వాలంటీర్లందరూ వైపీపీ కార్యకర్తలే.. ఒప్పేసుకున్న ధర్మాన

Publish Date:Apr 13, 2024

Advertisement

ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పినా అది నిజం అయ్యే అవకాశం లేదు. వాలంటీర్ల విషయంలో వైసీపీ ఎంత మొత్తుకున్నా.. ఎవరూ వారు ప్రభుత్వోద్యోగులని నమ్మడం లేదు. వాళ్లు వైసీపీ కార్యకర్తలేనని చెబుతున్నారు. అంతెందుకు వైసీపీ నేతలు, మంత్రులు కూడా వాలంటీర్లంతా మనవాళ్లేనని బహిరంగ సభల్లో చెబుతున్నారు. మనం చెప్పినట్లు వినే వాళ్లే ఉంటారు. లేని వాళ్లను తొలగించి వేరొకరిని నియమించుకుందామని గతంలో ఒక సారి మంత్రి అంబటిరాంబాబు వైసీపీ శ్రేణుల సదస్సులో బాహాటంగానే చెప్పేశారు. అలాంటి వాలంటీర్లను కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలంటే మాత్రం అధికార పార్టీ నేతలకు కాళ్ల కింద భూమి కదిలిపోయినట్లైంది. అవ్వా తాతలకు ఇంటి వద్దకు పెన్షన్ అందడం విపక్ష తెలుగుదేశం జీర్ణించుకోలేకపోతోందనీ, అందుకే వాలంటీర్లపై ఫిర్యాదులు చేసి వారిని పెన్షన్ల పంపిణీ నుంచి దూరం పెట్టేలా ఎన్నికల సంఘంపై ఒత్తిడి తీసుకువచ్చిందనీ గగ్గోలు పెట్టేసింది. ప్రభుత్వ సిబ్బంది చేత పెన్షన్లను పంపిణీ చేయించాలనీ, వృద్ధులకు ఇళ్లవద్దే పెన్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, కోర్టులు చెప్పినప్పటికీ వృద్ధుల ఉసురు పోయేలా పెన్షన్ల పంపిణీని అస్తవ్యస్తం చేసి... శవరాజకీయం చేయడానికి కూడా వైసీపీ నేతలు వెనుకాడలేదు. చివరికి జనాలకు వాస్తవం తెలిసిపోయిందని గ్రహించి వైసీపీ చేసేదేం లేక మౌనం వహించాల్సి వచ్చింది. అయినా వాలంటీర్ల విషయంలో ఆ పార్టీ ఆశలు ఇంకా చావ లేదు. వాలంటీర్ల చేత రాజీనామాలు చేయించి.. వారి సేవలను ఎన్నికల ప్రచారానికి వాడుకోవాలని ఎత్తులు వేసింది. తమ ప్రభుత్వం రాగానే మళ్లీ వాలంటీర్లను ఉద్యోగాల్లోకి తీసుకుంటామనీ ఊదరగొట్టింది. అయినా అతి తక్కువ మంది వాలంటీర్లు మాత్రమే రాజీనామాలు చేయడంతో ఇక ఎన్నికల ప్రచార సభా వేదికలపై నుంచి వారికి రాజీనామాలు చేసి వైసీపీకి పని చేయాలని పిలుపునివ్వడం మొదలెట్టింది. 

అయితే అబద్ధాలు చెప్పే వాళ్లకి జ్ణాపకశక్తి ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఏ అబద్ధం చెప్పారో గుర్తు లేకపోతే మంత్రి ధర్మాన ప్రసాదరావులా నవ్వుల పాలు కావలసి ఉంటింది. ఎన్నికల సంఘానికీ, కోర్టులకూ వాలంటీర్లు వైసీపీకి చెందిన వారు కారనీ, వారు ఉద్యోగులనీ, పెన్షన్ల పంపిణీ కోసం వారిని వినియోగించుకుంటున్నామనీ పదే పదే చెప్పిన సంగతి మరచిపోయి ఆయన తాజాగా శ్రీకాకుళంలో నిర్వహించిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలేనని చెప్పుకొచ్చారు. అలా చెప్పి వారిని పార్టీకి అనుకూలంగా మలచుకోవాలని ప్రయత్నించారు. వాలంటీర్లంతా రాజీనామా చేసి ఎన్నికలలో వైసీపీ విజయం కోసం పని చేయాలని పిలుపునిచ్చారు.  

