తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి.. అసెంబ్లీలో చర్చకు ముఖం చాటేసిన వైసీపీ

Publish Date:Feb 24, 2026

Advertisement

గత కొద్ది కాలంగో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం అంశం ఆంధ్రప్రదేశ్ లో పెను రాజకీయ దుమారం రేపుతున్న సంగతి విదితమే.  దీనిపై అధికార తెలుగుదేశం కూటమి, వైసీపీ మధ్య మాటల యుద్ధం ఎడతెగకుండా కొనసాగుతోంది.  సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన  ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై దర్యాప్తు చేసి.. కల్తీ వాస్తవమేనని థృవీకరించింది. నిర్ధారించింది.  వాస్తవానికి ఇక్కడితో ఈ అంశంవై వివాదానికి ఫుల్ స్టాప్ పడాలి. ఇక కల్తీకి కారకులెవరు? అన్నది చట్టం చూసుకుంటుంది. 

అయితే వైసీపీ మాత్రం కల్తీ  విషయం అలా ఉంచండి.. లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో చంద్రబాబు చెప్పినట్లుగా జంతువుల కొవ్వు లేదుగా అంటే నానా హంగామా చేస్తోంది. చంద్రబాబు అవాస్తవాలను ప్రచారం చేశారని ఎదురుదాడి చేస్తున్నది. అక్కడితో ఆగకుండా  తన కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్ కు లబ్ధి చేకూర్చడం కోసమే చంద్రబాబు లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వినియోగం అంటూ ఆరోపణలు గుప్పించారంటూ విమర్శలు మొదలు పెట్టింది.  ఇందాపూర్ డైరీ తో కలిపి హెరిటేజ్ పై ఆరోపణలు మొదలుపెట్టింది. దీనిపై మండలిలో చర్చకు సిద్ధం అంటూ సవాల్ విసిరింది. ఆ సవాల్ ను స్వీకరించిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. చర్చ మండలిలో కాదు.. అసెంబ్లీలో చేద్దామంటూ అందుకు మంగళవారం (ఫిబ్రవరి 24)ముహూర్తం నిర్ణయించింది.  ప్రభుత్వం వ్యూహాత్మకంగా శాసనసభలో ఈ అంశాన్ని మంగళవారం (ఫిబ్రవరి 24) చర్చకు పెట్టింది. దమ్ముంటే సభకు వచ్చి చర్చలో పాల్గొనాలని వైసీపీకి సవాల్ కూడా విసిరింది.  

వాస్తవానికి వైసీపీకి ఇదో బంగారంలాంటి అవకాశం. సభకు హాజరై కల్తీ నెయ్యి వినియోగం విషయంలో తమ పార్టీపై వస్తున్న ఆరోపణలను ఖండించడమే కాకుండా.. ఇందాపూర్ డైరీ, హెరిటేజ్ పై తాను చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపడానికి అంది వచ్చిన ఒక అవకాశం. అయితే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి వైసీపీ ముందుకు రావకపోవడంతో లడ్డూ ప్రసాదం తయారీలో వైసీపీ చేస్తున్న వాదనలకు, ఆరోపణలకు విశ్వసనీయత లేకుండా పోయింది.  

ఇక అసెంబ్లీలో మంగళవారం (ఫిబ్రవరి 14) జరిగిన  చర్చలో చంద్రబాబు ప్రసంగం.. హైలైట్ గా మారింది. మొత్తంగా కల్తీ నెయ్యి అంశంలో తాను చేసిన ఆరోపణలు, అందుకు ఆధారమైన ఎన్డీడిబీ రిపోర్టు, మొత్తంగా  2022 నుంచి ఏం జరిగింది అనే దానిపై చంద్రబాబు ప్రసంగం సాగింది. ఇందుకు సంబంధించిన వివరాలు, ఆధారాలను సభ ముందుంచారు.  ఇక హెరిటేజ్ పై వైసీపీ ఆరోపణల డొల్ల తనాన్ని ఎండగట్టడమే కాకుండా.. భరతీ సిమోంట్స్ కోసం జగన్ నిబంధనలను ఎలా తుంగలో తొక్కారో కూడా కళ్లకు కట్టారు. హెరిటేజ్ తన కుటుంబ సంస్థ అని చెప్పిన చంద్రబాబు,  హెరిటేజ్ ఉత్పత్తులను ఎన్నడూ ప్రభుత్వ శాఖలు తీసుకోలేదని విస్పష్టంగా చెప్పారు. అందుకు భిన్నంగా జగన్ హయాంలో  భారతి సిమెంట్స్ ను ప్రభుత్వ నిర్మాణాల కోసం ఉపయోగించిన వైనాన్ని  ప్రస్తావించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళనకు పూనుకున్నామని.. అప్పుడే నెయ్యి కల్తీ వ్యవహారం బయటపడిందన్న చంద్రబాబు,  రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమిస్తే.. వైసీపీయే  సుప్రీంకోర్టుకు వెళ్లి సిబిఐ నేతృత్వంలోని సిట్ ను కోరిందని గుర్తు చేసిన చంద్రబాబు   ఆ సిట్ నెయ్యిలో కల్తీ జరిగిందని నివేదిక ఇచ్చిందనీ, చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిందనీ చెప్పారు.

