వరద బాధితులకు అండగా దివీస్..!
Publish Date:Sep 2, 2024
Advertisement
వరద ముప్పును ఎదుర్కొంటున్న విజయవాడ ప్రజలకు పలువురు అండగా నిలుస్తున్నారు. పలు సంస్థలు తమవంతు సహకారాన్ని అందిస్తున్నాయి. విజయవాడలోని అనేక కాలనీలలో ప్రజలు, పిల్లలు, వృద్దులు భోజన సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారన్న వార్తలు దివీస్ సంస్థ యాజమాన్యాన్ని కదిలించాయి. దివీస్ యాజమాన్యం వెంటనే స్పందించి ప్రతి రోజూ లక్షా 70 వేల మందికి పైగా ప్రజలకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనాలను హరేకృష్ణ చారిటబుల్ ఫౌండేషన్, ఏ.పీ, అక్షయ పాత్ర అనుబంధ సంస్థ సహకారంతో అందజేస్తున్నామని దివీస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మురళీకృష్ణ దివి తెలిపారు. వార్తల ద్వారా తెలుసుకుని వెంటనే స్పందించి ముంపు ప్రాంతవాసులకు ఆహారాన్ని అందించేందుకు సహకరిస్తున్న దివీస్ యాజమాన్యాన్ని ప్రభుత్వ ప్రతినిధులు అభినందించారు.
http://www.teluguone.com/news/content/divis-labs-support-to-people-25-184137.html