అంతే కాదు వైసీపీ మోడ్ ఆఫ్ అపరెండీ ఎలా ఉంటుందో కూడా ధర్మాన ఆ సమావేశంలో పూసగుచ్చినట్లు చెప్పేశారు. ఎన్నికలలోనే కదా మనం ఓటర్లకు కనిపించేది. మళ్లీ ఐదేళ్ల వరకూ వారి వద్దకు వెళ్లం. మన వాలంటీర్లు అలా కాదు ప్రతి 50 గృహాలకూ ఒకరిని కేటాయించాం కనుక వారి సేవలు ఇప్పుడు మనకు అవసరం. అందుకే వాలంటీర్లందరినీ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా వినియోగించుకోవాలని ధర్మాన చెప్పారు. ఒక వేళ అలా చేయడానికి నిబంధనలు అడ్డు వస్తాయంటే వారందరి చేతా రాజీనామాలు చేయించేయండి. మళ్లీ మన ప్రభుత్వం వచ్చాకా వారిని ఏం చేయాలో ఆలోచిద్దాం అని బాహాటంగానే చెప్పేశారు.  

అయినా ఇంత కాలంగా వైసీపీ హయాంలో వాలంటీర్లుగా పని చేస్తున్న వారందరికీ జగన్ పార్టీ తీరు తెన్నూ బాగానే అర్ధమైంది. అందుకే పార్టీ అధినేత సహా కీలక నేతలంతా వాలంటీర్లను రాజీనామా చేయమని హుకుంల మీద హుకుంలు జారీ చేస్తున్నా అతి తక్కువ మంది తప్ప ఎవరూ రాజీనామా చేయడానికి ముందుకు రావడం లేదు. ఎన్నికల నిబంధనల ప్రకారం తాము వైసీపీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటామని తెగేసి చెబుతున్నారు. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసే ప్రశ్నే లేదనీ, వారి సేవలను తమ ప్రభుత్వంలో మంచి పనుల కోసం వినియోగించుకుంటామనీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేసిన ప్రకటన తరువాత వారికి తత్వం బోధపడింది.

