పాపం దానం.. కింకర్తవ్యం

Publish Date:Jan 17, 2026

Advertisement

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారం క్లైమాక్స్ కు చేరుకుంది.  మొత్తం పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఫిరాయింపు ఆరోపణలు ఉండగా, వారిపై అనర్హత వేటు విషయంలో అసెంబ్లీ స్పీకర్  గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలపై తన నిర్ణయాన్ని వెలువరించారు. ఆ ఏడుగురూ పార్టీ ఫిరాయించారనడానికి ఎటువంటి ఆధారాలూ లేవనీ, వారు బీఆర్ఎస్ లోనే ఉన్నారనీ స్పష్టమైనే తీర్పు ఇచ్చారు.  

ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్,  స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే మాకనూరు సంజయ్ లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఈ ముగ్గురిలో కూడా దానం నాగేందర్ పరిస్థితి ఒకింత భిన్నంగా ఉంది. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన తరువాత కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే కాకుండా, ఆ పార్టీ తరపఫున లోక్ సభ ఎన్నికలలో పోటీకి కూడా దిగారు. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నారని స్పీకర్ చెప్పడానికి ఇసుమంతైనా అవకాశం లేదని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన ముందున్న మార్గమేంటని పరిశీలిస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అనర్హత వేటు నుంచి తప్పించుకోవడమే కాకుండా, తన రాజీనామా ద్వారా వచ్చే ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగడం. ఇది ఒక్కటే దానం నాగేందర్ ను అనర్హత వేటు నుంచి బయటపడేయగదని పరిశీలకులు అంటున్నారు. అలా కాకుండా ఎమ్మెల్యేగా కొనసాగి అనర్హత వేటుకు గురైతే తదుపరి ఎన్నికలలో పోటీకి కూడా ఆయన అనర్హుడయ్యే అవకాశం ఉందంటున్నారు.   బహిరంగంగా వేరే పార్టీ గుర్తుపై పోటీ చేసిన వ్యక్తి పార్టీ మారలేదు అని స్పీకర్ తీర్పు ఇచ్చే అవకాశాలు ఇసుమంతైనా లేవని అంటున్నారు.   

