జగన్ తీరుతో వైసీపీ నేతల్లో నిర్వేద్వం

Publish Date:Oct 14, 2022

Advertisement

చేతులు కాలాకా ఆకులు పట్టుకున్న చందంగా ఉంది ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరు. అన్ని వైపుల నుంచి ప్రజల  నిరసన సెగలను ఎదుర్కొంటున్న తరుణంగా ఆయన గత్యంతరం లేక ఎన్నికల మూడ్ లోకి వెళ్లి పోయారా? ఎన్నికల సన్నాహాలకు శ్రీకారం చుట్టారా? అంటే అవుననే అంటున్నారు వైసీపీ ముఖ్య నేతలు. నిజానికి, ఎన్నికలకు  ఏడాదిన్నరకు పైగానే సమయముంది. ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అలోచన వుందా అంటే అదీ లేనట్లే అంటున్నారు. మరి అలాంటప్పుడు ఇప్పటి నుంచే ముఖ్యమంత్రి ఎన్నికల మూడ్ లోకి ఎందుకు వెళ్ళినట్లు? అంటే ముఖ్యమంత్రి మూడేళ్ళుగా కంటున్న కలలు ఒకటొకటిగా కరిగి పోవడమే  ఈ హడావిడికి అసలు కారణం అంటున్నారు.  అందుకే ఆయన ముందుగానే ఎన్నికల మూడ్ లోకి వెళ్లి పోయారని అంటున్నారు. 

నిజానికి ముఖ్యమంత్రి మొదటి నుంచీ కూడా సంక్షేమ పథకాల పేరిట సాగిస్తున్న పందారాలనే నమ్ము కున్నారు. ఇటు నుంచి మీట నొక్కి అటు వైపుకు నోట్లు పంపితే   అటు నుంచి ఓట్లు వచ్చిపడతాయని పంచరంగుల్లో పగటి కలలు కన్నారు. అయితే గంపెడు ఆశలతో మొదలు పెట్టిన గడప గడపకు కార్యక్రమం సంక్షేమ పథకాల అసలు రంగును బయట పెట్టింది. సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందిన ప్రజలు బ్రహ్మరథం పడతారని జగన్ రెడ్డి ఆశిస్తే  ఫలితాలు అందుకు పూర్తి విరుద్ధంగా వచ్చాయి. సంక్షేమం ఒక్కటే సరిపోదని, అభివృద్ధి ఎక్కడని జనం నిలదీయడంతో, జగన్ రెడ్డికి తత్త్వం బోధ పడిందని, అందుకే ఆయన, మంత్రులు, ఎమ్మెల్యేల పై  మండిపడుతున్నారని అంటున్నారు. 

ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నియోజక వర్గాల వారీగా సమావేశాలు మొదలు పెట్టారని అంటున్నారు. అందులో భాగంగా నిన్న గురువారం (అక్టోబర్ 13) కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే ముఖ్యమంత్రి మరో ఏడాదిన్నరలో ఎన్నికలకు వెళ్లబోతున్నామని, ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్దం కావాలని  పిలుపు నిచ్చారు. అయితే  సమావేశంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తఃలు ముఖ్యమంత్రి మాటా తీరులో మార్పు వచ్చిందని ఇదొక విధంగా అయన తోగిచుస్తున్న భయానికి సంకేతంగా ఉందని అంటున్నారు.  

మూడు సంవత్సరాల కాలంలో మనం చేసిన మంచి పనులన్నింటినీ ప్రజలకు వివరించి చెప్పాలని సూచించారు.బానే వుంది. అయితే, మూడేళ్ళలో చేసిన మంచి కంటే చేయని మంచే, ఎక్కువగా ఉందని  ముఖ్యంగా ప్రజలు అడుగుతున్న మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కార్యకర్తలు, నాయకులు గుర్తు చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి మాత్రం  పాత పాటనే పడుతున్నారని, అంటున్నారు.

 ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి ఈ మూడు సంవత్సరాల్లో రూ.1050 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో వేశామని అలాగే, ప్రతి సచివాలయానికి రూ.20 లక్షలను ముందుగా ప్రాధాన్యం ఉన్న పనుల కోసం కేటాయిస్తున్నట్లు చెప్పారని, అయితే ఇదే మాట చాలాకాలంగా చెపుతున్నా, జరుగుతున్నది ఏమీ లేదని అంటున్నారు. నిజనికి మూడేళ్ళుగా చిన్న పని అయినా చేయకుండా, ఇప్పడు  సచివాలయానికి రూ.20 లక్షలు ఇస్తే ఏ మూలకు వస్తుందని ప్రశ్నిస్తున్నారు.

