రాహుల్ విదేశీ పర్యటనపై మళ్ళీ రగడ ...మరో రచ్చ సంవత్సరానికి 65 విదేశీ పర్యటనలు ?

Publish Date:May 26, 2022

Advertisement

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడున్నారు? అంటే, కాంగ్రెస్ అధికార ప్రతినిధులు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి గతంలో చూశాం, ఇప్పుడు చూస్తున్నాం, దేశంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సమయంలోనూ రాహుల్ గాంధీ, ఉన్నట్లుండి విదేశీ పర్యటనలకు వెళ్లి పోవడం ఇతరుల సంగతి ఎలా ఉన్నా కాంగ్రెస్ అధికార ప్రతినిధులకు కొంత ఇబ్బందికరంగానే ఉందనేది కాదనలేని నిజం. నిజానికి, రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు చాలావరకు వ్యక్తిగత పర్యటనలే అయినా,  రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు వెళ్ళిన ప్రతిసారీ, ఆయన  ఎక్కడికి వెళ్లారు, ఎందుకు వెళ్ళారు ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. మీడియా అడిగే ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేని ఇబ్బందికర పరిస్థితులను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు పేస్ చేస్తూనే ఉన్నారు.  అది ప్రత్యక్షంగా కనిపిస్తూనే వుంది. మొన్నటికి మొన్న, కాంగ్రెస్ పార్టీ పునర్జీవనానికి సంబంధించి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, ప్రిపేర్ చేసిన ‘రివైవల్ ప్లాన్’ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పై పార్టీ  సీనియర్ నాయకులతో చర్చలు జరుగతున్న సమయంలో రాహుల్ గాంధీ అర్ధాంతరంగా విదేశీ పర్యటనకు వెళ్ళారు. 

అలా వెళ్ళిన ఆయన చివరకు, నేపాల్’ రాజధాని ఖాట్మండూ నైట్ క్లబ్’లో కనిపించారు. అదికూడా, నేపాల్ లోని చైనా అంబాసడర్’ గా అనుమానిస్తున్న చైనా అమ్మాయితో కలిసి కనిపించారు. ఆ వీడియోను, బీజీపీ సోషల్ మీడియా సెల్ వైరల్ చేసింది. అయితే ఆయన మిత్రుని వివాహానికి వెళ్ళారని, అది కూడా తప్పేనా, అని కాంగ్రెస్ రాహుల్ గాంధీ పర్యటనను సమర్ధించుకుంది. అయితే, ఆ మిత్రుడు మయన్మార్ లో నేపాల్ రాయబారిగా పని చేసిన, ‘భీమ్ ఉదాస్ కుమార్తె కావడం మరో వావడానికి తెరతీసింది. భారత వ్యతిరేకిగా ముద్రపడిన ఉదాస్ కుమార్తె వివాహానికి రాహుల్ హాజరు కావడం కూడా వివాదంగా మారింది. 

అలాగే గతంలోనూ కాంగ్రెస్ పార్టీ స్థాపక  దినోత్సవానికి ఒక రోజు ముందు రాహుల్ గంది విదేశాలకు వెళ్ళడం, నిన్నమొన్నటి యూపీ, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అదే విధంగా ఆయన విదేశీ పర్యటనలో ఉండి పోవడం, పార్లమెంట్ సమావేశాలకు ముందు ఏకంగా నెలరోజుల పాటు దేశంలో కనిపించక పోవడం ఇలా అనేక సందర్భాలలో రాహుల్ గాంధీ విదేశీ’ పర్యటనలు వివాదస్పదం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అవిర్భావ వేడుకల్లో రాహుల్ గాంధీ ఎందుకు పాల్గొనలేదన్న ప్రశ్న ఎదురు కావడంలో ప్రియాంక కూడా కొంత ఇబ్బంది  పడ్డారు. సమాధానం చెప్పకుండానే వెళ్లి పోయారు. అప్పట్లో ఆ వీడియో కూడా వైరల్ అయింది. 

అదలా ఉంటే, రాహుల గాంధీ బ్రిటన్‌ పర్యటనపై తాజాగా వివాదం చెలరేగుతోంది. లండన్‌కు బయలుదేరే ముందు భారత్‌ ప్రభుత్వం నుంచి ఆయన ‘పొలిటికల్‌ క్లియరెన్స్‌’ తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. విదేశాల్లో పర్యటన చేసే క్రమంలో ప్రతి పార్లమెంట్‌ సభ్యుడు తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి క్లియరెన్స్‌ తీసుకోవాల్సి ఉన్నప్పటికీ రాహుల్‌ గాంధీ మాత్రం అది పొందలేదని చెబుతున్నాయి. దీనిపై స్పందించిన కాంగ్రెస్‌.. ప్రైవేటు కార్యక్రమాలకు ఆ అవసరం లేదని వాదిస్తోంది.

‘ పార్లమెంట్‌ సభ్యుడు ఎవరైనా ఏదైనా విదేశీ పర్యటన చేసే సమయంలో భారత విదేశీ వ్యవహారాలశాఖ నుంచి పొలిటికల్‌ క్లియరెన్స్‌ తీసుకోవాల్సి ఉంటుంది. విదేశాల నుంచి ఎంపీలకు వచ్చే ఆహ్వానం కూడా భారత విదేశాంగశాఖ ద్వారానే రావాలి. విదేశీ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకునే వారు అందుకు సంబంధించిన వివరాలతో మూడు వారాల ముందే విదేశాంగశాఖ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. కానీ, రాహుల్‌ గాంధీ మాత్రం అలా చేయలేదు.’ అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కొన్ని సందర్భాల్లో ఆహ్వానం నేరుగా అందినట్లయితే.. ఆ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వశాఖకు తెలియజేసి పొలిటికల్‌ క్లియరెన్స్‌ పొందాలని చెబుతున్నాయి.

