Publish Date:Aug 13, 2022
మునుగోడు టీఆర్ఎస్ లో అసమ్మతి పతాక స్థాయికి చేరింది. మునుగోడు ఉప ఎన్నికకు ముందు నియోజకవర్గ టీఆర్ఎస్ అసంతృప్త నేతల రహస్య సమావేశం కలకలం రేపింది. ఈ రహస్య సమావేశానికి నియోజకవర్గం నలుమూలల నుంచీ దాదాపు 300 మంది నేతలు హాజరయ్యారు. కూసుకుంట్ల ప్రభాకరరెడ్డికి వ్యతిరేకంగా ఈ సమావేశం జరిగినట్లు చెబుతున్నారు. ప్రభాకరరెడ్డికి వినా ఎవరికి టికెట్ ఇచ్చినా అందరం మనస్ఫూర్తిగా సహకరిస్తామని అసంతృప్త నేతలు అంటున్నారు. అయితే కూసుకుంట్ల ప్రభాకరరెడ్డికి పార్టీ టికెట్ ఖరారు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించేది లెదని అసమ్మతి నేతలు అంటున్నట్లు సమాచారం. ఈ రహస్య సమావేశం నేపథ్యంలో పార్టీ అగ్ర నాయకత్వం అప్రమత్తమైంది.
అసమ్మతులను బుజ్జగించే బాధ్యతను మంత్రి జగదీశ్ రెడ్డికి అప్పగించింది. అయితే ఆయన అసమ్మతి నేతలతో జరిపిన చర్చలు ఫలించలేదని అంటున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినా ప్రభాకరరెడ్డి విషయంలో రాజీ పడేది లేదని వారు భీష్మించినట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దండు మల్కాపూర్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో అసమ్మతి నేతలు సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మునుగోడు ఉపఎన్నిక ను కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో నియోజకవర్గ కారు పార్టీలో అసమ్మతి జ్వాలలు భగ్గుమనడం పార్టీకి మింగుడుపడటం లేదు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికను బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ కూడా సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో త్రిముఖ పోరు హోరాహోరీగా ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ లో ఒక్కసారిగా అసమ్మతి జ్వాలలు రేగడం ఆ పార్టీకి ఒకింత ఇబ్బందికరమేనని అంటున్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో విజయం ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తమదే అధికారం అని చాటుకోవాలన్న లక్ష్యంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు సర్వ శక్తులూ ఒడి మునుగోడును దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీలో అసమ్మతి సెగలు ఆ పార్టీని డిఫెన్స్ లో పడేసినట్లేనని పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/disidents-secreat-meeting-ahead-of-munugodu-by-election-25-141845.html
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