సుబ్బన్న ఇక లేరు

Publish Date:Dec 7, 2013

Advertisement

 

వెండితెర మీద హాస్యశకం ముగిసింది.. దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను నవ్విస్తూ వస్తున్న ఓ అసామాన్య నటుడు తుది శాస్వవిడిచాడు.. హాస్యనటుడిగా, రచయితగా, దర్శకుడిగా, టెలివిజన్‌ వ్యాఖ్యాతగా, ఇలా  బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం శనివారం రాత్రి మృతి చెందారు. ఆయన గత ఏడాది కాలంగా ఊపిరి తిత్తుల క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాదులో చైతన్యపురి వద్ద గల గీతా ఆసుపత్రిలో నిన్న రాత్రి పది గంటలకు ఆయన మృతి చెందారు. ఆయన స్వస్తలమయిన ప్రకాశం జిల్లాలో సింగరాయకొండలో రేపు అంత్యక్రియలు జరుగుతాయి. 

 

ఆ మహానటునికి నివాళి అర్పిస్తూ ఆయన జీవిత ప్రస్థానాన్ని ఒకసారి గుర్తుచేసుకుందాం...ధర్మవరపు సుబ్రహ్మణ్యం అనగానే ఈ తరం ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చే పాత్ర అమాయకపు కాలేజ్‌ లెక్చరర్‌.. ఎన్నో సినిమాల్లో లెక్చరర్‌గా నటించిన ఆయన తన నటనా పటిమతో ఆ పాత్రకే అందం తీసుకువచ్చారు.. ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయేలా చేశారు..1960 ఆగస్టు 9న ప్రకాశం జిల్లా లొని కొమ్మినేని వారిపాలెంలో జన్మించారు ధర్మవరపు.. చిన్ననాటి నుంచే నటన మీద ఉన్న మక్కువతో నాటకాలు వేసేవారు.. ముఖ్యంగా వామపక్షభావజాలానికి ఆకర్షిడైన ఆయన ప్రజానాట్యమండలితో కలిసి ఎన్నో సందేశాత్మక రచనలు చేశారు..

చదువుకునే వయసులోనే ఎక్కువగా నాటకాల వైపు మల్లడంతో విద్యాబ్యాసం కూడా దెబ్బతింది.. ఒక దిశలో ఇంటర్‌ కూడా ఫెయిల్‌ అయిన ధర్మవరం తల్లి కోరిక మేరకు పట్టుదలగా చదివి ఇంటర్‌ పూర్తి చేశాడు.. తరువాత బీకాం డిగ్రీ పూర్తి చేసిన ఆయన పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌లో ఉద్యోగిగా చేరారు..అయితే నాటకాల మీద ఆయనకు ఉన్న మక్కువ ఆయన్ను ఎక్కువ రోజులు ఉద్యోగిగా కొనసాగనివ్వలేదు.. దీంతో కొంత మంది దగ్గర మిత్రులతో కలిసిన నాటకాలు వేయటం ప్రారంభించారు. అలా నాటక రంగంలో బిజీ కావటంతో ఆయన ఉద్యోగానికి కూడా రాజీనామ చేయాల్సి వచ్చింది.నాటకరంగంలో బిజీగా ఉన్న ఆయన ఆకాశవాణి కొసం నాటకాలు రాయడం ప్రారంభించారు.. అప్పటి వరకు నటిడిగా ఆయనకు ఉన్న అనుభవానికి తన మార్క్‌ హాస్యం జోడించి అద్భుతమైన నాటికలు తయారు చేశారు..

తెలుగు టెలివిజన్‌ రంగానికి ధారావాహికలను పరిచయం చేసిన ఘనత కూడా ధర్మవరానిదే.. అప్పటి వరకు టెలీఫిలిం లు మాత్రమే తెలిసిన తెలుగు వారికి ఒకే సీరియల్‌ను భాగాలు టెలికాస్ట్‌ చేయోచ్చు అంటూ అనగనగా ఒక శోభ సీరియల్‌ ద్వారా పరిచయం చేశారు.. తరువాత  బుల్లితెర మీద ఆయన ఎన్నో విభిన్న పాత్రలతో అలరించారు, సీరియల్‌ దర్శకుడిగా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. ముఖ్యంగా మనసు గుర్రం లేదు కళ్లెం, పరమానందయ్య శిష్యుల కథ లాంటి సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు..ముఖ్యంగా దూరదర్శన్‌లో ఆయన చేసిన ఆనందో బ్రహ్మ ఆయనకు నటునిగా దర్శకునిగా మంచి గుర్తింపు నిచ్చింది.. ఈ సీరియల్‌ ఘనవిజయం సాదించటంతో ఆయన టెలివిజన్‌ ప్రేక్షకులకే కాదు.. సినీరంగంలోనూ సుపరిచితులయ్యారు..

