శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు
Publish Date:Nov 1, 2024
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. వీకెండ్ దగ్గర పడటం, దీపావళి సందర్భంగా గురువారం (అక్టోబర్ 31) సెలవు దినం కావడంతో భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి అధిక సంఖ్యలో వస్తున్నారు. శుక్రవారం (నవంబర్ 1) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ టీబీసీ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక గురువారం (అక్టోబర్ 31) శ్రీవారిని మొత్తం 63 వేల 987 మంది దర్శించుకున్నారు. వారిలో 20 వేల 902 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 2 కోట్ల 66 లక్షల రూపాయలు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-187698.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-187698.html
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026





