విశాఖలో ఒకే వర లో రెండు కత్తులు అన్న రీతిన కూటమి నాయకుల వ్యవహారం కొనసాగుతోంది. ముఖ్యంగా విశాఖ సౌత్ లో తెలుగుదేశం, జనసేన నాయకులు మధ్య పొత్తు సక్రమంగా లేదన్న మాట బహిరంగంగా వినినిపిస్తున్నది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా జనసేనకు చెందిన వంశీకృష్ణ శ్రీనివాస్ కొనసాగుతున్నారు. ఈ దశలో జీవీఎంసీ కి చెందిన పలువురు కార్పొరేటర్లు వైసీపీ నుంచి జనసేన, తెలుగుదేశంకు మద్దతుగా నిలిచారు వీరంతా విశాఖ మేయర్ గా పీలా శ్రీనివాస్ ఎన్నిక సమయంలో ఒక రకంగా పార్టీని ఫిరాయించారు అయితే ఈ కార్పొరేటర్లు అనుకున్న రీతిన కూటమి ధర్మాన్ని పాటించడం లేదు దీనికి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న అధినాయకులు కారణం. నిజానికి ఇక్కడ టిడిపి ఇన్చార్జిగా గతంలో వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన సీతం రాజు సుధాకర్ ఉన్నారు ఈయన వెంట వైసీపీకి చెందిన కార్పొరేటర్లతో తోపాటు టిడిపి కార్పొరేటర్లు కొందరు ఉన్నారు అదే సమయంలో వైసీపీ నుంచి జనసేనకు వచ్చి ఎమ్మెల్యేగా ఎన్నికైన వంశీకృష్ణ శ్రీనివాస్ వెంట కూడా కొందరు కార్పొరేటర్లు ఉంటున్నారు వీరందరూ కూడా తమతమ నాయకులకు అనుకూలంగా అడుగులు వేస్తున్నారు. ఈ తరహాలో పార్టీ సభ్యత్వం నుంచి ఇతర వ్యవహారాల్లో కూడా తలో దిక్కు అడుగులు వేయడంతో కూటమి మధ్య సయోధ్య కరవైంది.
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు. ఈ పరిస్థితుల మధ్య కార్పొరేటర్ల పదవీకాలం మరొక రెండు వారాల్లో ముగుస్తోంది. వీరిలో కొందరు నేరుగా తెలుగుదేశం నుంచి పోటీ చేసి కూటమిలో కొనసాగుతుంటే... మరి కొందరు ఇండిపెండెంట్ లు వైసీపీ నుంచి వచ్చి కూటమికి మద్దతుగా నిలిచారు. అయితే తమ పదవీకాలం ముగిసిన తర్వాత వార్డుల్లో ఏ తీరున వ్యవహరిస్తారన్న విషయం అర్థం కావడం లేదు ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఓడిపోయిన కార్పొరేటర్ అభ్యర్థులు తిరిగి పార్టీ సింబల్ పై తమకు సీట్లు కావాలని గట్టిగా పట్టు పడుతున్నారు అయితే మేయర్ సీటు కోసం పార్టీ వీడి వచ్చిన తమకు కార్పొరేటర్ అభ్యర్థిగా సీటు కావాలని ఇతరులు అడుగుతున్నారు ఈ పరిస్థితుల్లో నాయకుల మధ్య సయోధ్య లేకపోవడంతో తమ భవిష్యత్ ఏ రకంగా ఉంటుందో అని త్వరలో మాజీలు కాబోతున్న కార్పొరేటర్లు కలవర పడుతున్నారు.
ముఖ్యంగా సీతం రాజు సుధాకర్, సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మధ్య సయోధ్య లేకపోవడం వల్ల తమ రాజకీయ భవిష్యత్ అగమ్య గోచరంగా మారిందని కూటమి కార్పొరేటర్లు కలవర పడుతున్నారు మరోవైపు దేవాదాయ శాఖ ఆలయ పాలకమండలి విషయంలో కూడా నాయకులకు అన్యాయం జరిగినట్టు లో లోపల మధనపడుతున్నారు. కూటమి ధర్మానికి భిన్నంగా ఈ నాయకుల వ్యవహారం ఉండటం కొందరికి లాభం, మరికొందరికి నష్టం జరుగుతోంది. ఈ పరిస్థితుల మధ్య ఇప్పటికే తమకు అన్యాయం జరిగిందని బిజెపి నాయకులు బహిరంగ విమర్శలు చేస్తున్నారు.
ఈ పరిస్థితి ఒక రకంగా ఒక ఒరలో రెండు కత్తుల సమెతలా తయారైంది. నిజానికి వైసీపీ నుంచి సీటు ఆశించిన సీతారామరాజు సుధాకర్, వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ను ఓడించడంలో కీలకంగా వ్యవహ రించారు. అంతమాత్రాన అతనికి ప్రాధాన్యత ఇస్తూ కూటమి కార్పొరేటర్లకు అన్యాయం చేయలేమని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తన అనుచరుల వద్ద చెబుతున్నారు. అదే సమయంలో సుధాకర్ కూడా అసలు తన ప్రమేయం లేకపోతే జనసేనకు ఇక్కడ అవకాశం ఉండదని అంటున్నారు. నాయకులు వాదన ఏ రకంగా ఉన్నా తమ భవిష్యత్తుకు ఇబ్బందికరంగా ఉందని కూటమి ద్వితీయ శ్రేణి నాయకులు మదన పడుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/differences-between-alliance-leaders-39-215031.html
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు.
రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.