మావోయిస్టుల కంచుకోట కర్రెగుట్టలో డీజీపీ పర్యటన..!

Publish Date:Aug 10, 2026

Advertisement

 

ఒకప్పుడు మావోయిస్టు లకు కంచుకోటగా, సేఫ్‌ షెల్టర్‌ జోన్‌గా ఉన్న కర్రెగు ట్టలు ఇప్పుడు తెలంగాణ పోలీసుల పటిష్ట భద్రతలోకి వచ్చాయి. మావోయి స్టుల కార్యకలాపాలకు కీలక స్థావరంగా ఉన్న కర్రెగుట్టలను స్వాధీనం చేసుకోవడంలో తెలంగాణ పోలీసులు కీలక పాత్ర పోషించారని రాష్ట్ర డీజీపీ సీ వీ ఆనంద్ తెలిపారు. కర్రెగుట్టల్లో పర్యటించిన డీజీపీ అక్కడి పరిస్థితులను పరిశీలించడంతో పాటు జరుగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా సమీక్షించారు. గతంలో కర్రెగుట్టలు మావోయిస్టులకు కీలకమైన ప్రాంతంగా ఉండేవని డీజీపీ పేర్కొన్నారు. దట్టమైన అటవీ ప్రాంతం, కొండలు, క్లిష్ట మైన భౌగోళిక పరిస్థితుల కారణంగా మావోయిస్టులకు ఈ ప్రాంతం సురక్షిత స్థావరంగా మారిందన్నారు. పోలీసుల కదలికలను ముందుగానే గుర్తించి తప్పించుకునేందుకు అనుకూలంగా ఉండటం తో కర్రెగుట్టలను మావోయిస్టులు సేఫ్‌ షెల్టర్‌ జోన్‌గా వినియోగించుకున్నారని తెలిపారు. 

అలాంటి ప్రాంతాన్ని పోలీసులు సమర్థవంతమైన వ్యూహం తో తమ ఆధీనంలోకి తీసుకున్నారని చెప్పారు. కర్రెగుట్టలను స్వాధీనం చేసుకోవడంలో తెలంగాణ పోలీసు బలగాలు కీలక పాత్ర పోషించాయని డీజీపీ వివరించారు. కర్రెగుట్టలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న అనంతరం అక్కడ ప్రత్యేక పోలీసు దళాలను ఏర్పాటు చేసినట్లు డీజీపీ తెలిపారు. నిరంతరం భద్రతా పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. గతంలో కర్రెగుట్టల్లోకి చేరుకోవాలంటే తీవ్రంగా శ్రమించాల్సి వచ్చేదని, ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని పేర్కొన్నారు. పోలీసుల నిరంతర నిఘా, భద్రతా చర్యలతో మావోయిస్టుల కార్యకలాపాలకు అడ్డుకట్ట పడిందన్నారు.

కర్రెగుట్టలను స్వాధీనం చేసుకున్న తర్వాత మావోయిస్టులపై ఒత్తిడి పెరిగి, పలువురు మావోయిస్టులు లొంగి పోయే పరిస్థితి ఏర్పడిం దని తెలిపారు. కర్రెగుట్టలో చేపడుతున్న అభివృద్ధి పనులను డీజీపీ స్వయం గా పరిశీలించారు. స్థానికంగా మౌలిక వస తుల అభివృద్ధి, రహదారులు, ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పన తదితర అంశాలపై అధికా రులతో చర్చించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకు రావాలని సూచించారు. 

మావోయిస్టుల ప్రభావం నుంచి బయటపడిన కర్రెగుట్టలను భవిష్యత్తులో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని డీజీపీ తెలిపారు. కర్రెగుట్టల ప్రకృతి అందాలు, అటవీ ప్రాంతం, కొండ ప్రాంతా లను పర్యాటకులకు ఆకర్షణీయంగా మార్చే అవకాశాలను పరిశీలిస్తు న్నామని.డీజీపి చెప్పారు. భద్రతతో పాటు ప్రాంత అభివృద్ధి, పర్యాటక రంగం విస్తరణపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. 

