కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెగేదాకా లాగేశారా?

Publish Date:Aug 17, 2022

Advertisement

ముద్దొచ్చినప్పుడే చంకనెక్కాలన్నారు పెద్దలు.. అలాగే ఏదైనా సరే తెగేదాకా లాగకూడదనీ అన్నారు. అయితే వెంకటరెడ్డి ఆ రెంటినీ పరిధి దాటి వాడేశారా? ఇక వెంకటరెడ్డి విషయంలో కాంగ్రెస్ సీరియస్ నిర్ణయం తీసేసుకుందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసిన క్షణం నుంచీ.. ఇంకా గట్టిగా చెప్పాలంటే.. అంతకు ముందు నుంచీ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను కాంగ్రెస్ ను వీడతాను జగ్రత్త అంటూ అధిష్ఠానానికి ఫీలర్లు పంపుతూనే ఉన్నారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పట్ల తన వ్యతిరేకతను ఏ మాత్రం దాచుకోకుండా రచ్చ చేస్తూనే ఉన్నారు. అధిష్ఠానం కోమటిరెడ్డి బ్రదర్స్ ను బుజ్జగించేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. సరే కోమటిరెడ్డి బుజ్జగింపులను పట్టించుకోలేదు.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే అప్పటి నుంచీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ ను ఒక విధంగా బ్లాక్ మెయిల్ చేశారనే చెప్పాలి. టీపీసీసీ చీఫ్ క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ కు అంగీకరించి రేవంత్ రెడ్డి క్షమాపణ కూడా చెప్పారు. అయితే కోమటిరెడ్డి తన వైఖరి మార్చుకోలేదు. క్షమాపణలు ఎవరిక్కావాలి అంటే మళ్లీ కొత్త రాగం అందుకున్నారు. దీంతో కాంగ్రెస్ హై కమాండ్ కు లైట్ వెలిగింది.

కోమటిరెడ్డి సోదరులు ఇద్దరూ ఒకే పడవలో ప్రయాణిస్తున్నారన్నది కాంగ్రెస్ కు అర్ధమైంది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం మునుగోడు ఉప ఎన్నిక ఫలితం వరకూ వేచి చూడాలన్న సేఫ్ గేమ్ ఆడుతున్నారని అవగతమైంది. దీంతో కాంగ్రెస్ కూడా వెంకటరెడ్డిని డ్రాపౌట్ గా పరిగణించడం ప్రారంభించింది. ఎందుకంటే వెంకటరెడ్డి మునుగోడులో సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి వ్యతిరేకంగా పని చేసేందుకు ఏ మాత్రం సుముఖంగా లేదని తేటతెల్లమైంది. దీంతో కోమటిరెడ్డి విమర్శలు, డిమాండ్లకు ఇసుమంతైనా ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఆవశ్యకతను గుర్తించింది. కోమటిరెడ్డి తీరు పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా లేదనీ, ఆయన వ్యవహరిస్తున్న తీరు కాంగ్రెస్ ను బలహీనపరచడమేననీ పార్టీ శ్రేణులు కూడా భావిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ హై కమాండ్ ఆయనకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.

ఇక విమర్శలను ఆపేయాలనీ, సైలెంట్ గా ఉండాలనీ ఖరాఖండీగా చెప్పేసిందని పార్టీ శ్రేణులు అంటున్నారు. అంటే కోమటిరెడ్డికి పార్టీ హైకమాండ్ ఉంటే ఉండు.. లేకుంటే నీ సోదరుడి మాదిరిగానే నీ దారి నువ్వు చూసుకో అని చెప్పకనే చెప్పేసింది. మామూలుగా అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ పాటికే పార్టీకి రాజీనామా చేసి రాజగోపాలరెడ్డి బాట పట్టి ఉండాల్సింది. కానీ కోమటిరెడ్డికి కావలసింది అది కాదు.. పార్టీ పొమ్మనలేక పొగపెట్టినంత మాత్రాన వెళ్లడానికి సిద్ధంగా లేరు. పార్టీలో ఉంటూనే తన వ్యవహార శైలితో.. మునుగోడులో తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి విజయానికి దోహదపడే విధంగా వ్యవహరించాలి. అది భరించలేక కాంగ్రెస్ పార్టీయే తనపై చర్య తీసుకుని పార్టీ నుంచి బహిష్కరించాలి. అప్పుడే తనకు సానుభూతితో పాటు సోదరులిద్దరికీ కాంగ్రెస్ అన్యాయం చేసిందన్న ప్రచారానికి అవకాశం ఉంటుంది అని భావిస్తున్నారు.

అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గేమ్ ప్లాన్ ను పసిగట్టిన కాంగ్రెస్.. ఆయన గేమ్ ప్లాన్ కు విరుగుడు మార్గం అనుసరిస్తోంది. కోమటిరెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించకుండా ఆయన నోరు అదుపు చేయాలని భావిస్తోంది. ఆయనను పొమ్మనదు.. అలాగని పార్టీలో ఆయన ఉనికిని గుర్తించదు. అన్న చందంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోంది. రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పడంతో కోమటిరెడ్డికి ఆఖరి చాన్స్ ఇచ్చినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. ఆ తరువాత కూడా కోమటిరెడ్డి తీరు మారకపోవడంతో ఆయన ఉనికినే గుర్తించని విధంగా పార్టీ ముందుకు సాగాలని ఒక నిర్ణయానికి వచ్చిందని పరిశీలకలు అంటున్నారు. అందుకే ఆయన విమర్శలను, అలకలను పట్టించుకోకుండా పూర్తిగా మునుగోడు విజయం మీదే దృష్టి కేంద్రీకరించాలని పార్టీ శ్రేణులకు, రాష్ట్ర నాయకత్వం ద్వారా హై కమాండ్ విస్పష్ట ఆదేశాలు ఇచ్చిందని అంటున్నారు.

By
en-us Political News

  
హైదరాబాద్‌తో ఆంధ్రప్రదేశ్‌కి బంధం నేటితో తెగిపోనుంది..
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఎపి కూడా నైరుతి రుతు పవనాలు రానున్నాయని సంకేతాలు అందుతున్నాయి. 
ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలతో పల్నాడు అట్టుడికి పోయింది. ముఖ్యంగా మాచర్లలో అల్లర్లు దేశం యావత్ దృష్టికి వచ్చాయి. మాచర్ల ఎమ్మెల్యే ఈవీఎం ను ధ్వంసం చేసి వార్తల్లో వ్యక్తి అయ్యారు.
ప్రత్యేక తెలంగాణ బిల్లు  కాంగ్రెస్  పెడితే బిజెపి ఆమోదించింది. పదేళ్ల తర్వాత జరుపుకుంటున్న తెలంగాణ అవతరణ దినోత్సవాలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. 
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించింది. మెజారిటీ మార్కుకు అవసరమైన స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ఏకగ్రీవంగా పది స్థానాలను గెలుచుకున్న బీజేపీ.. 33 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచినట్లు ఈసీ ప్రకటించింది.
వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. నేటి అర్ధరాత్రి నుంచి టోల్ చార్జీలను పెంచుతున్నట్లు జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్ హెచ్ఐఏ) ప్రకటించింది.
ఎపిలో త్రి కూటమి విజయం తథ్యమని ముందు నుంచి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలు  నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 
ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో బోణి కొట్టిన బిఆర్ఎస్     నిరుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన బిఆర్ఎస్ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బోణి కొట్టింది. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు రెండు రోజుల ముందు వచ్చిన ఫలితాల్లో గులాబి జెండా రెపరెపలాడటం అధికార పార్టీకి మింగుడు పడటం లేదు. 
నారా చంద్రబాబునాయుడు ప్రజలకు కష్టాలలోనూ, సంక్షోభంలోనూ గుర్తుకు వచ్చే నేత. కష్టాల నుంచీ, సంక్షోభం నుంచీ తన దార్శనికతతో రాష్ట్రాన్ని గట్టెక్కించగల నాయకుడిగా ఏపీ ప్రజలు నమ్మే నేత చంద్రబాబునాయుడు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజా విశ్వసనీయతను చూరగొన్న చంద్రబాబు.. ఇప్పటి వరకూ అధికారంలో కన్నా విపక్ష నేతగానే ఎక్కువ కాలం ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమికే పట్టం కట్టారని ‘తెలుగువన్’ ఎగ్జిట్ పోల్ సర్వేలో తేలింది.
ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఈసారి ఏపార్టీ అధికారంలోకి వ‌స్తుంది? గెలిచే అభ్య‌ర్థులు ఎవ‌రు..? ఓటమి చవిచూసే వారు ఎవరు? అసెంబ్లీ, పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయి.. అధికార పార్టీ వైసీపీ నుంచి ఓడిపోనున్న ప్రముఖులు ఎవ‌రు? అనే ఉత్కంఠ‌ ఏపీ రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న ఉన్న ప్ర‌తిఒక్క‌రిలో నెల‌కొంది.
ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏ పార్టీ గెలుస్తుంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వ‌స్తాయి.. మ‌రోసారి సీఎంగా జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేస్తారా..? చంద్ర‌బాబు సీఎం సీటును అదిరోహించ‌బోతున్నారా? ఓట‌ర్లు ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇచ్చారు..? అనే విష‌యాల‌పై ఏపీ ప్ర‌జ‌ల్లోనేకాదు, దేశ‌వ్యాప్తంగా ఉత్కంఠ‌ నెల‌కొంది.
తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వేసవి సెలవులు ఉండటం, వారాంతం కావడంతో ఒక్కసారిగా తిరుమల గిరులకు భక్తుల తాకిడి భారీగా పెరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.