దిక్కూ దివాణం లేని ధర్మాన!

Publish Date:Aug 2, 2024

Advertisement

మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ పొలిటీషియన్ ధర్మాన ప్రసాదరావు రాజకీయ భవితవ్యం ఏమిటి..? తాజా ఎన్నికల్లో ఒక సర్పంచ్ చేతిలో ఏభై వేలకు పైగా ఓట్ల తేడాతో ఘోర ఓటమిని చవి చూసిన అనంతరం ధర్మాన ఆలోచన ఏమిటి..? వైసిపిలోకి వచ్చిన నాటి నుండి రాజకీయాలపై విరక్తి మాటలు మాట్లాడే ధర్మాన.. ఈ ఓటమి తరువాత రాజకీయాల నుండి రిటైర్ అవ్వనున్నారా..? తన తనయుడి రాజకీయ ప్రస్థానం కొనసాగించడానికి వేరొక పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారా..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి.. 

ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈ రాజకీయ నేత.. స్థానికంగానే కాదు.. రాష్ట్ర రాజకీయాల్లో సైతం ఓ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్.. అసెంబ్లీలో ధర్మాన ప్రసంగాలను చాలామంది ఇప్పటికీ ఫాలో అవుతూ ఉంటారు. మాస్ లీడర్‌గా మంచి ఫాలోయింగ్‌తో పాటు, అంతే స్థాయిలో అవినీతి ఆరోపణలు సైతం మూటగట్టుకున్నారు ధర్మాన ప్రసాదరావు. కాంగ్రెస్ హయంలో, తరువాత వైసిపిలో చేరిన తరువాత సైతం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం, ఉత్తరాంధ్ర పరిధిలో, అందులో ముఖ్యంగా తన సొంత జిల్లా శ్రీకాకుళంలో ప్రతీ నియోజకవర్గంలో తన అనుయాయులను బలపరుచుకుని.. ప్రతీ చోట తన మాట చెల్లుబాటు అయ్యేలా.. తన పనులు, తనవారి పనులు క్షణాల్లో జరిగేలా.. మొత్తం సిస్టం మొత్తం తనకు అనుకూలంగా మార్చుకున్న ప్రొఫెషనల్ పొలిటీషియన్.. 

అలాంటి ప్రొఫెషనల్ పొలిటీషియన్ ధర్మాన ప్రసాదరావు పొలిటికల్ కెరియర్ గడచిన మూడేళ్ళుగా పూర్తిగా అస్తవ్యస్తంగా నడుస్తోంది. ఆడే మాట తప్పుగా దొర్లుతోంది.. వేసే అడుగు తడబడింది.. అందుకు ఫలితాలుగా నిలచాయి తాజా సాధారణ ఎన్నికలు.. రాష్ట్రం మొత్తం వన్ సైడ్ ఫలితాలు వచ్చినప్పటికీ శ్రీకాకుళం నియోజకవర్గంలో ధర్మాన ఓటమి మాత్రం అందులో భిన్నం.. ఘోరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఈ సీనియర్ పొలిటీషియన్ ను శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన ఓ సర్పంచ్ ఓడించారు. అదికూడా ఏభై వేలకు పైగా ఓట్ల తేడాతో.. దీంతో శ్రీకాకుళం నియోజకవర్గంలో గెలిచిన గోండు శంకర్.. ఇప్పుడు ట్రెండ్ సెట్టర్‌గా మారగా.. ధర్మాన రాజకీయ భవిష్యత్ మాత్రం అయోమయంలో పడింది. 

ఇంకోవైపు వైసిపికి వచ్చిన నాటి నుండి పార్టీలో గుర్తింపు కోసం ఆపసోపాలు పడ్డారు ధర్మాన ప్రసాదరావు. ఒక బలమైన వాగ్ధాటి, భారీగా మాస్ ఫాలోయింగ్ ఉన్న ధర్మాన ప్రసాదరావును వైసిపి ప్రభుత్వ పాలనలో తొలి మూడేళ్ళు పూర్తిగా దూరం పెట్టింది. తొలి దఫా మంత్రివర్గ కూర్పులో ధర్మానకు చోటు ఇవ్వకపోవడానికి తోడు, జిల్లాలో కీలక వ్యవహారాల్లో సైతం ఆయననూ దూరం పెడుతూ వచ్చింది. జిల్లాలో ధర్మాన వర్గీయులుగా ముద్ర పడ్డ నాయకులకు గుర్తింపు ఇవ్వకపోవడం, ఆయనను గతంలో విభేదించిన వారికి కీలక పదవులు ఇవ్వడం.. ధర్మాన కోటరీ తట్టుకోలేకపోయింది.  


వాస్తవానికి 2024 సాధారణ ఎన్నికల బరిలో తన కుమారుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడును నిలపాలని ధర్మాన ప్రసాదరావు అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఎన్నికలకు రెండేళ్ళ ముందు నుండి ఆయన ప్రసంగాలు కూడా ఉండేవి.. తనకు రాజకీయాల్లో ఆసక్తి తగ్గింది అని, ఇకపై పోటీ చెయ్యనూ అంటూ అనేక వేదికల్లో చెప్పుకోస్తూ ఉండేవారు ధర్మాన ప్రసాదరావు.. అయితే వైసిపి అధినేత జగన్ మాత్రం ఈసారి తప్పక పోటీ చెయ్యాల్సిందే అని తెగేసి చెప్పడంతో అనివార్యంగా బరిలో నిలచారు ధర్మాన ప్రసాదరావు. 

అయిష్టంగా బరిలో నిలిచి.. అనూహ్యంగా భారీ ఓటమి పాలైన ధర్మాన ప్రసాదరావు రాజకీయ భవితవ్యంపై ఇప్పుడు నీలినీడలు అలముకున్నాయి. అయితే గడచిన కొన్ని రోజులుగా ధర్మాన ప్రసాదరావుపై వస్తున్న వార్తలు, శ్రీకాకుళం జిల్లా వాసులనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతున్నాయి. ప్రత్యక్ష రాజకీయాలపై గడచిన అయిదేళ్లుగా అనాసక్తి ప్రదర్శిస్తున్న ధర్మాన ప్రసాదరావు రాజకీయాల నుండి తప్పుకుంటారా..? తన తనయుడిని మెయిన్ స్క్రీన్ పైకి తెచ్చి కధ నడిపిస్తారా..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు సిక్కోలులో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపధ్యంలోనే ధర్మాన ప్రసాదరావు తనయుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు ప్రత్యక్ష రాజకీయ ప్రస్థానం ఘనంగా మొదలు పెట్టడానికి మరో పార్టీలోకి వెళతారు అన్న వార్తలు కూడా హల్ చల్ చేస్తున్నాయి. దానికి సంబంధించి తెరవెనుక ఏర్పాట్లు కూడా చక చకా జరిగిపోతున్నట్టు భోగట్టా.. ఈ నేపధ్యంలో ధర్మాన భవిష్యత్ నిర్ణయం ఏమిటి.. తన తనయుడి పొలిటికల్ జర్నీని ధర్మాన ఎలా డిజైన్ చేశారు అనే సస్పెన్స్ మరి కొన్ని రోజుల్లోనే వీడనుంది.

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.