నేరాల్లో టీఆర్ఎస్ నేతలు- పార్టీపై వ్యతిరేకతకు బాటలు

Publish Date:Apr 24, 2022

Advertisement

తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులకు నేరాలలో ప్రమేయం ఉన్న సంఘటనలు వెలుగులోనికి రావడంతో రాష్ట్రంలో ఆ పార్టీపై వ్యతిరేకత వెల్లువెత్తుతోంది.
అసలు టీఆర్ఎస్ నాయకుల ప్రమేయం ఎలాంటి నేరాల్లో బయటపడిందో ఒక సారి చూస్తే...అధికారం అండతో వారెంతగా బరితెగించారో అర్ధమౌతుంది. ఉదాహరణకు...ఓ నాలుగు సంఘటనలను ప్రస్తావిస్తే...
 నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ సాజిద్ ఖాన్‌ 8వ తరగతి చదివే ఓ 15 ఏళ్ల  మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో పరారీలో ఉన్న అతడి కోసం నిర్మల్ పోలీసులు గాలిస్తున్నారు. ఇటు తెరాస పార్టీ నుంచి సాజిద్ ఖాన్ ను బహిష్కరించినట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆలస్యంగా వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాల్వంచ‌ కుటుంబం సామూహిక ఆత్మహత్య సంఘటనలో సాక్షాత్తూ ఎమ్మెల్యే కుమారుడి ప్రమేయం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ సంఘటనలో  మొండిగ రామకృష్ణ, అతని భార్య శ్రీలక్ష్మి, కూతురు సాహిత్య ప్రాణాలు కోల్పోయారు. మరో కూతురు సాహితి 60 శాతం గాయాలతో కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అప్పులపాలైన రామకృష్ణ  ఆత్మహత్య వెనుక ఎమ్మెల్యే కుమారుడున్నారనే ఆరోపణలున్నాయి.

మరో ఘటనలో రామయంపేట్ మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పృథివిరాజ్,తోట కిరణ్, కన్నాపురం కృష్ణగౌడ్, స్వరాజ్ లతోపాటు గతంలో రామయంపేట్ సిఐ గా పనిచేసిన నాగర్జున గౌడ్ లు గత ఏడాదిన్నరగా తమను వేధిస్తున్నారని పేర్కొంటూ  లైవ్లో సెల్ఫీ వీడియో తీసుకుని  పెట్రోల్ పోసుకుని తల్లీ కుమారుడు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు.

 మరో ఘటనలో పోలీసులు తనపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారంటూ  బీజేపీ మజ్దూర్ సంఘ్  ఖమ్మం అధ్యక్షుడు సాయి గణేశ్ పురుగులు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ప  మంత్రి పువ్వాడ అజయ్, స్థానిక టీఆర్ఎస్ నేతలు, సీఐ వేధింపుల వల్లే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని సాయి గణేశ్ తన సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు. ఇవే కాకుండా ఇంకా పలు సందర్భాలలో  ఆర్థిక, లైంగిక వేధింపులు, కబ్బాల వివాదాల్లో టీఆర్ఎస్ నాయకుల ప్రమేయంపై ఆరోపణలు ఉన్నాయి. 
రాష్ట్రంలో    టిఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్ర వివాదాల్లోకి తలదూర్చుతున్నారనడానికి  ఇవి కొన్ని ఉదాహరణలు.  ఇటువంటి నాయకుల కారణంగా రాష్ట్రంలో  టిఆర్ఎస్ పై, ఆ నాయకులపై   తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. అసహనం వ్యక్తమవుతోంది.  ఇటువంటి వారి వల్ల ప్రజలలో పార్టీ ప్రతిష్ట మసకబారుతోంది. అధికారంలో ఉన్న పార్టీ అండదండలు మెండుగా ఉండటంతోనే నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఓ వైపు టిఆర్ఎస్ పాలనపై రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉద్యమకారులు తీవ్ర అసంతృప్తితో ఉండగా, కొందరు పార్టీ నాయకుల తీరు పార్టీకి మరింత చెడ్డపేరు తెచ్చిపెడుతోంది.  
గత జనవరి   ఏప్రిల్ నెలలో ఇప్పటి వరకూ అంటే నాలుగు నెలల వ్యవధిలో టీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందన్న ఆరోపణలు వచ్చిన నాలుగు తీవ్ర నేర సంఘటనలు జరిగాయి. 15 ఏళ్ల బాలికపై లైంగిక దాడి, ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడేంతగా వేధింపులకు గురి చేయడం,  తల్లీ కొడుకులు ఆత్మహత్య చేసుకోవడం, ప్రత్యర్థి పార్టీకి చెందిన యువ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడేలా వేధించడం. ఈ నాలుగు ఘటనల్లోనూ  టిఆర్ఎస్ నాయకులకుప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం, ప్రమేయం ఉండటతో ఆ ప్రభావం మొత్తం రాష్ట్రంలో పార్టీపై ప్రతికూలంగా పడిందనడంలో సందేహం లేదు.    ఇప్పటికీ కోర్టు నోటీసులు పంపినా మంత్రి పువ్వాడపై ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఇక మరి కొన్ని సంఘటనల్లో సంబంధితులను పార్టీ నుంచి సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకుంది. అధికార పార్టీ నేతల ప్రమేయం ఉన్న కేసులలో పోలీసుల దర్యాప్తు నమమాత్రంగా సాగుతోందనీ, నిందితులను పట్టుకోవడంలో వారు ఏ మాత్రం చొరవ చూపడం లేదన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.  

By
en-us Political News

  
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.