టెలివిజన్‌ రంగంలో మంచి పేరు తెచ్చుకోవటంతో సినీరంగం నుంచి కూడా ధర్మవరానికి అవకాశాలు వచ్చాయి.. ఎంతో మంది హస్యనటులకు నటులు జన్మనిచ్చాన జంధ్యాల ధర్మవరాన్ని జయమ్ము నిశ్చయమ్మురా సినిమాతో వెండితెరకు పరిచయం చేశారు.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ధర్మవరం తరువాత వరుస అవకాశాలతో మంచి హాస్యనటునిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.. టెలివిజన్‌ రంగంలో దర్శకునిగా తనకు ఉన్న అనుభవంతో తోకలేని పిట్ట అనే సినిమాకు దర్శకత్వం కూడా వహించారు ధర్మవరం.. అయితే ఆ సినిమా ఆశించిన విజయం సాదించకపోవటం తరువాత దర్శకత్వానికి దూరంగా ఉంటూ కేవలం నటునిగానే తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు..

తేజ దర్శకత్వంలో తెరకెక్కిన నువ్వునేను, జయం, ధైర్యం లాంటి సినిమాలతో ఈ తరం ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు ధర్మవరం.. ముఖ్యంగా కాలేజీ లెక్చరర్‌తో పాటు తాగుబోతు పాత్రలలో ఆయన నటన కడుపుబ్బ నవ్విస్తుంది.. ఆయన చేసిన పాత్రలలో ఒక్కడు సినిమాలోని పాస్‌ పోర్ట్ ఆఫీసర్‌ క్యారెక్టర్‌తో పాటు, వర్షం సినిమాలోని వాతావరణ శాఖాదికారి పాత్రలు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి.. ముఖ్యంగా ఢిఫరెంట్‌ డిక్షన్‌తో ఆయన చెప్పే డైలాగ్‌లకు థియేటర్స్‌లో విజిల్స్‌ పడేవి..మరింత కాలం తన నటనతో మనల్ని అలరిస్తాడనుకున్న ధర్మవరం ఇలా అర్థాంతరంగా మన అందరిన మోసం చేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవటంతో సినీ రంగంతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా దిగ్‌భ్రాంతి గురయ్యారు.. ఆయన మరణంతో తెలుగు తెర మీద ఓ హస్యశకం ముగిసింది.. కొన్ని పాత్రల ప్రయాణం ఆగిపోయింది.. ఎన్నో పాత్రలతో తెలుగు ప్రేక్షక లోకాన్ని అలరించిన ధర్మవరపు సుబ్రహ్మణ్యానికి మరొక్కసారి నివాళి అర్పిద్దాం..

