దు ...

మనం సహజంగా భోజనం చేస్తున్నప్పుడు మీ పళ్ళెం లో కాకర కాయ మామిడి పండు కలిపి తినడం ద్వారా పొట్టకు సంబంధించిన సమస్యలురావచ్చు మామిడి పండు తిన్న వెంటనే కాకర కాయ తినడం వల్ల వాంతులు కడుపులో మంట,కడుపులో మెలిప్ప్పినట్టుగా  ఉండడం ఇతర వస్తువులు తినలేని పరిస్థితి సమస్యలు వస్తాయి. సో అదండీ మామిడి పండు ఇతర వస్తువులతో కలిపితీసుకుంటే వచ్చే అనర్ధాలు.చెప్పడం మావంతు ఆచరించడం ఆచరించక పోవడం మీవంతు.       

                         

By
en-us Political News

  
నేటి కాలంలో నిమ్మరసం ఎంతో ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి . శరీరాన్ని చల్లబరచడం నుండి డీహైడ్రేషన్‌ను నివారించడం వరకు నిమ్మరసం ప్రయోజనాలు..
కొన్నిసార్లు శరీరంపై నీలం లేదా ఊదా రంగు మచ్చలు  కనిపిస్తాయి. చాలా వరకు ఇలాంటి మచ్చలు ఏవైనా గాయాలు లేదా దెబ్బలు తగిలినప్పుడు బయటకు రక్తం కారడం..
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో, మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది శరీరానికి కావలసిన పోషకాలను సరిగ్గా అందజేయలేకపోతున్నారు. ఈ క్రమంలో శరీరంలో విటమిన్లు, ఖనిజాల లోపాన్ని భర్తీ చేయడానికి..
గుండె మానవ శరీరంలో అత్యంత కీలకమైన అవయవం, ఇది శరీరమంతటికీ ఆక్సిజన్ , పోషకాలను అందించడానికి నిరంతరం రక్తాన్ని పంపింగ్ చేస్తుంది. అయితే, మారుతున్న జీవనశైలి, ఒత్తిడి,  ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం అనేది ఒక సవాలుగా మారింది. ముఖ్యంగా 30-32 ఏళ్ల చిన్న వయసులోనే జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూనో, ఫంక్షన్లలో డ్యాన్స్ చేస్తూనో అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్న వార్తలు మనల్ని..
చాలామంది రాత్రి వేళల్లో హాయిగా నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా కాళ్ల పిక్కలు పట్టేయడం (Leg Cramps at Night) వల్ల తీవ్రమైన నొప్పితో మేల్కొంటూ ఉంటారు. కండరాలు గట్టిగా బిగుసుకుపోయి, కాళ్లు కదల్చలేనంతగా వచ్చే ఈ నొప్పిని ఆయుర్వేదంలో..
వేడి, విరేచనాలు లేదా వాంతులు వంటివి శరీరంలోని నీరు , ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను త్వరగా దెబ్బతీస్తాయి. ఇలాంటి పరిస్థితులలో ఓఆర్ఎస్ తాగడం చాలా ముఖ్యం. చాలా నీరసంగా ఉన్నప్పుడు, ఆహారం సరిగా తీసుకోలేనప్పుడు...
ప్రతి మనిషి ఇతర మనిషికి చాలా  విభిన్నంగా, ప్రత్యేకంగా ఉంటారు. కొందరు చాలా శాంతంగా ఉంటారు, మరికొందరు ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ చాలా చలాకీగా ఉంటారు. ఇంకొందరు చాలా చిన్న విషయాలకే తొందరగా కోపం
భారతీయులకు టీ, కాఫీ ఒక పెద్ద ఎమోషన్. గతంలో కంటే ప్రస్తుతకాలంలో  టీ తాగేవారి సంఖ్య చాలా పెరిగింది.  ఏదైనా పని చురుగ్గా చేయాలంటే చాలామంది మొదటగా టీ తాగుతారు.  ఇక పని మధ్యలో కూడా టీ తాగుతూ ఉత్సాహం తెచ్చుకుంటారు...
బలమైన రోగనిరోధక వ్యవస్థ అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా వైరస్‌లు, బ్యాక్టీరియా , ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే సమస్యలను చాలా వరకు నివారించవచ్చు. అయితే రోజురోజుకూ జీవనశైలి పేలవంగా మారడం..
ఉదయాన్నే నిద్రలేచి మంచం దిగగానే కాలి మడమలో సూదితో గుచ్చినట్లుగా తీవ్రమైన నొప్పి వస్తుంది కొందరికి.  ఇలా లేవగానే ఆ నొప్పితో కొన్ని అడుగులు వేయడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. చాలామంది ఈ నొప్పిని సీరియస్ గా తీసుకోరు.  కొద్దిసేపు అలా నడవగానే అదే తగ్గిపోతుందిలే అని కాంప్రమైజ్ అయిపోతారు....
మన శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన అవయవాలు. అవి రక్తాన్ని శుద్ధి చేస్తూ, విషతుల్యాలను బయటకు పంపుతాయి. కానీ, దురదృష్టవశాత్తూ కిడ్నీ సమస్యలు వస్తే అది ఒక పీడకలలా మారుతుంది. డయాలసిస్ బెడ్ మీద గంటల తరబడి గడపడం..
నోటి ఆరోగ్యం అనేది మన సంపూర్ణ ఆరోగ్యానికి ముఖద్వారం లాంటిది. చాలా మంది పళ్ళను తెల్లగా, శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుందని అనుకుంటారు, కానీ పళ్ళ కంటే వాటిని పట్టి ఉంచే చిగుళ్ల ఆరోగ్యం చాలా ముఖ్యం. చిగుళ్ల వ్యాధులు..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.