మాధురి మామూలు జాదూ కాదండోయ్!

Publish Date:Aug 12, 2024

Advertisement

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో ఇంతకాలం చక్కగా ‘అడల్ట్రీ’వ్యవహారం నడుపుకుంటున్న వైసీపీ నాయకురాలు దివ్వెల మాధురి వ్యవహారశైలి చూస్తుంటే వామ్మో మామూలు మహిళ కాదు.. మహా జాదూ అనే విషయం అర్థమవుతోంది. దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ పాలిటిక్స్ సందర్భంగా ఆమె మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మాటలు వింటుంటే మహామహులకే బుర్ర తిరిగిపోతోంది. ఇంతకాలం పలువురు వైసీపీ నాయకుల మీద లైంగిక ఆరోపణలు వచ్చినా, అడ్డంగా దొరికపోయినా ‘అలాంటిదేమీ లేదు.. అంతా ప్రతిపక్షాల కుట్ర’ అనే మాటలే జనం విన్నారు తప్ప.. ఇలా దివ్వెల మాధురిలాగా ‘ఎస్.. మా ఇద్దరికీ సంబంధం వుంది’ అని ధైర్యంగా చెప్పడం ఇంతవరకు కనీవినీ ఎరుగని వ్యవహారం. నిలువెత్తు దర్శనం ఇచ్చిన గోరంట్ల మాధవ్ సైతం ‘ఆ వీడియోలో వున్నది నేను కాదు’ అని సిగ్గుపడుతూ చెప్పడం చూశాం గానీ.. ‘అవును మా మధ్య సంబంధం వుంది’ అంటూ దివ్వెల మాధురి కనబరిచిన తెగింపు మాత్రం మామూలు విషయం కాదు.

దువ్వాడ శ్రీనివాస్ ‘ఆయనకిద్దరు’ వ్యవహారంలో అన్ని వైపుల నుంచి తన మీద ఒత్తిడి పెరిగిపోయేసరికి దివ్వెల మాధురి కారు యాక్సిడెంట్ చేసి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. సాక్షాత్తూ మాధురి కూడా తాను ఆత్మహత్య చేసుకోవడానికే కారు యాక్సిడెంట్ చేసినట్టు చెబుతోంది. కానీ, ఆమె చేసింది ఆత్మహత్యాయత్నం కాదని, సంచలనం క్రియేట్ చేసే ప్రయత్నమని పరిశీలకులు అంటున్నారు. దివ్వెల మాధురి యాక్సిడెంట్ చేసిన కారు చాలా సేఫ్టీ మెజర్లు వున్న కారు అని తెలుస్తోంది. ఓ మోస్తరు యాక్సిడెంట్‌కి గురైనప్పటికీ సదరు కారులో వున్న వారికి ఏమీ కాదని తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన మాధురి, కారు ప్రమాదం క్రియేట్ చేసి ఆత్మహత్యాయత్నం చేసినట్టు కలరింగ్ ఇచ్చినట్టు అర్థమవుతోంది. యాక్సిడెంట్ అయి కార్లు వెల్లకిలా పడిపోయినప్పటికీ, మాధురి హాయిగా మీడియా మైకుల ముందు గంటలకు గంటలకు స్పీచ్‌లు ఇస్తూనే వుంది. ఈ మహాతల్లి గుద్దిన కారులో వున్న ముగ్గురు వృద్ధులు మాత్రం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మాధురి నిజంగానే ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంలో వుంటే ఆమెకి ఇంట్లోనే ఎన్నో అవకాశాలు అందుబాటులో వుంటాయి. కన్ఫమ్‌గా పైకి పోయే ఎన్నో ఆప్షన్లు వుంటాయి. ఇలా రోడ్డు మీదకి సేఫ్టీగా వుండే కారులో యాక్సిడెంట్ చేయాల్సిన అవసరం వుండదని పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
సంతానం కలగలేదన్న కారణంతో భార్యను తప్పుబడుతూ విడాకులు కోరలేరని మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
శారీరక వైకల్యాన్ని జయించి..అమెజాన్‌లో కొలువు కొట్టిన నిట్ గ్రాడ్యుయేట్.!
వాతావరణ మార్పుల ఎఫెక్ట్: కిడ్నీ ఆరోగ్యంపై షాకింగ్ రిపోర్ట్.!
బతుకమ్మ సంబరాల నుంచి ఇంటికి వెళ్తుండగా విషాదం.!
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం తెలుగు రాష్ట్రాల్లో ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ వ్యక్తిగత జీవితంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అవినీతి బాగోతాన్ని వెలుగులోకి తెచ్చారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
జాతీయ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడెక్కుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కాంగ్రెస్ న్యాయపోరాటానికి దిగింది.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వెస్ట్ బైపాస్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.