దీనిపైనే  ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై  ఏకసభ్య కమిషన్ నియమించామని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఆ ఏక సభ్య కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ  వైసీపీ సుబ్రహ్మణ్యస్వామితో పిటిషన్ వేయించిదన్న ఆయన ఆ పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసిందనీ,  తప్పులు చేయడం, విచారణను  అడ్డుకోవడాలని ప్రయత్నించడం వైసీపీకి అలవాటేనన్న ఆయన  ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయనీ, ఆ పార్టీ చేసిన తప్పిదాలే ఇప్పుడు వారికి శాపాలుగా మారాయనీ చంద్రబాబు చెప్పారు. 

హెరిటేజ్ పై వైసీపీ తప్పుడు ఆరోపణలను సభ సాక్షిగా చంద్రబాబు ఎండగట్టారు. ఆత్మరక్షణ కోసమే వైసీపీ హెరిటేజ్ ను ఇందులోకి లాగిందన్న ఆయన, ఇండాపూర్ అనేది ప్రముఖ డైరీలకు కో మ్యానుఫ్యాక్చరింగ్ అందిస్తూ ఉంటుందని.. అందులో హెరిటేజ్ ఒకటని పేర్కొన్న చంద్రబాబు..   ఏ ప్రభుత్వ శాఖలో కూడా హెరిటేజ్ ఉత్పత్తులను వినియోగించుకున్న దాఖలాలు కుండబద్దలు కొట్టారు. 
అదే సమయంలో తమ ఆరోపణలకు ఆధారాలు చూపుతూ వాదనలు వినిపించాల్సిన వైసీపీ సభ్యులు మాత్రం అసెంబ్లీకి గైర్హాజరయ్యారు. అటెండెన్స్ కోసం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున సభకు వచ్చి వెళ్లిన జగన్  అండ్ కో.. అత్యంత కీలక విషయంలో చర్చ జరుగుతున్న సమయంలో మాత్రం  సభకు డుమ్మా కొట్టి పలాయనం చిత్తగించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిశీలకులు సైతం సభకు వైసీపీ గైర్హాజర్.. కల్తీ నెయ్యి విషయంలో తప్పు ఒప్పుకున్నదన్న భావన కలిగించేలా ఉందని అంటున్నారు.  మొత్తం మీద కల్తీ నెయ్యి విషయంలో  చర్చ నుంచి పలాయనం చిత్తగించడంతో వైసీపీ వాదనలు విశ్వసనీయత కోల్పోయాయని రాజకీయవర్గాలు అంటున్నాయి. 