మరోవంక ఎమ్మెల్యేలతో, మంత్రులతో కూడా తరుచుగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్న జగన్ ఆయా సమావేశాల్లో వారి నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించుకొని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నారని అంటున్నారు.అయితే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ముఖ్యమంత్రి, ముడున్నరేళ్ల తర్వాత ఏది చేయాలనుకుంటే అది అయ్యే పని కాదని  పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు.

By
en-us Political News

  
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఈ వినూత్న నిరసన ప్రదర్శనలకు మెల్లిమెల్లిగా జనం ముఖం చాటేస్తున్నారు. పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. ఆరంభంలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. అయితే క్రమక్రమంగా జనాదరణ కోల్పోయి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆ పార్టీ నిరసనలు తూతూ మంత్రంగా మారాయి.
ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో స్థానిక ఎన్నికల జరిగే అవకాశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఇప్పటికే తమ పార్టీ శ్రేణులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహాలను పక్కాగా అమలు చేయడానికి కూటమి పార్టీల ముఖ్య నేతల కీలక సమావేశం బుధవారం జరగనుంది.
హరీష్ రావు ఇప్పుడు తన కుటుంబ వ్యాపారమైన మిల్చీ మిల్క్  విషయంలో తలెత్తుతున్న ప్రశ్నలకు, వెల్లువెత్తుతున్న విమర్శలకూ సమాధానం చెప్పుకోలేక సతమతమౌతున్నారు.
విజయ్ ప్రస్తుతం చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డు (ఈసీఆర్) లోని నీలాంకరి నివాసంలో ఉంటున్నారు. అక్కడి నుంచి ఆయన సచివాలయం ఉన్న రాజాజీ రోడ్డుకు రోజువారీ ప్రయాణం చేస్తున్నారు.
భౌగోళికంగా, రాజకీయంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు వేర్వేరు రాష్ట్రాలుగా విడిపోయినా, భాష, సంస్కృతి పరంగా తెలుగు ప్రజల మధ్య బంధం విడదీయరానిదని అన్నారు. తెలుగు సినిమా రంగానికి ప్రజలను ఏకం చేసే అద్భుతమైన శక్తి ఉందంటూ ఆమె వ్యాఖ్యానించారు.
తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఆదివారం నిర్వహించిన టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ నేతల సమావేశం ఉద్రిక్తంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగాయి.
తెలంగాణ రక్షణ సేన పార్టీకి గుర్తింపు ఇవ్వాలని పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు.
సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడిందన్న కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ తీరు పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజా రంజక పాలనను పూర్తిగా గాలికొదిలేసి కేవలం ప్రతిపక్షాలపై నిందలు వేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.
తెలంగాణ షాబాద్ లో ఆరుగురిని అత్యంత కిరాతకంగా చంపిన రాజ్ కుమార్ కు, సొంత బాబాయిపై గొడ్డలి వేటు, సొంత తల్లీ, చెల్లిని గెంటేసిన జగన్ కూ మనస్తత్వ పరంగా పోలీకలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పరిశ్రమల పేరుతో యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి, వేల ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను ఇలా కారుచౌకగా కేటాయించడంపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే, భూములు పొందిన తర్వాత గాలి జనార్ధన్ రెడ్డి అక్కడ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడంలో పూర్తిగా విఫలమయ్యారు. పరిశ్రమ పెట్టకపోగా, ఈ ప్రభుత్వ భూములను జాతీయ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి దాదాపు 350 కోట్ల రూపాయల మేర రుణాలు పొంది బ్యాంకులను సైతం మోసం చేశారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి.
ముందస్తు ఎన్నికల ప్రచారాలపైనా సీఎం స్పష్టత ఇచ్చారు. కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. ఎవరో ఏదో అనుకున్నారని తాము ముందస్తుకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు.
నిన్న మొన్నటి వరకూ వైసీపీకి, వివాదాస్పద యూట్యూబర్ ప్రశ్న రావణ్ కు అనుకూలంగా గళమెత్తిన జడ శ్రవణ్ కుమార్ అంత లోనే.. ఇలా యూటర్న్ తీసుకుని వైసీపీపై విరుచుకు పడటం విశేషం. తనకు వైసీపీ ఫండింగ్ చేస్తోందని వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చే క్రమంలో ఆయన వైసీపీ దోపిడీని ఎండగట్టారు. వైసీపీ తనకు ఫండింగ్ చేయడమేంటని ప్రశ్నించిన ఆయన ఆ పార్టీ నేతలు ఎంగిలి మెతుకులను కూడా వదలకుండా దోచేసుకుంటారని దుయ్యబట్టారు. జగన్ పాలనా కాలమంతా దోపిడీ రాజ్యమేలిందని విమర్శలు గుప్పించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.