Publish Date:Aug 29, 2024
అసలు 908 కోట్లేంటండీ బాబు.. పైగా అది కూడా జరిమానా.. పైగా మన భారతీయ ఎంపీకి! సదరు ఎంపీ 908 కోట్లు జరిమానాగానే కట్టే స్థాయిలో వున్నాడంటే, ఆయన గారి అసలు ఆస్తి ఎంత వుంటుందో కదా..! ఇంతకీ ఎవరా ఎంపీ, అంత జరిమానా ఎవరు విధించారు? ఎందుకు విధించారు? ఆ వివరాల్లోకి వెళ్తే, తమిళనాడులోని అర్కోణానికి చెందిన డీఎంకే పార్టమెంట్ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి జగద్రక్షకన్‌కి ఈడీ (ఎన్‌ఫోర్స్.మెంట్ డైరెక్టరేట్) 908 కోట్ల జరిమానా విధించింది. ఈ ఎంపీ మీద మనీలాండరింగ్ కేసు వుంది. ఈ కేసు విషయంలో 2020లో ఈయన ఇల్లు, ఇతర ప్రాంతాల మీద ఈడీ సోదాలు నిర్వహించి దాదాపు 90 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసింది. జగద్రక్షన్‌కి చెందిన సంస్థలు, పరిశ్రమలు పన్నులు సక్రమంగా చెల్లించలేదన్న ఆరోపణలో ఈడీ ఈ సోదాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఫారిన్ ఎక్స్ఛేంజ్ నిర్వహణ చట్టం కింద జగద్రక్షన్‌కి ఈడీ 908 కోట్ల రూపాయల జరిమానా విధించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/dmk-mp-jagadrakshakan-fine-25-183865.html
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు పోలీస్ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.
దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
ఖైరతాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా.. అసాధారణ ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన
కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న వేళ.. దాని భవిష్యత్తుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో సెప్టెంబర్ 22న జరిగిన 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి హత్య ఉదంతం
మోసపోయాం.. గోసపడుతున్నాం..సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం.!
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో కోకాపేట్ నియోపోలిస్ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి అత్యంత వేడెక్కింది
విద్యావలయంలో గంజాయి మొక్క కలకలం..!
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని.