వైసీపీలో రగులుతున్న అసమ్మతి అగ్గి

Publish Date:Apr 29, 2023

Advertisement

చాలా రోజులుగా వైసీపీలో అసమ్మతి చాపకింద నీరులా విస్తరిస్తోందని  పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఆ అసమ్మతి భగ్గుమని పార్టీ హైకమాండ్ కు ఆ సెగ తగలడానికి ఇంకెంతో కాలం పట్టదని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఏడాది కిందట ఏపీ ముఖ్యమంత్రి జగన్ మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరించినప్పుడు రగిలిన అసమ్మతి జ్వాల ఇప్పుడు భగ్గుమంటోంది.  

జగన్ బంధువు, మాజీ మంత్రి బాలినేని రూపంలో వైసీపీ పార్టీకీ, జగన్ సర్కార్ కీ గట్టి షాక్ తగిలింది. మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో జిల్లాకు చెందిన మరో మంత్రి ఆదిమూలం సురేష్ ను మంత్రి వర్గంలో రెండవసారి అవకాశం ఇచ్చిన  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బంధువైన తనను పక్కన పెట్టడంతో అప్పుడే అసంతృప్తి వ్యక్తం చేసిన మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ ఆ తరువాత తమాయించుకుని సర్దుకుపోయినట్లు కనిపించినా కీలెరిగి వాతపెట్టన చందంగా సమయం చూసి గట్టి షాక్ ఇచ్చారు. ఓ వంక బాబాయి మర్డర్ కేసులో బ్రదర్ అవినాష్ రెడ్డి అరెస్టు, తదనంతరం చోటు చేసుకునే పరిణామాలు భయపెడుతుంటే, అదే సమయంలో మరో బంధువు బాలినేని శ్రీనివాస రెడ్డి  వైసీపీ రీజినల్ కో- ఆర్డినేటర్ పదవికి   రాజీనామా చేసి జగన్ కు గట్టి షాకే ఇచ్చారు. బాలినేని తన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి పంపించారని అంటున్నారు.

మంత్రి పదవి నుంచి బాలినేనిని తప్పించిన జగన్ ఆయనను ప్రస్తుతం చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల వైసీపీ సమన్వయ కర్తగా నియమించారు. అయితే జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్‌‌కు జగన్ కేబినెట్‌లో రెండో సారి చోటు దక్కింది. దీనిపై బాలినేని ఆగ్రహంతో ఉన్నారు. అలాగే తనకు వ్యతిరేకంగా పార్టీలో కొంతమంది పనిచేస్తున్నారని ఇటీవలే బహిరంగంగా వ్యాఖ్యానించారు. అలాగే ఇటీవల మార్కాపురంలో సీఎం జగన్ మోహన్‌రెడ్డి సభ వద్ద పోలీసులు తనను అడ్డుకోవడంపై బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్‌ చేస్తే తప్ప బాలినేని వేదికపైకి రాలేదు. ఆ సంఘటన జరిగిన నాటి నుంచి పార్టీ అధిష్టానంపై బాలినేని గుర్రుగా ఉన్నారని పార్టీ శ్రేణులే అంటున్నాయి.  ప్రకాశం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత, వైఎస్ జగన్‌కు  బంధువైన బాలినేని..  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు నుంచి జగన్‌తో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో మంత్రి పదవిని కూడా త్యాగం చేసి జగన్ పార్టీలో చేరారు.

ఒంగోలులో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ తరుపున మొదటి సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి జగన్ వెంటే ఉంటూ వచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాలినేని మంత్రి పదవి చేపట్టారు. కానీ మూడేళ్లు తిరిగే సరికి ఆయనను జగన్ పక్కనపెట్టేశారు. అదే సమయంలో జిల్లాలో మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిమూలపు సురేష్‌ను మరోసారి మంత్రిగా కొనసాగించారు. అయితే జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రుల్లో ఒకరిని తొలగించి మరొకరిని కొనసాగించడం వల్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని అప్పట్లోనే జగన్‌కు బాలినేని వివరించారు. అయినప్పటికీ బాలినేని మాటలను పట్టించుకోని జగన్.. మంత్రిపదవి నుంచి బాలినేని తొలగించి.. ఆదిమూలపు సురేష్‌ను పురపాలక శాఖ మంత్రిగా కొనసాగించారు.

దీంతో అప్పటి నుంచి అసంతృప్తితో రగిలిపోతున్న బాలినేని మార్కాపురం ఘటనతో ఇక సర్దుకు పోవలసిన అవసరం లేదన్న నిర్ణయానికి వచ్చేశారు.  జిల్లాలో ముఖ్యమైన లీడర్‌గా ఉన్న బాలినేని... వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేయడం.. జిల్లా రాజకీయాలతో పాటు మొత్తం వైసీపీ పార్టీలోనే ప్రకంపనలు సృష్టిస్తోంది.  ముందు ముందు బాలినేని రూట్లోనే మరిందరు ఎమ్మెల్యేలు అడుగులు వేసే పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి సైతం జగన్ తీరు పట్ల తన అసహనాన్నీ, అసంతృప్తినీ బాలినేని కోర్డినేటర్ పదవికి రాజీనామా చేసిన రోజునే వ్యక్తం చేయడం ఎంత మాత్రం కాకతాళీయం కాదని పార్టీ శ్రేణులే అంటున్నాయి. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ఇలా ప్రాంతాలతో సంబంధం లేకుండా జగన్ పార్టీలో అసమ్మతి జ్వాలలు భగ్గుమంటూనే ఉన్నాయననీ, బాలినేని, పెద్దారెడ్డి లాగే రానున్న రోజులలో మరింత మంది తమ అసమ్మతి, అసంతృప్తిని బహిర్గతం చేసే అవకాశాలున్నాయనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇప్పటికే వివేకా హత్య కేసులో అవినాష్ ను కాపాడడానికి జగన్ తన పరిధి దాటి వ్యవహరించారన్న భావన పార్టీ శ్రేణుల్లో బలంగా వ్యక్తమౌతోంది. ఎంత ప్రయత్నించినా అవినాష్ ను సీబీఐ అరెస్టు నుంచి తప్పించలేకపోయిన జగన్ ఇక ఆ కేసు అక్కడ నుంచి ముందుకు సాగకుండా.. విపక్షాలు ఆరోపణలు, విమర్శలు సంధిస్తున్నట్లుగా తాడేపల్లి ప్యాలెస్ వైపు అడుగులు పడకుండా ఉంటే చాలన్న భావనకు వచ్చారనీ, అందుకే ఇప్పుడు  పార్టీలో అసమ్మతి లుకలుకలు, నేతల మధ్య విభేదాల పరిష్కారంపై దృష్టి పెట్టే అవకాశం ఇసుమంతైనా లేదనీ అంటున్నారు. అందుకే ముందు ముందు వైసీపీలో అసమ్మతి ఆగ్రహ జ్వాలలు మరింతగా ప్రజ్వరిల్లే అవకాశాలున్నాయని అంటున్నారు. 

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.