యుఎస్ ఓపెన్‌కు జోకో దూరం.. కారణం ఏమిటంటే..
Publish Date:Aug 26, 2022
Advertisement
కరోనా వ్యాక్సిన్ వేయించుకోనందుకు సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ మరో గ్రాండ్ స్లామ్‌కూ దూరమ య్యాడు. వ్యాక్సిన్ తీసుకోని వారికి అమెరికాలో ప్రవేశానికి అనుమతి లేదు. సోమవారం మొదల య్యే ఈ ఏడాది ఆఖరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్ నుంచి వైదొలగుతున్నట్టు జొకోవిచ్ గురువారం ప్రకటిం చాడు. టీకా వేసుకోని జోకోను ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలి యన్ ఓపెన్ ఆడేందుకు అనుమతించని విషయం తెలిసిందే. వ్యాక్సిన్ వేసుకోకుండా ఆస్ట్రేలియా లో అడుగుపెట్టిన నొవాక్‌ను బలవంతంగా ఆ దేశం నుంచి పంపించారు. ఇప్పటి వరకు మూడు సార్లు చాంపియన్‌గా నిలిచిన నొవాక్ జొకోవిచ్ తాను న్యూయార్క్‌లో జరిగే యూ ఎస్ ఓపెన్‌లో పాల్గొనేందుకు నేను ప్రయాణం చేయలేక పోతున్నాని, ఇది విచారకరమనీ అన్నాడు. అయితే తనకు మద్దతు, ప్రేమ తెలిపిన వారికి ధన్యవాదాలు. సహచర ప్లేయర్లకు గుడ్ లక్` అని ట్వీట్ చేశారు. 35 ఏళ్ల సెర్బియన్ ఖాతాలో 21 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లున్నాయి. స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ (22 టైటి ల్స్) కంటే ఒకటి తక్కువ. దీన్ని తాజా గ్రాండ్‌స్లామ్‌లో జొకో సాధిస్తాడని అభిమానులు ఆశించారు. అతను 2011, 2015, 2018లో మూడుసార్లు విజేతగా నిలిచాడు. మరో ఆరుసార్లు రన్నరప్‌గా తృప్తి పడ్డాడు. ఇంతటి ఘన రికార్డు ఉన్న అతనికి న్యూయార్క్‌లో మరో టైటిల్ గెలవడం, నాదల్ రికార్డును సమం చేయడం కష్టం కాదు. అయితే అమెరికా, కెనడా దేశాల్లో స్వదేశీయులు తప్ప టీకా తీసుకోని విదేశీయులను అనుమ తించడం లేదు కొవిడ్ ప్రొటోకాల్స్ ప్రకారం అమెరికాకు వెళ్లడానికి జొకోవిచ్. వ్యాక్సినేషన్ చేయించుకున్న వారు మాత్రమే అమెరికాకు వెళ్లడానికి నిబంధనలు అనుమతినిస్తాయి. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఆస్ట్రే లియా ఓపెన్ టెన్నిస్ టోర్నీకి ముందు వెనక్కు పంపిన సంగతి తెలిసిందే. ఇలా ఒక టెన్నిస్ ఓపెన్ చాంపి యన్ షిప్‌కు జొకోవిచ్ దూరం కావడం ఇది రెండోసారి.
http://www.teluguone.com/news/content/djokovic-messes-us-open-reason-39-142707.html





