ఒకే వర లో రెండు కత్తులు.. విశాఖ సౌత్ లో కూటమి నేతల మధ్య విభేదాలు

Publish Date:Mar 4, 2026

Advertisement

విశాఖలో ఒకే వర లో రెండు కత్తులు అన్న రీతిన కూటమి నాయకుల వ్యవహారం కొనసాగుతోంది. ముఖ్యంగా విశాఖ సౌత్ లో తెలుగుదేశం, జనసేన నాయకులు మధ్య పొత్తు సక్రమంగా లేదన్న మాట  బహిరంగంగా వినినిపిస్తున్నది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా జనసేనకు చెందిన వంశీకృష్ణ శ్రీనివాస్ కొనసాగుతున్నారు. ఈ దశలో జీవీఎంసీ కి చెందిన పలువురు కార్పొరేటర్లు వైసీపీ నుంచి జనసేన, తెలుగుదేశంకు మద్దతుగా నిలిచారు  వీరంతా విశాఖ మేయర్ గా పీలా శ్రీనివాస్ ఎన్నిక  సమయంలో ఒక రకంగా పార్టీని ఫిరాయించారు అయితే ఈ కార్పొరేటర్లు అనుకున్న రీతిన కూటమి ధర్మాన్ని పాటించడం లేదు  దీనికి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న అధినాయకులు కారణం. నిజానికి ఇక్కడ టిడిపి ఇన్చార్జిగా గతంలో వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన సీతం  రాజు సుధాకర్ ఉన్నారు ఈయన వెంట వైసీపీకి చెందిన కార్పొరేటర్లతో తోపాటు టిడిపి కార్పొరేటర్లు కొందరు ఉన్నారు అదే సమయంలో  వైసీపీ నుంచి  జనసేనకు వచ్చి ఎమ్మెల్యేగా ఎన్నికైన వంశీకృష్ణ శ్రీనివాస్ వెంట కూడా కొందరు కార్పొరేటర్లు ఉంటున్నారు వీరందరూ కూడా తమతమ నాయకులకు అనుకూలంగా అడుగులు వేస్తున్నారు.   ఈ తరహాలో పార్టీ సభ్యత్వం నుంచి ఇతర వ్యవహారాల్లో కూడా తలో దిక్కు అడుగులు వేయడంతో కూటమి మధ్య సయోధ్య కరవైంది.  

 సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ  కొనసాగుతున్నది.  సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు.  ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు. ఈ పరిస్థితుల మధ్య కార్పొరేటర్ల పదవీకాలం మరొక రెండు వారాల్లో ముగుస్తోంది.  వీరిలో కొందరు నేరుగా తెలుగుదేశం నుంచి పోటీ చేసి కూటమిలో కొనసాగుతుంటే... మరి కొందరు ఇండిపెండెంట్ లు వైసీపీ నుంచి వచ్చి కూటమికి మద్దతుగా నిలిచారు.  అయితే తమ పదవీకాలం ముగిసిన తర్వాత వార్డుల్లో ఏ తీరున వ్యవహరిస్తారన్న విషయం అర్థం కావడం లేదు ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఓడిపోయిన కార్పొరేటర్ అభ్యర్థులు తిరిగి పార్టీ సింబల్ పై తమకు సీట్లు కావాలని గట్టిగా పట్టు పడుతున్నారు అయితే మేయర్ సీటు కోసం పార్టీ వీడి వచ్చిన తమకు కార్పొరేటర్ అభ్యర్థిగా సీటు కావాలని ఇతరులు అడుగుతున్నారు ఈ పరిస్థితుల్లో  నాయకుల మధ్య సయోధ్య లేకపోవడంతో తమ భవిష్యత్ ఏ రకంగా ఉంటుందో అని త్వరలో మాజీలు కాబోతున్న కార్పొరేటర్లు కలవర పడుతున్నారు.

ముఖ్యంగా సీతం రాజు సుధాకర్, సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మధ్య సయోధ్య లేకపోవడం వల్ల తమ రాజకీయ భవిష్యత్ అగమ్య గోచరంగా మారిందని కూటమి కార్పొరేటర్లు కలవర పడుతున్నారు మరోవైపు దేవాదాయ శాఖ ఆలయ  పాలకమండలి విషయంలో కూడా నాయకులకు అన్యాయం జరిగినట్టు  లో లోపల మధనపడుతున్నారు.   కూటమి ధర్మానికి భిన్నంగా ఈ నాయకుల వ్యవహారం ఉండటం కొందరికి లాభం, మరికొందరికి నష్టం జరుగుతోంది.  ఈ పరిస్థితుల మధ్య ఇప్పటికే తమకు అన్యాయం జరిగిందని బిజెపి నాయకులు బహిరంగ విమర్శలు చేస్తున్నారు.

ఈ పరిస్థితి ఒక రకంగా ఒక ఒరలో రెండు కత్తుల సమెతలా తయారైంది.   నిజానికి వైసీపీ నుంచి సీటు ఆశించిన సీతారామరాజు సుధాకర్,   వైసిపి  ఎమ్మెల్యే  అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ను ఓడించడంలో కీలకంగా వ్యవహ రించారు. అంతమాత్రాన అతనికి ప్రాధాన్యత ఇస్తూ కూటమి కార్పొరేటర్లకు అన్యాయం చేయలేమని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తన అనుచరుల వద్ద చెబుతున్నారు. అదే సమయంలో సుధాకర్ కూడా అసలు తన ప్రమేయం లేకపోతే జనసేనకు ఇక్కడ అవకాశం ఉండదని అంటున్నారు. నాయకులు వాదన ఏ రకంగా ఉన్నా తమ భవిష్యత్తుకు ఇబ్బందికరంగా ఉందని కూటమి ద్వితీయ శ్రేణి నాయకులు మదన పడుతున్నారు.

By
en-us Political News

  
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.