కాంగి‘రేసు’కు అసమ్మతి కళ్లెం!?

Publish Date:Oct 28, 2023

Advertisement

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట.. కాంగి‘రేసు’కు అసమ్మతి కళ్లేం వేస్తున్నదా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ప్రజా వ్యతిరేకతతో బీఆర్ఎస్, అంతర్గత కుమ్ములాటలతో బీజేపీ డీలాపడిన వేళ.. అనూహ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఐక్యతారాగం ఆలపిస్తూ కాంగ్రెస్ దూసుకుపోతున్నది. గతంలో పరిస్థితి ఎలా ఉన్నా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తరువాత మాత్రం కాంగ్రెస్ లో అసమ్మతి, గ్రూపు విభేదాలు దాదాపుగా సమసిపోయాయన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి.

ఎవరికి వారు.. తమలో విభేదాలు ఉంటే తరువాత చూసుకుందాం.. ముందు అధికారం కోసం సమైక్యంగా కదులుదాం అన్నట్లుగా పార్టీ రాష్ట్ర నాయకులంతా ముందుకు సాగుతున్నారు. అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ రెండో జాబితా విడుదలైందో.. ఒక్కసారిగా అసమ్మతి భగ్గుమంది. ఎన్నికల విజయంపై ధీమాతో రేసుగుర్రంలా ముందుకు దూసుకెడుతున్న కాంగ్రెస్ కు కళ్లెం పడింది. ఒక్క సారిగా టికెట్ ఆశించి భంగపడిన నేతలు నిరసన గళం విప్పారు. రాజీనామాల బాట  పట్టేలా  కనిపిస్తున్నారు.  టికెట్ రాక  భంగపడిన నాయకులు తమ అనుచరులతో ఆత్మీయ  సమావేశాలను ఏర్పాటు చేసుకున్నారు. భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టారు. ముందుగా టికెట్ ఆశించి భంగపడ్డ విష్ణువర్ధన్ రెడ్డి పార్టీకి  రాజీనామా  చేశారు. ఆయన దివంగత నేత పీజేఆర్ తనయుడు కావడం విశేషం. విష్ణువర్ధన్ రెడ్డి ఆశించిన జూబ్లీహిల్స్ స్థానాన్ని మాజీ క్రికెటర్ అజాహరుద్దీన్ కు కేటాయించింది. అలాగే ఇబ్రహీంపట్నం నుంచి పార్టీ టికెట్ ఆశించిన దండెం రాంరెడ్డి సైతం తన అసమ్మతిని బాహాటంగానే వెల్లడించారు.

ఇబ్రహీం పట్నం టికెట్ దక్కకపోవడంతో దండెం రాంరెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. మహేశ్వరం టికెట్ లక్ష్మారెడ్డికి ఇవ్వడంపై పారిజాత నర్సిహా రెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హుస్నాబాద్, మునుగోడు, ఎల్లారెడ్డి,  నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలలో కూడా అసమ్మతి భగ్గుమంది. ఆయా నియోజకవర్గాలలో టికెట్ ఆశించిన నేతలు కూడా కాంగ్రెస్ ను వీడే యోచనలో ఉన్నారు. భవిష్యత్ కార్యాచరణపై ఆత్మీయులతో సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం మీద నిన్నటి వరకూ ఆల్ ఈజ్ వెల్ అన్నట్లు కనిపించిన తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు అసమ్మతి మంటలు రేగుతున్నాయి. ఆగ్రహ జ్వాలలు ఎగసి పడుతున్నాయి.

వీరితో పాటు రెండో జాబితాలో కూడా టికెట్ దక్కని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా అలకబూనినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆయన ఆశించిన స్థానం నుంచి కేసీఆర్ పోటీకి దిగుతుండటంతో ఆయన ప్రత్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ ను రంగంలోకి దింపాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఆయనను నిమాజాబాద్ అర్బన్ నుంచి బరిలోకి దింపాలని హైకమాండ్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అయితే అక్కడ నుంచి పోటీకి షబ్బీర్ అలీ పెద్దగా సుముఖత చూపడం లేదని అంటున్నారు.  అలాగే పాలమూరు జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగసిపడుతున్నాయని అంటున్నారు.  

By
en-us Political News

  
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య సమక్షంలో కమలం కండువా కప్పుకుని బీజేపీలో చేరారు. వీరు ముగ్గురూ ఇలా బీజేపీలో చేరారో లేదో అలా బీజేపీ హైకమాండ్ వీరి రాజీనామాతో ఖాళీ అయిన ఆ మూడు రాజ్యసభ స్థానాల ఉపఎన్నికలకే వీరినే తమ అభ్యర్థులుగా ప్రకటించింది.
దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్లపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) గురించి కనీస అవగాహన లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు అజ్ణానంతో చేశారని తాను భావిస్తున్నాననీ, ఒకవేళ ఆయన తెలిసి బుద్ధిపూర్వకంగానే ఉపా చట్టాన్ని ఉప్మా యాక్ట్ అని అవమానించి ఉంటే, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను కించపరిచినందుకు ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఇప్పుడు చలామణి అవుతున్న పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కి మధ్య ఇటీవలి కాలంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రతిపాదన తెచ్చినప్పుడు దొనకొండ పేరును గట్టిగా వినిపించాలని జగన్‌కు సీనియర్ నేత మైసూరా రెడ్డి సహా పలువురు సూచించారు. కానీ.. జగన్ అసెంబ్లీలో ఆ విషయాన్ని మర్చిపోయి విజయవాడ చుట్టుపక్కల రాజధాని పెట్టాలంటూ మాట్లాడారని, ఆ తర్వాత మాట మార్చలేక కాలయాపన చేశారని మధుసూదన్ రెడ్డి చెప్పారు.
రాయలసీమలో వైసీపీ  కీలక నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్  ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయిన వారి చూపు ఇప్పుడు జనసేనపై ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఈ క్రమంలోనే వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని, త్వరలోనే గ్రేటర్ రాయలసీమలో వైసీపీ  ఖాళీ  అయిపోయినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు. 
ఒకవేళ కోర్టులో ఇవి ఎడిటెడ్ వెర్షన్లు అని రుజువైతే.. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందని, ఇది ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని హెచ్చరించారు.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్.. తాను గ్రౌండ్ రియాలటీని గత ఎన్నికల సమయంలో చెప్పినా నమ్మలేదనీ, తాను 2014 ఎన్నికల్లోనూ, మొన్నటి 2024 ఎన్నికల్లోనూ కూడా ఆరు నెలల ముందే చంద్రబాబు, లోకేష్‌లకు సీట్ల మార్జిన్ గురించి కచ్చితమైన అంచనాలు చెప్పినా వినలేదని.. తీరా చూస్తే క్షేత్రస్థాయిలో తాను చెప్పిన ఫలితాలే వచ్చాయని ఉదహరించారు.
తాజాగా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై.. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కొత్త రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే ధ్యేయంగా సాగిన ఈ పర్యటన ఏపీ యువతకు ఉపాధి అవకాశాల వెల్లువను తీసుకురానుంది. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాల 3ఎస్ మోడల్ తో పారదర్శక పాలన అందిస్తామని కొరియా దిగ్గజాలకు లోకేష్ భరోసా ఇచ్చారు.
2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.