జేసీ వ్యవహారంలో బీజేపీ నేత‌లు హ‌ద్దు మీరారా?..

Publish Date:Jan 3, 2025

Advertisement

ఏపీలో సీఎం చంద్ర‌బాబు నాయుడు సార‌థ్యంలో కూట‌మి ప్ర‌భుత్వం అభివృద్ధే ల‌క్ష్యంగా దూసుకెళ్తున్నది. గ‌డిచిన ఐదేళ్ల కాలంలో వైసీపీ హ‌యాంలో క‌నీస స‌దుపాయాలు లేక ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫ‌లితంగా ఇటీవలి  అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏపీ ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కు గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు. క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదాకూడా ఇవ్వ‌కుండా కేవ‌లం ప‌ద‌కొండు నియోజ‌క‌వ‌ర్గాల‌కే ఆ పార్టీని ప‌రిమితం చేశారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి ఆర్నెళ్లు అవుతోంది. చంద్ర‌బాబు సార‌థ్యంలో అన్నిరంగాల్లో ఏపీ వ్యాప్తంగా అభివృద్ధి ప‌నులు శ‌ర‌వేగంగా సాగుతున్నాయి.

బీజేపీ, జ‌న‌సేన పార్టీల నేత‌ల‌ను క‌లుపుకొనిపోతూ కూట‌మిలో ఎలాంటి విబేధాలూ త‌లెత్త‌కుండా చంద్ర‌బాబు పాల‌న సాగిస్తున్నారు. అయితే, అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం ప‌రిస్థితి భిన్నంగా ఉంది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత‌ జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి తీరు వివాదాస్ప‌దం అవుతోంది. గ‌త మూడు రోజులుగా జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి,  బీజేపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం తారస్థాయిలో కొన‌సాగుతోంది. త‌న బ‌స్సును త‌గ‌ల‌బెట్టింది బీజేపీ నేత‌లే అంటూ జేసీ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు. బీజేపీ మ‌హిళా నేత, సినీన‌టి మాధ‌వీల‌తపై జేసీ ప్రభాకరరెడ్డి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. దీంతో బీజేపీ నేత‌లుకూడా జేసీపై తీవ్ర‌స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ ప‌రిణామాల‌తో ఏపీ రాజ‌కీయాలు ఒక్క‌సారిగా హీటెక్కాయి.

