Publish Date:Oct 28, 2022
తెలంగాణలో తెలుగుదేశం, బీజేపీ కలిశాయా.. కలిసి పని చేయాలన్న నిర్ణయానికి వచ్చేశాయా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేయాలని నిర్ణయించుకున్న తెలుగుదేశం చివరి క్షణంలో పోటీ నుంచి వైదొలగడానికి బీజేపీతో అవగాహనే కారణమని అంటున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నాయకులు కరవైనా.. ఆ పార్టీ క్యాడర్ మాత్రం ఈ ఎనిమిదేళ్లుగా చెక్కు చెదరకుండా అలాగే ఉంది.
ఇప్పుడు ఈ క్యాడర్ అంతా బీజేపీతో కలిసి పని చేయనుందని పరిశీలకులు అంటున్నారు. ఈ రెండు పార్టీల మధ్యా మైత్రికి ఇరు పార్టీల అధిష్ఠానాలూ పచ్చ జెండా ఊపేశాయని కూడా చెబుతున్నారు. ఈ మైత్రి ముందు ముందు ఏపీలో కూడా కొనసాగుతుందని చెబుతున్నారు. ముందుగా మునుగోడు ఉప ఎన్నికలో నియోజకవర్గంలోని తెలుగుదేశం క్యాడర్ అంతా బీజేపీకి అనుకూలంగా పని చేస్తున్నట్లు సమాచారం. మునుగోడు నియోజకవర్గంలో మునుగోడులో తెరాస, కాంగ్రెస్ ల పరాజయమే లక్ష్యంగా తెలుగుదేశం, బీజేపీలు కలిసి నడుస్తున్నాయని చెబుతున్నారు.
ఏపీలో కూడా ఈ రెండు పార్టీలూ వచ్చే ఎన్నికలలో మిత్రులుగానే పని చేస్తాయన్న సంకేతాలు ఇప్పటికే అటు బీజేపీ అగ్రనాయకత్వం నుంచీ, తెలుగుదేశం వైపు నుంచీ కూడా వస్తున్నాయనీ, ఇందుకు ఏపీలో బీజేపీతో పొత్త తమకు లబ్ధి చేకూరుస్తుందని తెలుగుదేశం భావిస్తుండటం.. తెలంగాణలో తెలుగుదేశంతో మైత్రి తమకు మేలు చేస్తుందని బీజేపీ భావించడం కారణమంటున్నారు. అయినా రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నది నానుడి.. అందుకే నాలుగేళ్ల కిందట తెగిన మైత్రి బంధం మునుగోడు ఉప ఎన్నిక వేదికగా మళ్లీ ముడిపడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తెలంగాణ బీజేపీ నాయకత్వం ఏపీలో తెలుగుదేశంతో పార్టీ పొత్తు పెట్టుకోవాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ అగ్రనాయకత్వానికి కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పిందనీ పరిశీలకులు చెబుతున్నారు. అంతే కాకుండా తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తు రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలన్న తమ ఆకాంక్ష నెరవేరేందుకు అనివార్యమన్న భావన బీజేపీ అగ్రనాయకత్వంలో కూడా ఉందని అంటున్నారు.
అందుకే ఏపీలో తెలుగుదేశంకు దగ్గరయ్యేందుకు వేస్తున్న అడుగులలో భాగంగానే వైసీపీపై బీజేపీ ఉద్దేశపూర్వకంగా దూరం జరుగుతోందని అంటున్నారు. ముఖ్యంగా మూడు రాజధానుల విషయంలో వైసీపీని విస్పష్టంగా వ్యతిరేకిస్తూ అమరావతే ఏకైక రాజధాని అన్నదే తమ విధానమని బీజేపీ ప్రకటించడాన్ని ఇందుకు తార్కాణంగా చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/did-bij-and-tdp-are-working-together-in-telangana-25-146196.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.