మహా లుకలుకలు!.. ఫడ్నవీస్ సర్కార్ క్షేమమేనా?

Publish Date:Feb 21, 2025

Advertisement

మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఫడ్నవీస్ నేతృత్వంలోని సంకీర్ణ  ప్రభుత్వంలో లుకలుకలు బహిర్గతమయ్యాయి. ముఖ్యమంత్రి ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేల మధ్య సఖ్యత లేమి ప్రస్ఫుటమైంది. రాష్ట్రంలో మహాయతి కూటమి కొలువుదీరి ఆరునెలలు పూర్తయ్యిందో లేదో.. విభేదాలు రచ్కకెక్కడం గమనార్హం. 

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, శివసేన షిండే వర్గం అధినేత ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రి ఫడ్నవీస్ పై నిప్పులు చెరిగారు. తనను తేలిగ్గా తీసుకుంటే సహించేది లేదని హెచ్చరిక జారీ చేశారు. అసలు మహారాష్ట్ర ఎన్నికలలో మహాయతి కూటమి విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధమైనప్పుడే కూటమిలో విభేదాలు ఉన్నాయని స్పష్టమైంది. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో పీట ముడి పడింది. షిండే సీఎం పదవి కోసం గట్టి పోటీయే ఇచ్చారు. అయితే చివరికి బీజేపీ హైకమాండ్ సూచన మేరకు డిప్యూటీ సీఎం పదవికి అంగీకారం తెలిపారు. దీంతో ఫడ్నవీస్  సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచీ ఈ ఆరు నెలల కాలంలో షిండే వర్గం శివసేన, బీజేపీల మధ్య పరిస్థితి  ఉప్పూ నిప్పులాగే ఉంది.

ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఫడ్నవీస్ షిండే వర్గం ఎమ్మెల్యేలకు భద్రత కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు.  దీంతో ఏక్ నాథ్ షిండే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంతే కాదు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నిర్వహిస్తున్న సమావేశాలకు ఏక్‌నాథ్ షిండే  హాజరు కావడం లేదు.  ఇప్పటి వరకూ చాపకింద నీరులా తన అసమ్మతిని తెలియజేస్తూ వచ్చిన షిండే తాజాగా.. తనను తేలిగ్గా తీసుకుంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయంటూ ఫడ్నవీస్ కు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు.  2022లో శివసేన పార్టీని చీల్చి ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్న మహా వికాస్ ఆఘాడీ కూటమి ప్రభుత్వం కుప్పకూలిన విషయాన్ని అన్యాపదేశంగా గుర్తు చేశారు.  

అసలింతకూ షిండే ఈ స్థాయిలో రియాక్ట్ కావడానికి ఫడ్నవీస్ ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఇటీవలి ఎన్నికలకు ముందు వరకూ మహారాష్ట్ర సీఎంగా ఏక్ నాథ్ షిండే ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల అనంతరం కూటమి విజయం సాధించి ఫడ్నవీస్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. దీనిపై అసంతృప్తిగా ఉన్న షిండేను మరింత రెచ్చగొట్టడానికా అన్నట్లు ఫడ్నవీస్ ఇటీవల ఓ నిర్ణయం తీసుకున్నారు. షిండే సీఎంగా ఉండగా ఆమోదం తెలిపిన ఓ ప్రాజెక్టును షిండే ఏకపక్షంగా నిలిపివేశారు. దీంతో భగ్గుమన్న ఏక్ నాథ్ షిండే తనను తేలిగ్గా తీసుకోవద్దంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు.  2022లో ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ఉన్న సమయంలో తనను అందరూ తేలిగ్గా తీసుకున్నప్పుడు.. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టానని ఏక్ నాథ్ షిండే గుర్తు చేశారు. ఇప్పుడు ఫడ్నవీస్ తనను తేలిగ్గా తీసుకుంటున్నారనీ, ఆయన ప్రభుత్వాన్ని కూడా పడగొడతాననీ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.  ప్రభుత్వాన్ని పడగొట్టి స్వయంగా మీడియా ముందు ఏక్‌నాథ్‌ షిండే వెల్లడించారు. 

By
en-us Political News

  
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.