నూత‌న సంవ‌త్స‌రం వేడుక‌ల సంద‌ర్భంగా జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, బీజేపీ నేత‌ల మ‌ధ్య వివాదం త‌లెత్తింది. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా తాడిపత్రిలోని పెన్నా నది ఒడ్డున జేసీ పార్కులో న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో కేవ‌లం మ‌హిళ‌లే పాల్గొనాల‌ని రూల్ పెట్టారు. అయితే, బీజేపీ మ‌హిళా నేత   జేసీ పార్కులో నిర్వ‌హించే న్యూఇయ‌ర్ వేడుక‌ల‌పై అభ్యంత‌రం తెలిపారు. కేవ‌లం మ‌హిళ‌ల‌కే న్యూఇయ‌ర్ వేడుక‌లు నిర్వ‌హించ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. మ‌హిళ‌ల‌కు ఏదైనా అయితే ఎవ‌రిది బాధ్య‌త అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో మ‌రో బీజేపీ మ‌హిళానేత, సినీ న‌టి మాధ‌వీ ల‌త జేసీ పార్కులో న్యూఇయ‌ర్ వేడుక‌ల‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. ఆ ప్రాంతంలో గంజాయి తీసుకునేవారు ఎక్కువ‌గా ఉంటారు. అలాంటి సెన్సిటివ్ ప్రాంతంలో కేవ‌లం మ‌హిళ‌ల‌కే పార్టీని ఏర్పాటు చేయ‌డం ఏమిటి..? మ‌హిళ‌ల‌కు ఏమైనా అయితే బాధ్య‌త ఎవ‌రిది..? అంటూ జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి పేరు ప్ర‌స్తావించ‌కుండానే ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.  ఇలా వివాదం సాగుతుండగా, జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన బస్సులు దగ్ధమయ్యాయి. ఈ ఘటన ఎలా జరిగిందో ఏమో కానీ, జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం బీజేపీనే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 బీజేపీ మ‌హిళా నేత మాధ‌వీల‌త‌పై అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ నేత‌ల‌పైనా ఓ రేంజ్ లో విరుచుకుప‌డ్డారు. ఇక తన బస్సులను పథకం ప్రకారం దగ్ధం చేసినా.. షార్ట్ సర్క్యూట్ అంటూ పోలీసులు కేసు నమోదు చేయడంపైనా జేసీ ప్రభాకర్ రెడ్డి మండిప‌డ్డారు. పోలీసులకు చేతనైతే సుమోటోగా కేసు నమోదు చేసి తన బస్సులకు నిప్పంటించిన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.  వైసీపీ ప్రభుత్వంలో రూ.450 కోట్లు డబ్బులు పోగొట్టుకున్నానని.. ఇప్పుడు రెండు బస్సులకు నిప్పంటిస్తే ఏమవుతుందని వ్యాఖ్యానించారు. వీళ్ల కంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా మేలని, జగన్ తన ప్రభుత్వంలో కేవలం తన బస్సులు మాత్రమే ఆపారని.. బీజేపీ  మాత్రం తన బస్సులను తగులబెట్టించారని జేసీ ప్రభాకర్‌ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జేసీ వ్యాఖ్య‌లపై బీజేపీ నేత‌లు సైతం ఫైర‌య్యారు. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి విలేకర్లతో మాట్లాడుతూ.. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. బీజేపీ వాళ్లే బస్సులు కాల్చేశారని ఆయన అంటున్నారని, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడో కూర్చొని నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే చూస్తూ కూర్చొనే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరన్నారు. జేసీ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి, బీజేపీ నేత సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ వ్యాఖ్యలు సరికాదని... ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని అన్నారు. కూటమిలో భాగమైన బీజేపీపై జేసీ అర్థంలేని వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. వయసుకు తగిన విధంగా నడుచుకోవాలని జేసీకి హితవు పలికారు.

జేసీ కుటుంబం న్యూఇయ‌ర్ వేడుక‌లు నిర్వ‌హిస్తే బీజేపీ నేత‌ల‌కు ఇబ్బంది ఏమిట‌న్న ప్ర‌శ్న జేసీ వ‌ర్గీయుల నుంచి వ్య‌క్త‌మ‌వుతుంది. కేవ‌లం కూట‌మి నేత‌ల మ‌ధ్య గొడ‌వ‌లు సృష్టించేందుకే బీజేపీ మ‌హిళా నేత‌లు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డిపై ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడార‌ని, అస‌లు బీజేపీ పెద్ద‌ల‌ను సంప్ర‌దించ‌కుండా కూట‌మిలో భాగ‌స్వామిగా ఉన్న నేత‌ల‌పై ఎలా విమ‌ర్శ‌లు చేస్తారంటూ జేసీ వ‌ర్గం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నది. ఈ విష‌యాన్ని తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ దృష్టికి తీసుకెళ్తామ‌ని జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి వ‌ర్గీయులు అంటున్నారు. మ‌రోవైపు బీజేపీ నేత‌లుసైతం  త‌గ్గేదేలే అంటున్నారు. జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి బీజేపీ మ‌హిళా నేత‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఈ విష‌యాన్ని ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్తామ‌ని చెబుతున్నారు. అటు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఇటు బీజేపీ నేత‌లు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్న నేప‌థ్యంలో కూట‌మి పెద్ద‌గాఉన్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఈ స‌మ‌స్య‌ను ఎలా ప‌రిష్క‌రిస్తార‌నే అంశం ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

By
en-us Political News

  
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.