Publish Date:Oct 31, 2025
జగన్ పాలన గత ఐదేళ్ల పాటు చూశాం. అంతా ఒంటెత్తు పోకడ. ఎక్కడా పారదర్శకత అనేదే ఉండదు. ప్రజాస్వామికత అస్సలు కనిపించదు. అందరూ నోటికి తాళం వేసుకుని ఉండాల్సిందే. ఎందుకంటే ఇటు ఎమ్మెల్యేలు, అటు ఎంపీలు ఇలా ఎవరైనా సరే వారి వారి స్వశక్తితో గెలిచినట్టుగా జగన్ ఎట్టి పరిస్థితుల్లో భావించరు. వారిని సంబంధం లేని ప్రాంతాలకు పంపి పోటీ చేయించడం ఇందులో భాగమే. తాను ఎక్కడ ఎవర్ని నిలబెట్టినా వారంతా తన బొమ్మ మీద గెలుస్తారనే గట్టి నమ్మకం.. మొత్తానికి జగన్ ది నియంతృత్వ పోకడ.
ఇదంతా ఇలా ఉంటే కూటమిలో కేవలం సింగిల్ ఫేజ్ కాదు. ట్రిపుల్ ఫేజ్. ఏదైనా ఒక సమస్య వస్తే స్పందించడానికి ఇక్కడ మూడు రకాల ముఖచిత్రాలున్నట్టు కనిపిస్తోంది. అందులో ఫస్ట్ అండ్ మెయిన్ ఫేస్ సీఎం చంద్రబాబు. ఆయన తన అనుభవమంతా రంగరించి.. మరీ రంగంలోకి దిగుతారు. ఇక్కడ రెండో ఫేస్ పవన్ కళ్యాణ్. పవన్ నేర్చుకోవాలన్న తన ఉత్సాహాన్నంతా వాడి.. ఆయా సమీక్షలు, సమావేశాలు, పరిశీలనలు చేసి ఆదేశాలు ఇస్తుంటారు.
ఇక థర్డ్ ఫేస్ ఆఫ్ కూటమి మంత్రి లోకేష్. నారా లోకేష్ తన తండ్రి ద్వారా నేర్చుకున్నదంతా వాడి.. ఆయా సమస్యలకు పరిష్కార మార్గాలను వెతుకుతుంటారు. చాలా మంది కేంద్ర బీజేపీ, రాష్ట్ర బీజేపీ రెండింటినీ కలిపి డబుల్ ఇంజిన్ సర్కార్ గా చెబుతుంటారు. అలాగే ఇక్కడ ఏపీలో నడిచే కూటమి ప్రభుత్వం ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోందా? అంటే అవుననే చెప్పుకోవాలి. అదే.. జగన్ గవర్నమెంట్ లో అయితే.. కేవలం ఒకే ఒక్క మోనార్క్ జగన్ మాత్రమే నడిపిస్తారు. అన్నీ తనకే తెలుసు అన్న కోణంలో చేసే రొడ్డ కొట్టుడు పరిపాలన మాత్రమే సాగింది.
అదే కూటమిలో చంద్రబాబుకూ, లోకేష్ కీ ఎంతో భిన్నమైన వైరుధ్యంతో కూడిన పవన్ కళ్యాణ్ సడెన్ ఎంట్రీ ఇచ్చి.. ఆయా పనులు చక్క బెట్టడం తెలిసిందే. ఆయన ఒక డిప్యూటీ సీఎంగా ఏ విషయం లోనైనా తన అభిప్రాయాలను వెలిబుచ్చుతుంటారు. ఆపై కొన్ని కొన్ని సంచలన నిర్ణయాలూ తీసుకుంటూ ఉంటారు. ఇది కదా ప్రజాస్వామిక పరిపాలన అంటే.. జగన్ ఒంటెత్తు పాలనకూ.. కూటమి ప్రజాస్వామిక పాలనకూ తేడా ఇక్కడే కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/difference-between-jagan-rule-and-cbns-39-208797.html
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.
జములమడుగులో ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. వైసిపి అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరిని తూర్పారబట్టారు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మేలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ పై విమర్శలు కురిపించారు. పకృతిలో పంచభూతాల కూడా తన అధీనంలోనే ఉన్నాయని చెప్పుకునే పెను భూతంగా ఆయన జగన్ రెడ్డిని అబివర్ణించారు.
ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చట్ట సవరణకు ఆమోదముద్ర వేయడంతో, కేంద్ర న్యాయశాఖ తుది నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ పరిణామంతో అమరావతికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభించినట్లయింది.
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌తో పునాదులు పడ్డాయి. అక్కడి నుంచి ఈ పార్టీ అంచలంచలుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గతంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాసన రుచి చూపడంతో.. ఇప్పుడు వరుసగా మూడు పర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్రస్తుతం అప్రతిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.