సీఐల నుంచి డీఎస్పీలుగా 36 మందికి పదోన్నతి...పోస్టింగ్‌లు ఖరారు

Publish Date:Jun 29, 2026

Advertisement

 

తెలంగాణ పోలీసు శాఖలో కీలక పరిపాలనా మార్పులు చోటుచేసుకున్నాయి. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) హోదాలో పనిచేస్తున్న 36 మంది అధికారులకు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాలు, విభాగాల్లో పోస్టింగ్‌లు ఇచ్చింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్, డీజీ (లా అండ్ ఆర్డర్) మహేష్ భగవత్‌తో పాటు పలువురు ఉన్నతా ధికారులు పాల్గొన్నారు. పదోన్నతి పొందిన అధికారులను అభినందించిన డీజీపీ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ.. "పదోన్నతి అనేది హోదా పెరగడం మాత్రమే కాదు.. బాధ్యతలు కూడా అంతే స్థాయిలో పెరుగుతాయి" అని అన్నారు. పోలీసు శాఖ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రతి అధికారి నిజాయితీ, క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.

ప్రజల సమ స్యలను సత్వరమే గుర్తించి చట్టబద్ధంగా, పారదర్శకంగా పరిష్కరించాలని, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీజీపీ స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణతో పాటు ప్రజలతో మరింత సత్సంబంధాలు పెంపొందించే దిశగా పనిచేస్తేనే పోలీసు శాఖపై ప్రజల విశ్వాసం మరింత బలపడుతుందని పేర్కొ న్నారు.

డీఎస్పీ హోదాలో తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజల నమ్మకాన్ని పెంచేదిగా ఉండాలని, ఉన్నతాధి కారుల మార్గదర్శకాలను అనుసరిస్తూ సమర్థవం తమైన నాయకత్వాన్ని ప్రదర్శించాలని సూచిం చారు. ప్రజల భద్రత, సంక్షేమమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని, అంకితభావంతో పనిచేసే అధికారులకు మరింత ఉన్నత అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కీలక విషయం ఏమిటంటే, డీఎస్పీలుగా పదోన్నతి పొందిన ఈ 36 మంది అధికారులకు ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ లేదా ట్రాఫిక్ విభాగాల్లో కాకుండా, పోలీసు శాఖలోని ఇతర ప్రత్యేక విభాగాలు, యూనిట్లలో పోస్టింగ్‌లు కేటాయించారు. దీంతో ఆయా విభాగాల్లో పరిపాలనా సామర్థ్యం మరింత బలోపేతం కానుందని అధికారులు భావిస్తున్నారు.


 

By
en-us Political News

  
సీఎం చంద్రబాబును కలిసిన వివిధ ఉద్యోగ సంఘాల నేతలు
దిల్‌సుఖ్‌నగర్ చౌరస్తాలో నిరుద్యోగులతో కలిసి ధర్నాకు దిగిన మాజీ ఎమ్మెల్సీ..
ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సరికొత్త ప్రణాళిక
విజయవాడ నగరంలో తీవ్ర కలకలం రేపిన సాయికృష్ణ లాకప్ డెత్ ఉదంతంలో సోమవారం ఒక అత్యంత కీలకమైన పరిణామం చోటుచేసుకుంది.
అల్వాల్‌లో సంచలనం సృష్టించిన నిత్య పెళ్లికొడుకు కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటుచేసుకుంది.
తెలంగాణవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత భారీ తీపి కబురు అందించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏకైక రాజధానిగా అమరావతి వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది.
వీబీజీ రామ్‌జీ చట్టంపై అభ్యంతరాలను కేంద్ర మంత్రికి వివరించిన సీత‌క్క‌..
దేశం మొత్తం ఏపీ విద్యా మోడల్ గురించే మాట్లాడాలి...
కేజీఎఫ్ చేతులెత్తేసిన చోట తవ్వకాలు సాధ్యమా...?
యావత్ దేశం గర్వించే రాజధాని నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
తెలంగాణ పోలీస్ శాఖలో భారీ స్థాయిలో బదిలీల పర్వం చోటుచేసుకుంది.
ఘాట్కేసర్‌లో అర్థరాత్రి వేళ చోటుచేసుకున్న ఘటన స్థానికులను కలవరానికి గురిచేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.