అప్రూవర్ గా మారతా.. జగన్ కు విజయసాయి పరోక్ష హెచ్చరికేనా?

Publish Date:Mar 13, 2025

Advertisement

విజయసాయి రెడ్డి ప్రతి మాటా, ప్రతి కదలికా.. వైసీపీ కాళ్ల కింద భూమిని కదిలించేస్తోంది. విజయసాయి రెడ్డి ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడతాడా అన్న టెన్షన్ వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. విజయసాయిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పేసి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసేని వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించిన తరువాత ఆయన ప్రతి కదలికా వైసీపీని గాభరాపెడుతూనే ఉంది. వైసీపీకి గుడ్ బై చెప్పేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన తరువాత ఆయన మొదటిగా కలిసింది వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిలను. ఇది కచ్చితంగా జగన్ ను ఇబ్బంది పేట్టే చర్యేననడంలో సందేహం లేదు. ఆ తరువాత ఆయన వ్యవసాయం చేస్తున్నానంటూ కొన్ని ఫొటోలూ, వీడియోలూ విడుదల చేసినా వైసీపీలో కంగారు, భయం తగ్గలేదు. అందుకు నిదర్శనమే విజయ సాయి పార్టీకి దూరమైన తరవాత చాలా రోజులకు జగన్ ఓ మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి పేరు ప్రస్తావించకుండానే విశ్వసనీయత లేని వ్యక్తి అంటూ విమర్శలు గుప్పించారు. ఆ వెంటనే జగన్ వ్యాఖ్యలను విజయసాయి ఖండించారు. 

ఆ తరువాత మళ్లీ విజయసాయి వైసీపీకి వ్యతిరేకంగా, మరీ ముఖ్యంగా జగన్ కోటరీ అంటూ కొందరు నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పేరుకి కోటరీ అంటూ పేర్లు ప్రస్తావించకుండా విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలపైనే అని ఎవరికైనా ఇట్టే అవగతమౌతాయి. 

కాకినాడ షేర్ల బలవంతపు బదలాయింపు కేసులో సీఐడీ విచారణకు విజయసాయి బుధవారం విజయవాడ సీఐడీ కార్యాలయానికి వచ్చారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ మాటలలో ఆయన వెల్లడించిన విషయాలు, ఆయన వినిపించిన ధిక్కార స్వరం ఇప్పుడు వైసీపీలో కలవరానికి కారణమయ్యాయి.  కాకతాళీయమే అయినా వైసీపీ ఆవిర్భావ దినం అయిన మార్చి 12నే విజయసాయి జగన్ కోటరీ గురించి4 చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నైతిక స్థైర్యాన్ని బాగా దెబ్బతీశాయి. వైసీపీ యువత పోరు కార్యక్రమం నుంచి అందరి దృష్టినీ మళ్లించాయి.    కాకినాడ పోర్టు విషయంలో సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డే ‘కర్త కర్మ క్రియ' అని కుండబద్దలు కొట్టడం, అలాగే జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో ప్రధాన పాత్రధాని కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పడం ద్వారా వెనుక ఉన్న సూత్రధాని జగనేనా అన్న అనుమానాలకు తెరతీసేలా చేశారు విజయసాయిరెడ్డి.

ఎందుకంటే వైవీ సుబ్బారెడ్డి, కసిరెడ్డి రాజశేఖరరెడ్డి ఇద్దరూ జగన్ బంధువులే.  వీటికి సబంధించి అవసరమైతే ముందు ముందు మరిన్ని విషయాలు, వివరాలు వెల్లడిస్తానని విజయసాయి చెప్పడం ఒక రకంగా తాను అప్రూవర్ గా మారడానికి కూడా వెనుకాడనని విజయసాయి పరోక్షంగా జగన్ కు హెచ్చరిక జారీ చేసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాకినాడ పోర్టు షేర్ల వ్యవహారంలో  జగన్ ప్రమేయం లేదని ఓ వైపు చెబుతూనే.. వైవీ సుబ్బారెడ్డి పుత్రరత్నమే కర్తాకర్మాక్రియా అనడం ద్వారా జగన్ ప్రమేయం, అంగీకారం లేకుండానే విక్రాంత్ రెడ్డి ఇంత పెద్ద వ్యవహారం చక్కబెట్టగలడా అన్న అనుమానాలు అందరిలో వ్యక్తమయ్యేలా చేశారు విజయసాయిరెడ్డి. ఇక్కడే తన వ్యాఖ్యలతో వైసీపీయులు తనపై విమర్శల దాడికి పాల్పడకుండా విజయసాయి చెక్ పెట్టారంటున్నారు పరిశీలకులు.

ఇప్పుడు విజయసాయిరెడ్డిపై వైసీపీయులు తమకు మాత్రమే చేతనైన రీతిలో విమర్శల దాడికి దిగితే.. జగన్ ఇబ్బందుల్లో పడేలా విజయసాయి గళం మరింత పెంచుతారన్న భయం వారిలో పాదుకునేలా చేయడంలో విజయసాయి విజయం సాధించారని చెబుతున్ేనారు. ఇప్పుడు విజయసాయిని రెచ్చగొడితే  జగన్ పై పది సీబీఐ, 11 ఈడీ కేసులలో ఏ2 అయిన విజయసాయి అప్రూవర్ గా మారితో కొంప కొల్లేరౌతుందని వారికి తెలుసు. అందుకే దొంగకు తేలు కుట్టిన చందంగా విజయసాయి వ్యాఖ్యలపై అరకొర ఖండనలకే వైసీపీయులు పరిమితమయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
గుంపులను చెదరగొట్టేందుకు  టియర్ గ్యాస్   ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో  భద్రతా దళాలు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టాయి. 
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.