మేం నిషేధించలేదు.. వాళ్లే ఎత్తేశారు!

Publish Date:May 17, 2023

Advertisement

దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న ది కేరళ స్టోరీ చిత్రాన్ని పలు రాష్ట్రాలు ప్రదర్శించనీయకుండా అడ్డుకుంటున్నాయని ఆరోపిస్తూ నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా తమిళనాడు, బెంగాల్ ప్రభుత్వాలు తమ చిత్రాన్ని నిషేధించడాన్ని వారు సవాల్ చేశారు. అయితే దీనిపై స్పందిస్తూ సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వం చేసిన వాదన ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రాన్ని తాము నిషేధించలేదని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.

ది కేరళ స్టోరీ చిత్రాన్ని తాము తమిళనాడులో నిషేధించలేదని, పేలవ స్పందన కారణంగా థియేటర్లు, మల్టీప్లెక్స్ లు  ఆ సినిమాను ప్రదర్శించకుండా ఎత్తేశాయని స్టాలిన్ సర్కార్ సుప్రీంకోర్టుకు తెలిపింది. సినిమాలో పెద్ద స్టార్లెవరూ లేకపోవడం, పేలవ స్పందన కారణంగా థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదని వెల్లడించింది. బాక్సాఫీస్ కలెక్షన్లు లేకుండా సినిమాను థియేటర్లు మాత్రం ఎలా ఆడిస్తాయని ప్రభుత్వం ప్రశ్నించింది.

ది కేరళ స్టోరీ సినిమా విడుదలైన రెండు రోజుల్లో ప్రేక్షకుల స్పందన సరిగా లేకపోవడంతో ఆ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని రాష్ట్రవ్యాప్తంగా థియేటర్ల యజమానులు నిర్ణయించుకుంటే తాము మాత్రం ఏం చేస్తామని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. మల్టీప్లెక్స్ యజమానులు సినిమాపై వచ్చిన విమర్శలు, ప్రముఖ నటులు లేకపోవడంతో కలెక్షన్లు లేక మే 7 నుండి సినిమా ప్రదర్శనను నిలిపివేసేందుకు నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

తమిళనాడులో హిందీలో ఈ చిత్రం 19 మల్టీప్లెక్స్‌లలో మే 5న విడుదలైంది. సినిమాను ఉపసంహరించుకోవాలన్న థియేటర్ల యాజమాన్యాల నిర్ణయంపై ఎలాంటి నియంత్రణ లేదని తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది. మే 5న సినిమా విడుదలపై ప్రభుత్వం అప్రకటిత నిషేధం విధిస్తోందని ఆరోపిస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ద్వారా చిత్రనిర్మాతలు సినిమాకు ప్రచారం కోసం ప్రయత్నిస్తున్నారని స్టాలిన్ సర్కార్ ఆరోపించింది. తద్వారా సుప్రీంకోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించింది. తమిళనాడు ప్రభుత్వం సినిమాని నిషేధించిందన్న ఆరోపణకు మద్దతుగా నిర్మాతలు ఒక్క చిన్న రుజువును కూడా సమర్పించలేదని అదనపు డీజీ గుర్తుచేశారు.

ది కేరళ స్టోరీ ని విదేశాలలో నిషేధించారు. ఇది ఫేక్ స్టోరీ అని, గొడవలకు దారి తీసేదిగా ఉందంటూ పలు దేశాలు సిన్మాను తమ దేశంలో విడుదల కాకుండా నిషేధించాయి.  ఒక వర్గాన్ని కించపరిచే విధంగా సిన్మా ఉందని.. ఈ సిన్మాతో బీజేపీ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

By
en-us Political News

  
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌‌ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్‌ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.