By
en-us Political News

  
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.
జగన్ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్న మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా 198 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ ఇస్తే, వాటిలో 102 ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయని గుర్తుచేశారు.
వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా, బూతుల నానిగా అనితర సాధ్యమైన గుర్తింపు ఉన్న కొడాలి నాని, 2024 ఎన్నికలలో వైసీపీ పరాజయం, గుడివాడ నియోజకవర్గంలో తాను స్వయంగా ఓడిపోవడంతో వెనక్కు తగ్గారు. కేసుల భయంతో మౌనాన్ని ఆశ్రయించారు. అసలు రాజకీయాలలో ఉన్నారా లేరా అన్నంతగా సైలెంట్ అయిపోయారు.
జగన్ రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వచ్చి అత్యధికంగా బెంగళూరులోనే మకాం ఉంటుండం ఒక కారణమైతే.. రాష్ట్రానికి, సొంత జిల్లాకు వచ్చినప్పుడు కూడా కార్యకర్తలు, నాయకులకు అప్పాయింట్ మెంట్ దొరకని పరిస్థితి మరో కారణంగా చెబుతుంటారు. ముఖ్యంగా జగన్ అందుబాటులో లేకపోవడం ప్రభావం ఆయన సొంత జిల్లా కడపలో మరీ తీవ్రంగా ఉంది.
కవిత సైతం త‌న వ‌ల్ల పార్టీ ఎలా ఓడిపోయిందని ప్రకటించి చేతులు దులుపుకోవడం కాదు.. అందుకు సంబంధించి వివరణ ఇవ్వాలనీ, లెక్కలు తేల్చాలనీ డిమాండ్ చేయడం ద్వారా మొత్తం బీఆర్ఎస్ నే డిఫెన్స్ లో పడేశారు. దాని నుంచి బయటపడడానికి ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ రంగంలోకి దిగి.. అప్పటి కేటీఆర్, కేసీఆర్ ల ప్రసంగాలు, ప్రకటనలను రీ పోస్టు చేస్తూ హడావుడి చేస్తున్నది.
తుమ్మల నాగేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఐదు రోజుల కిందట దుబాయ్ వెళ్లారు. మంత్రి కుటుంబ సభ్యులలో ఒకరు అనారోగ్యంతో ఉండటంతో మెరుగైన చికిత్స అందించడం కోసం ఆయన దుబాయ్‌కు వెళ్లినట్లు సమాచారం. చికిత్స అనంతరం తిరిగి రావాలని భావిస్తున్న తరుణంలో పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చి, ఆ ప్రభావంతో దుబాయ్ విమానాశ్రయం మూతపడింది.
అదొక మార్ఫింగ్ వీడియో, ఏఐ జ‌న‌రేటెడ్ వీడియో అన్నారు. ఇందులో త‌న ప‌రువు తీసే కుట్ర దాగి ఉంద‌న్న బీఆర్ నాయుడు.. త‌న‌తో పాటు టీటీడీ ప్ర‌తిష్ట మంట‌గ‌లిపే య‌త్నం ఉంద‌ని ఆరోపించారు. అందుకే తాను సైబ‌ర్ క్రైమ్ ని ఆశ్ర‌యించానన్నారు.
ఆ పార్టీ అగ్రనాయకత్వం అప్పట్లో ప్రదర్శించిన ఉదాశీనత.. కవిత అవినీతిని సర్టిఫై చేసినట్లైందని అప్పట్లోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అదే విషయాన్ని కల్వకుంట్ల కవిత కోర్టు తీర్పు అనంతరం మీడియా సమావేశంలో ఎత్తి చూపారు. పార్టీ కోసం కాకుండా.. పార్టీలో ఉన్న కొందరి స్వార్థం కోసం తనను బలిపశువును చేశారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేశాయి.
2047నాటికి ఆంధ్రప్రదేశ్ ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యం అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట ఇస్తే అది జరిగి తీరుతుంది. ఆయన ఇచ్చిన లక్ష్యాన్ని అధిగమించడమే తన ముందున్న కర్తవ్యమని చెప్పారు.
లిక్కర్ పాలసీపై తప్పుడు కేసు పెట్టి ఆమ్ఆద్మీ పార్టీని అంతం చేయాలని ప్రధాని మోడీ, అమిత్ షాలు కుట్ర పన్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. సీబీఐ నమోదు చేసిన కేసులో తనతో పాటు అందరికీ క్లీన్ చిట్ ఇస్తూ న్యాయస్థానం చారిత్రక తీర్పు ఇచ్చిందన్నారు.
వైవీ తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంలో ఎంత సంపాదించుకున్నారో తనకు తెలియదు కానీ, మిగిలిన వ్యవహారాల్లో మాత్రం ఆయన బాగానే సంపాపదించారని పేర్కొన్నారు. ఒంగోలు నియోజకవర్గం నుంచి తాను ఇంత వరకూ ఏడు సార్లు పోటీ చేసి ఐదు సార్లు గెలిచానన్నబాలినేని, ఆ ఓడిపోయిన రెండు సందర్భాలలోనూ కూటమి చాలా బలంగా ఉందని గుర్తు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.