బీజేపీ అధిష్టానంతో విభేదాలే ధన్ ఖడ్ నిష్క్రమణకు కారణం?

Publish Date:Jul 25, 2025

Advertisement

ఉపరాష్ట్రపతి పదవికి ధన్ ఖడ్ రాజీనామా కు న్యాయమూర్తి వర్మ ఉదంతమే ప్రధాన కారణమని దాదాపుగా నిర్ధారణ అయ్యిందని పరిశీలకులు అంటున్నారు. ప్రతిపక్ష నాయకుల సంతకాలతో వర్మ అభిసంసన తీర్మానం ఆమోదించమే  ధన్ ఖడ్  నిష్క్రమణ కు కారణమైంది. అంతకు ముందే బీజేపీ పెద్దలతో ఆయనకున్న విభేదాలకు ఇది క్లైమాక్స్ గా భావించాల్సి ఉంటుందంటున్నారు. దన్ ఖడ్ రాజీనామాపై ప్రధాని మోదీ మక్తసరి స్పందన, అలాగే రాజీనామా ఉపసంహరణకు ఎలాంటి బుజ్జగింపులు లేకుండా తక్షణ ఆమోదమే ఇందుకు తార్కాణగా చెబుతున్నారు. ఆయన ధిక్కార వైఖరి పట్ల  ఆగ్రహంతో ఉన్న బీజేపీ పెద్దలు ఆయనపై అభిశంసన పెట్టాలని కూడా ఒక దశలో ఆలోచన చేశారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఆయనకు గౌరవ విడ్కోలు పలుకుదామన్న కాంగ్రెస్ ప్రతిపాదన ను కూడా ప్రభుత్వం తిరస్కరించడం కమలనాథులకు ఆయన పట్ల ఉన్న ఆగ్రహ స్థయిని తెలియజేస్తున్నదని చెప్పాల్సి ఉంటుంది.

ప్రొటోకాల్ విషయంలో ధన్ ఖడ్ కు కేంద్రానికి  విభేదాలు ఉన్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ పర్యటనలో ఈ విషయం ప్రస్ఫుటంగా బయటపడింది. జేడీవాన్స్ తనను కలవకపోవడం వెనుక కేంద్రం పాత్ర ఉందని ధన్ ఖడ్ ఆ సమయంలో బాహాటంగానే తన అసంతృప్తి వ్యక్తం చేశారు.  వాహనాల విషయంలో, మంత్రుల కార్యాలయాల్లో ఫోటోల విషయంలో  కూడా ధన్ ఖడ్, కేంద్రం మధ్య ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. వి రైతుల గిట్టుబాటు ధర విషయంలో  ధన్ ఖడ్ కేంద్రమంత్రిని నిలదీయడం వంటి సంఘటనలు కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాయి. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి శేఖర్ వ్యవహారం కూడా ధన్ ఖడ్ కు కేంద్రానికి మధ్య గ్యాప్ పెరగడానికి కారణమైంది.  ఇక చివరిగా రాజ్యసభలో కాంగ్రెస్ నేత ఖర్గేకు  అధికారపక్ష నేత నడ్డా కంటే ఎక్కువ సమయాన్ని ధన్ ఖడ్ కేటాయించడం ఈ విభేదాలకు పరాకాష్టగా మారింది.

 ఇక న్యాయమూర్తి వర్మ అభిశంసన వ్యవహారంలో  న్యాయవ్యవస్థను కూడా బాధ్యత వహించేలా చేయాలంటూ కేంద్రం ఆశలపై ధన్ ఖడ్ నీళ్లు చల్లడంతో  బీజేపీ పెద్దల ఆగ్రహం పీక్స్ కు చేరిందని పరిశీలకులు అంటున్నారు.  ఎన్డీయే ఎంపీల సంతకాలు లేకుండా ప్రతిపక్షాల తీర్మానాన్ని ఆమోదించవద్దని మూడు సార్లు ప్రభుత్వ పెద్దలు   ధన్ ఖడ్ కు సూచించినా ఆయన పట్టించుకోలేదు. ఇలా కేంద్రంతో ఆయన కు పొసగలేదనీ, దీంతో అనివార్యంగా రాజీనామా చేయాల్సి వచ్చిందని అంటున్నారు. దీంతో ఆయన రాజీనామా చేశారు. హమ్మయ్య అనుకుని కేంద్రం వెంటనే ఆయన తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరన్నదానిపై కసరత్తులలో మునిగిపోయింది.  

By
en-us Political News

  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.