తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Publish Date:Aug 20, 2024
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. లాంగ్ వీకెండ్ కారణంగా గత నాలుగు రోజులుగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. మంగళవారం (ఆగస్టు 20) కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం (ఆగస్టు 20) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 22 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక సోమవారం (ఆగస్టు 19) శ్రీవారిని మొత్తం 71 వేల595 మంది దర్శించుకున్నారు. వారిలో 28 వేల 981 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 89 లక్షల రూపాయలు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-183260.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-183260.html
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026





