శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
Publish Date:Aug 21, 2025
Advertisement
కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల క్షేత్రం భక్త జన సంద్రంగా మారింది. తిరుమల వేంకటేశ్వరుడి దర్శనం కోసం రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. శుక్రవారం (ఆగస్టు 22) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక గురువారం (ఆగస్టు 21) శ్రీవారిని మొత్తం 65 వేల 112 మంది దర్శించుకున్నారు. వారిలో 27 వేల 321 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల49 లక్షల రూపాయలు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-39-204733.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-39-204733.html
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026