కాగా, లండన్ పర్యటనలో ఉన్న రాహుల్‌ గాంధీ పొలిటికల్‌ క్లియరెన్స్‌ తీసుకోలేదని మీడియాలో వచ్చిన కథనాలపై స్పందించిన కాంగ్రెస్‌ పార్టీ.. పార్లమెంట్‌ సభ్యులకు అటువంటి క్లియరెన్స్‌ అవసరం లేదని పేర్కొంది. ‘అధికారిక బృందం ఐతే తప్ప ప్రధాని నుంచి గానీ, ప్రభుత్వం నుంచి గానీ ఎంపీలు పొలిటికల్‌ క్లియరెన్స్‌ తీసుకోవాల్సిన అవసరం లేదు. టీవీ ఛానళ్లకు పీఎంఓ చేసిన వాట్సాప్‌ మెసేజ్‌లను గుడ్డిగా నమ్మెద్దు’ అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా పేర్కొన్నారు. అయితే, విదేశాంగ శాఖ, విడుదల చేసిన లేఖ, విదేశాంగ శాఖ నుంచి పొలిటికల్ క్లియరెన్స్‌తో పాటుగా, కేంద్ర హోమ్ శాఖ నుంచి ఎఫ్సీఆర్ఎ పర్మిషన్ తప్పని సరని పేర్కొంటోంది. అంతేకాదు,  విదేశీ పర్యటనలకు వెళ్ళే లోక్ సభ సభ్యులు, ఎందుకు వెళుతున్నారు, ఎక్కడ  ఉంటారు, వంటి పూర్తి వివరాలను లోక్ సభ స్పీకర్ కార్యాలయానికి తెలియ చేయాలని, అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 
అంతే కాదు, రాహుల్ గాంధీ ఏ కార్యక్రంలో అయితే పాల్గొన్నారో, అదే కార్యక్రమాలో పాల్గొనేందుకు లండన్ వెళ్ళిన ఆర్’జేడీ రాజ్యసభ సభ్యుడు మనోజ్ ఝా, పొలిటికల్  క్లియరెన్స్‌’తో సహా అన్ని అనుమతులు తీసుకున్నారని, అధికార వర్గాలు తెలియ చేస్తున్నాయి. 

అదలా ఉంటే, బ్రిటన్‌ పర్యటనలో ఉన్న రాహుల్‌ గాంధీ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయాన్ విదేశీ గడ్డపై చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించడంతో పాటుగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై వ్యక్తిగత  విమర్శలు కూడా చేశారు. దీంతో విదేశీ గడ్డపై భారత్‌ పరువు తీస్తున్నారని రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. మరోవంక రాహుల్ గాంధీ, కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చేసిన ప్రసంగంలో, ఇండియన్ ఫారిన్ సర్వీస్ ( ఐఎఫ్ఎస్ ) అధికారులకు’ అహంకారం అధికమని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద మయ్యాయి. ఆ తర్వాత, జమ్మూ కశ్మీర్’ భారతదేశంలో అంతర్భాగం కాదని, వాదించే  బ్రిటన్ లేఅబౌర్ పార్టీ నేత, జెరెమీ కార్బ్యన్’ తో రాహుల్ గాంధీ ప్రత్యేకంగా సమావేశం కావడంపై కూడావివాదం చెలరేగింది.  

అయితే కారణం ఏదైనా రాహుల గాంధీ విదేశీ పర్యటనలు వివాదస్పదం కావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కేంద్ర హోం శాఖ సమాచారం ప్రకారం.. 2015 నుంచి 2019 మధ్య రాహుల్ 247సార్లు విదేశాల్లో పర్యటించారు. అంటే రాహుల్ గాంధీ సంవత్సరానికి 65 విదేశీ పర్యటనలు చేస్తున్నారు. ఈ నేపధ్యలో ఒక  ప్రధాన రాజకీయ పార్టీకి చుక్కానిలా నిలిచిన నాయకుడు ఒక సంవత్సరంలో సగటున 65 విదేశీ పర్యటనలు ఎందుకు చేస్తున్నారు, అనేది ఇప్పుడుఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగా వినిపిస్తోంది.

By
en-us Political News

  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇప్పటికీ లాంగ్ కొవిడ్ తీవ్ర దుష్ప్రభావాలతో సతమతమవుతున్నారు.
సంతానం కలగలేదన్న కారణంతో భార్యను తప్పుబడుతూ విడాకులు కోరలేరని మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
శారీరక వైకల్యాన్ని జయించి..అమెజాన్‌లో కొలువు కొట్టిన నిట్ గ్రాడ్యుయేట్.!
వాతావరణ మార్పుల ఎఫెక్ట్: కిడ్నీ ఆరోగ్యంపై షాకింగ్ రిపోర్ట్.!
బతుకమ్మ సంబరాల నుంచి ఇంటికి వెళ్తుండగా విషాదం.!
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం తెలుగు రాష్ట్రాల్లో ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ వ్యక్తిగత జీవితంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అవినీతి బాగోతాన్ని వెలుగులోకి తెచ్చారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.