By
en-us Political News

  
సాయికృష్ణ మిస్సింగ్ కేసును రాజకీయం చేయాలని వైసీపీ చూస్తోందనీ., కానీ ఈ కేసులో నిందితుడైన సీఐ నాగరాజు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవాడేనని గుర్తుచేశారు. తప్పు చేసిన వాడు ఏ కులానికి చెందినవాడైనా తప్పేనని, దానికి కులాన్ని అంటగట్టడం సరికాదని హితవు పలికారు.
ఆ అమ్మాయి నోట జగన్ సార్ అనే మాట రాగానే.. అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డేనంటూ వైఎసీపీ సోషల్ మీడియా విభాగం పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారానికి తెరలేపింది. ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడింది వైఎస్ జగనేనంటూ ఫోటోలు మార్ఫింగ్ చేసి నెట్టింట పోస్టులు పెట్టారు. ఈ క్రెడిట్ చోరీపై కిరాక్ ఆర్పీ సాక్ష్యాలను చూపిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు.
  బాధిత తల్లితో సిఐ నాగరాజు మాట్లాడిన ఆడియో సంభాషణలు, ఆయన ప్రదర్శించిన దురుసు ప్రవర్తన ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో బహిర్గతమై ప్రపంచమంతటా సంచలనం సృష్టించాయన్నారు.
ఈ శిలాఫలకంపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేరు ఎక్కడా కనిపించలేదు. ఈ వింత పరిస్థితిని గమనించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆశ్చర్యానికి గురయ్యారు. ఎంతో ఉత్సాహంగా కార్యక్రమానికి వచ్చిన ఆయన, ఆ శిలాఫలకంపై తన పేరు లేకపోవడంతో నిరాశకు లోనయ్యారు.
కాంగ్రెస్ నేతల పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి..
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఎప్పుడూ ఊహించని మలుపులు చోటుచేసుకుంటూనే ఉంటాయి
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి తోట త్రిమూర్తులు నేతృత్వంలో జరిగిన వైసీపీ కాపు సామాజిక వర్గాల నాయకుల సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోందన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇటీవల జరిగిన సుదీర్ఘ భేటీ తర్వాత పవన్ టోన్ పూర్తిగా మారినట్లు స్పష్టమవుతోంది. తాను కేవలం 21 సీట్లు గెలిచిన ఒక ప్రాంతీయ పార్టీ నేతగా మాత్రమే కాకుండా.. కేంద్రంలోని పెద్దల అండదండలు ఉన్న సుపీరియర్ పొజిషన్‌లో ఉన్నాననే సంకేతాన్ని పవన్ పంపించారన్నారు.
కూటమి ప్రభుత్వంలో పరిపాలనా లోపాలు, రాజకీయ సమన్వయ లేమి స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. గతంలో ఆర్టీజీఎస్ వంటి డిజిటల్ వ్యవస్థల ద్వారా లభించిన 80 శాతం ప్రజా సంతృప్తి కేవలం కాగితాలకే పరిమితమైందనీ.. డిజిటల్ కనెక్టివిటీ పెరిగి భౌతిక సంబంధాలు దెబ్బతినడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తమ సర్వేలో తేలిందని చెప్పారు.
ఎన్నికల బరిలో కేసీఆర్, బీఆర్ఎస్ కూటమిని ఢీకొట్టడం ఎవరికైనా పెద్ద సవాలే. గతంలో కేసీఆర్ వాడే ఘాటైన రాజకీయ విమర్శలు, వ్యంగ్యాస్త్రాలపై ఆయనకు మాత్రమే పేటెంట్ హక్కు ఉందనే భావన ఉండేది. కానీ రేవంత్ రెడ్డి రాకతో.. ఆ ముద్రను పూర్తిగా చెరిపివేశారు. కేసీఆర్, కేటీఆర్ ల కంటే మరింత దూకుడుగా, ఘాటుగా రేవంత్ ప్రజల్లోకి వెళ్లారు.
కేంద్ర ప్రభుత్వం పాలసీలు లేదా ప్రాజెక్టులను ఏ ఒక్కరి కోసమో కాకుండా దేశ ప్రజలందరి కోసమే ప్రవేశపెడుతుందని బదులిచ్చారు. అయితే.. ఆ ప్రాజెక్టులను అందుకోవడంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగంగా, సానుకూలంగా స్పందిస్తుందనే దానిపైనే వాటి రాక ఆధారపడి ఉంటుందని చెప్పారు.
చంద్రబాబు నాయుడు కుమారుడిగా, ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నేతగా మాత్రమే గుర్తింపు ఉన్న యువకుడు నారా లోకేష్. అదే నారా లోకేష్ ఇప్పుడు ప్రజా క్షేత్రంలో తిరుగులేని నాయకుడిగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు.
ఈ చర్చోపచర్చలు, ఊహాగాన సభలపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ ప్రెస్ అడ్డా వేదికగా క్లారిటీ ఇచ్చారు. దేశానికి నరేంద్ర మోదీ రూపంలో ఒక బలమైన ప్రధానమంత్రి ఉన్నారన్న లోకేష్.. చంద్రబాబు ప్రధాని అన్న చర్చకు, వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.