By
en-us Political News

  
కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
2023 ఎన్నిక‌ల నాటి పరిస్థితులను ఒక్కసారి గమనిస్తే.. ఇదే కామారెడ్డి కేంద్రంగా కాంగ్రెస్ సీఎం అభ్య‌ర్ధి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ సీఎం అభ్యర్థి పోటీ పడగా, ఇరువురూ పరాజయం పాలయ్యారు. బీజేపీకి చెందిన వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. ఒకే ఎన్నికలో ఇద్దరు సీఎంలను ఓడించిన ఘనత సాధించారు. ఇక ప్రస్తుతానికి వస్తే.. కామారెడ్డిలో ఎప్పుడూ కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య పోటాపోటీ వాతావరణం ఉంటుంది. అటువంటిది.. ఆ రెండు పార్టీలూ చెట్టాపట్టాలేసుకుని మరీ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులను పంచుకోవడం విడ్డూరంగా ఉందంటున్నారు కామారెడ్డి జనం.
డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్, వరప్రసాద్, లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇలా పలువురు బ్యూరోక్రాట్లు పాలిటిక్స్ లోకి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు, కుంటున్నారు. వీరిలో జయప్రకాశ్ నారాయణ లోక్ సత్తా పార్టీ తరఫున 2009 లో కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి విజయ సాధించారు.
పురపోరులో ఈ స్థాయిలో పరాజయాన్ని మూటగట్టుకుని కూడా ఓటింగ్ శాతం చూడండి.. గత లోక్ సభ ఎన్నికలతో పోలిస్తే బీఆర్ఎస్ కు వచ్చిన ఓట్ల శాతం పెరిగిందనీ, కాంగ్రెస్ కు తగ్గిందనీ చెబుతూ సొంత భుజాలను చరిచేసుకుంటోంది. అయితే.. బీఆర్ఎస్ ఓట్ల శాతం భాష్యంపై జనంలో పెద్దగా స్పందన రావడం లేదు.
జ‌య మ‌ర‌ణించిన వెంట‌నే అన్నాడీఎంకేలో నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్ ఉండాల్సిన వారు శశికళ. అయితే.. ఆమె పై అప్ప‌టి వ‌ర‌కూ రిజ‌ర్వులో తీర్పును వెంట‌నే వెలువడి ఆమె జైలుకు వెళ్లడం వెనుక ఉన్నది ఢిల్లీ పెద్దలే అంటారు పరిశీలకులు. అంతే కాదు ఆమెను పార్టీ నుంచి స‌స్పెండ్ కూడా ఆయ్యారు. ఇప్పుడు చూస్తే శ‌శిక‌ళ జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి సొంత కుంపటి పెట్టుకుంటున్నారు.
జగన్ అక్రమాస్తుల కేసు, ఓబులాపురం మైనింగ్ కేసులలో సీబీఐ జేడీగా ఆయన దర్యాప్తు సాగించిన తీరు పట్ల అప్పట్లో సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా లంచాలు తీసుకున్న జడ్జిని కూడా పట్టుకుని తన నిజాయితీని చాటుకున్నారు.
లోపల కూర్చున్నవారే కరుస్తారు, కుక్కలు కరవవు అని రేణుకా చౌదరి వ్యాఖ్యానించారంటూ.. బీజేపీ ఎంపీలు ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎంపీలను అవమానించేలా, వారి పరువుకు నష్టం కలిగించేలా రేణుక మాట్లాడారని ప్రివిలేజ్ కమిటీ ఆమెకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది.
త‌న‌ను ట్రోల్ చేస్తున్నార‌నీ.. వారంద‌రికీ చెప్పేదేంటంటే ఇది జ‌స్ట్ ట్రైల‌ర్ మాత్ర‌మే. ముందుంది అస‌లు సినిమా అంటూ వార్నింగ్ ఇచ్చారు క‌విత‌.
పయ్యావుల బడ్జెట్ ప్రసంగం మొత్తం ఆత్మస్థుతి, పరనిందేనని విమర్శించారు. అంకెల గారడీ తప్ప ఏ మాత్రం పసలేని బడ్జెట్ అంటూ బడ్జెట్ ప్రసంగంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ పేర్లను పదిసార్లు ప్రస్తావించడం తప్ప ప్రజలకు మేలు చేసే అంశాలు లేవని విమర్శలు గుప్పించారు.
ఆంధ్రప్రదేశ మద్యం కుంభకోణం విషయంలో విజయసాయిరెడ్డి సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఇక ఇటీవలి కాలంలో ఆయన ట్వీట్లు, కామెంట్లు అన్నీ కూడా ఆయన కషాయ దళంలో చేరనున్నారన్న ప్రచారానికి కారణమయ్యాయి. తాజాగా విజయసాయి రెడ్డి ఆ ప్రచారంలో ఇసుమంతైనా అవాస్తవం లేదనిపించేలా సామాజిక మాధ్యమం వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు.
రాజకీయంగా సిద్ధాంతాలు ఎంత ముఖ్యమో, నేతలతో ఆత్మీయ పలకరింపు కూడా అంతే ముఖ్యమన్న లోకేష్ అంతటితో ఆగకుండా.. ఏఐ క్వాంటం ఎంత అవసరమో మనవీయ సంబంధాలూ అంతే అవసరమని చెప్పారు. కుటుంబాలతో బంధం బలోపేతం కోసమే డిన్నర్ సమావేశాలని చెప్పారు.
ఇప్పటి వరకు సాధించిన .. ఇంకా ఏం సాధించాల్సిన అంశాల ఆధారంగా బడ్జెట్ రూపొందించినట్లు చెప్పిన విత్త మంత్రి, ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
రూ.3,32,205 కోట్లతో పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రెవెన్యూ వ్యయం రూ.2,56,143 కోట్లు, మూలధన వ్యయం రూ.53,915 కోట్లుగా అంచనా వేశారు. ఇక రెవెన్యూ లోటు రెవెన్యూ లోటు రూ.22,002 కోట్లు. ద్రవ్య లోటు రూ.75,868 కోట్లుగా అంచనా వేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.