ఇంత కాలం తమను జగన్ సర్కార్ వెట్టి చాకిరీ కోసం ఎలా వాడుకుందో అర్ధమైంది. అందుకే రాజీనామాలు చేయం, వైసీపీకి అనుకూలంగా వ్యవహరించం అని తెగేసి చెబుతున్నారు. కొందరైతే అధికార పార్టీ  ఒత్తిడులకు తట్టుకోలేక రాజీనామాలు చేసినా వెంటనే తెలుగుదేశం గూటికి చేరు తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇక పార్టీ  శ్రేణులను వాలంటీర్లపైకి రెచ్చగొట్టి వారిని వేధించే కార్యక్రమానికి వైసీపీ నేతలు రెడీ అయిపోయారని తాజాగా మంత్రి ధర్మాన మాటలను బట్టి అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
మునీర్‌కు ఇరాన్ అగ్రశ్రేణి సైనిక వర్గాలతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఒకవైపు చర్చలకు సహకరిస్తాయని భావిస్తున్నా.. అదే సమయంలో ఆయన విశ్వసనీయతపై అమెరికా నిఘా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మధ్యవర్తిత్వం పేరుతో ఆయన అమెరికా ప్రయోజనాలకు గండి కొట్టేలా వ్యవహరిస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవ్వడమే కాకుండా, ఆ దిశగా హెచ్చరికలు సైతం జారీ అవుతున్నాయి.
చంద్రబాబు ప్రస్తుతం మోడీని కాపాడేందుకు ఎన్డీఏ తరపున తెలుగు ప్రజల మధ్య ప్రచారానికెళ్లడం విడ్డూరమన్నారు. నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, నేడు తెలుగు ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడగడం సబబు కాదని నారాయణ అన్నారు.
19వ శతాబ్దంలో రూపుదిద్దుకున్న బెంగాల్ పునరుజ్జీవనం భారత ఆధునిక చరిత్రలో ఒక మలుపు. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, బంకిం చంద్ర చట్టోపాధ్యాయ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయులు సమాజ సంస్కరణలు, విద్య, సాహిత్యం, జాతీయ చైతన్యం వంటి రంగాల్లో కొత్త దిశను చూపించారు. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దశలోనూ బెంగాలీ నాయకుల ప్రాబల్యం స్పష్టంగా కనిపించింది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మాజీ మంత్రి హరీశ్ రావు ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్‌గా మారింది.
గత పదేళ్ల కాలంలో ప్రపంచం అనేక తీవ్రమైన సంక్షోభాలను ఎదుర్కొంది. కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడిన అంతర్జాతీయ అనిశ్చితి, చైనా, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, పశ్చిమాశియాలో ఉద్రిక్తతలు వంటివి అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేశాయి. ఇటువంటి గడ్డు కాలంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా స్థిరంగా నిలబడటమే కాకుండా, ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా ఎదగడం వెనుక మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ముందుండి నడిపిస్తున్నా.. వెనుక నుంచి ప్రత్యర్థుల కదలికలను గమనించే శైలి మోడీదని అంటారు. మోడీ ఎల్లప్పుడూ ఒకటి కాదు, పది అడుగుల ముందుంటారనీ, అదే సమయంలో ప్రత్యర్థుల ప్రతి కదలికనూ నిశితంగా గమనిస్తారనీ వారు చెబుతారు. ఆయన రాజకీయ శైలిలో ప్రోయాక్టివ్ లీడర్షిప్, రియాక్టివ్ అవగాహన అనే రెండు ముఖ్యలక్షణాలు ఉన్నాయి.
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెబుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రధాని నరేంద్ర మోడీ.. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో మైగుడ్ ఫ్రెండ్ అని చంద్రబాబును సంబోధిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో ఆయన చూపుతున్న చొరవ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీని వాడుకోవడంలో ఆయనకున్న విజన్ అద్భుతమని ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తుతించారు.
భారత రాజ్యాంగం ప్రకారం.. జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి. ఇది ఏ పార్టీ ఇష్టానుసారం చేసే పని కాదు. ఇది రాజ్యాంగబద్ధమైన, ఆటోమేటిక్ ప్రక్రియ. ఎందుకు 50 సంవత్సరాలుగా డిలే అయింది? 1976 ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ.. డీలిమిటేషన్ను 2001 వరకు ఫ్రీజ్ చేశారు.2001 – వాజ్పేయి ప్రభుత్వం: ఫ్రీజ్ను 2026 వరకు పొడిగించింది. అంటే.. 2026లో డీలిమిటేషన్ జరుగుతుందని అన్ని పార్టీలకూ గత 20 సంవత్సరాలుగా తెలుసు.
ప్పుడు అమరావతి రాజధానిని సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ గా రూపొందించినట్లే, ఆయన రాజకీయ రంగప్రవేశంలో కూడా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకుండా సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీం ఏదో ఆలోచించి అమలులో పెట్టి ఉంటారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, తన ప్రసంగాలను మనం చేయలేమా? చేయగలం (యస్ వికెన్) అనే మాటతో ముగించేవారు. కానీ చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాల క్రితమే తన జీవితానికి నేను చేయగలను (ఐ కేన్ డూ) అనే టాగ్ లైన్ నిర్దేశించుకున్నారు.
ఆయన మంత్రి పదవి ఇప్పుడు ఒక రాజ్యాంగపరమైన గడువుపై ఆధారపడి ఉంది. ప్రస్తుత పరిస్థితిని చూస్తే.. నెల రోజుల్లో ఆయన మంత్రి ఉద్యోగం పోతుందా? అని ప‌రిశీలిస్తే ఆయ‌న‌కా గండం ఉందనే చెప్పాలి.
వెస్ట్ బెంగాల్ లో మొత్తం 91 లక్షల ఓటు తొలగించారు. అంటే సగటున చూస్తే నియోజకవర్గానికి 31 వేల ఓట్లు తొలగించారు. ఈ తొలగింపు రెండు కారణాల వల్ల చాలా సెన్సిటివ్. మార్జిన్‌లతో పోలిస్తే ..2021లో టీఎంసీ గెలిచిన చాలా సీట్లలో మెజారిటీ 50,000 కంటే తక్కువ. 13 సీట్లలో ఇది మూడు వేల కంటే కూడా తక్కువ. ఇటువంటి పరిస్తితుల్లో నియోజకవర్గానికి 31 వేల ఓట్లు డిలిషన్ లో పోతే.. ఈ ప్రభావం ఎవరిపై ఎక్కువగా పడుతుంది?
మహిళా రిజర్వేషన్ల పేరుతో కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రజలను వంచించే ప్రయత్నం చేసిందన్నారు. విపక్షాలు సమష్టిగా ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో మోడీ ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్లిపోయారన్నారు. అందుకే ఆయన తన ప్రసంగంలో అబద్ధాలు వల్లెవేశారన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.