టూరిజం అభివృద్ధి చెందితే స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఈ ప్రాంతానికి మరింత గుర్తింపు వస్తుందని అధికారులు భావిస్తున్నారు మొత్తంగా.. ఒకప్పుడు మావోయిస్టుల సేఫ్‌ షెల్టర్‌గా పేరొందిన కర్రెగుట్టలు ఇప్పుడు పోలీసుల భద్రతలోకి రావడంతో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి. భద్రత, మౌలిక వసతులు, పర్యాటక అభివృద్ధితో కర్రెగుట్టలకు కొత్త రూపు తీసుకురావడమే లక్ష్యం గా అధికారులు ముందు కు సాగుతున్నారు.

DGPs visit to Karregutta, DGP C.V. Anand, CM Revanth reddy, Telangana Police

By
en-us Political News

  
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టనున్న అండర్‌పాస్, ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.
వేగవంతమైన డిజిటల్ కనెక్టివిటీ ప్రజల జీవితాలను, వ్యాపార ఆశయాలను ఎలా మారుస్తుందో తెలుసుకోండి. వోడాఫోన్ సర్వేలోని కీలక గణాంకాలు, విజయావకాశాలు మరియు ఎదురవుతున్న సవాళ్లపై ప్రత్యేక కథనం.
పెళ్లైన ఆరు నెలల్లోనే విషాదం..!
ఆస్ట్రేలియా సెన్సస్ 2026 గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఆగస్టు 11 సెన్సస్ నైట్ తేదీ, నిబంధనలు, AU$364 జరిమానాలు, ఎవరు అర్హులు మరియు హెల్ప్‌లైన్ సమాచారం ఇక్కడ చూడండి.
జంతర్ మంతర్‌లో ఓ న్యాయం.. ఝార్ఖండ్‌లో మరో న్యాయమా..!
లీప్ ఇండియా ఐపీఓ LEAP India IPO బిడ్డింగ్ చివరి రోజు సబ్‌స్క్రిప్షన్ స్టేటస్, గ్రే మార్కెట్ ప్రీమియం GMP , ఐపీఓ ధర, లిస్టింగ్ తేదీలు మరియు విశ్లేషకుల సబ్‌స్క్రైబ్ రేటింగ్స్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం 1.75 లక్షలకు పైగా యూఎస్ వీసాలను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. నేరారోపణలు, బర్త్ టూరిజం, $5 మిలియన్ల ఆర్థిక స్కామ్‌లు మరియు సోషల్ మీడియా పోస్టులే ప్రధాన కారణంగా వీసాల వేటు పడింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
గౌతమ్ అదానీపై అమెరికా కోర్టులో ఉన్న సంచలనాత్మక లంచం మరియు మోసం కేసును యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు శాశ్వతంగా కొట్టివేసింది. ఈ చారిత్రాత్మక తీర్పుతో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ పోర్ట్స్ షేర్లు భారీగా లాభపడ్డాయి. సంపూర్ణ కథనం కోసం చదవండి!
విశాఖపట్నంలో ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆగస్టు 11న దేశీయంగా బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీలతో సహా ప్రధాన నగరాల్లో 24K, 22K మరియు 18K బంగారం లేటెస్ట్ రేట్లు ఎంత పెరిగాయో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
శ్రీలంకతో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టులోకి సర్ఫరాజ్ ఖాన్ పునరాగమనం చేయడంపై మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్పిన్ ట్రాక్‌లపై ధృవ్ జురెల్ కంటే సర్ఫరాజ్ ఖానే ఎందుకు సరైన ఎంపికో కైఫ్ విశ్లేషించారు.
విదేశాంగ శాఖతో లోకేశ్ సంప్రదింపులు.. మాతృభూమికి రప్పించేందుకు ప్రయత్నాలు.. !
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.