మరో వివాదంలో దినకరన్... ఈసీకి లంచం
Publish Date:Apr 17, 2017
Advertisement
దిల్లీలోని ఓ హోటల్‌లో చంద్రశేఖర్‌ను అరెస్టు చేసి అతడిని నుంచి రూ. కోటి పైగా నగదు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే అతని విచారించగా.. ఈ డబ్బును దినకరన్ తరఫున ఎన్నికల కమిషన్ అధికారులకు లంచంగా ఇచ్చేందుకు తీసుకొచ్చినట్లు చెప్పినట్టు పోలీసులు తెలిపారు. మొత్తం రూ. 50కోట్లను ఎన్నికల అధికారులకు లంచంగా ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్లు చంద్రశేఖర్ పోలీసులకు చెప్పాడు. దీంతో ఢిల్లీ క్రైం పోలీసులు దినకరన్‌పై కేసు నమోదు చేశారు. దినకరన్, ఎన్నికల కమిషన్‌కు క్రైం బ్రాంచ్ పోలీసులు సమన్లు జారీ చేశారు.
శశికళ వర్గానికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆర్కే నగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో పెద్ద ఎత్తున డబ్బు పంచుతున్నట్టు ఆరోపణలు రాగా.. ఎన్నికను రద్దు చేశారు. ఇప్పుడు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు దినకరన్. అదేంటంటే.. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే పార్టీలో చీలికలు ఏర్పడిన సంగతి తెలిసిందే. పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఈ నేపథ్యంలో అమ్మ గెలిచిన ఆర్కే నగర్ నియోజక వర్గానికి ఉపఎన్నికకు గాను పార్టీ గుర్తు తమకు కావాలంటే.. తమకు కావాలని అటు పన్నీర్ సెల్వం వర్గం.. ఇటు శశికళ వర్గం పోటీ పడ్డాయి. కానీ ఈసీ మాత్రం రెండు వర్గాలకు ఝలక్ ఇస్తూ.. ఎవరికీ గుర్తు కేటాయించకుండా.. రెండు వర్గాలకి రెండు గుర్తులను కేటాయించింది. అయితే ఆసమయంలో పార్టీ గుర్తును తమకు దగ్గలన్న నేపథ్యంలో దినకరన్ ఈసీకి లంచం ఇచ్చేందుకు పూనుకన్నట్టు తెలుస్తోంది. చంద్రశేఖర్ అనే మధ్యవర్తిని పోలీసులు అరెస్ట్ చేయగా అసలు విషయం బయటపడింది.
http://www.teluguone.com/news/content/dinakaran-39-74001.html





