రూ.3 లక్షలతో మొదలు.. రూ.100 కోట్ల బిజినెస్.. ముగ్గురు స్నేహితుల సక్సెస్ స్టోరీ.!

Publish Date:Oct 5, 2026

Advertisement

చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!

చేతిలో రూ.3 లక్షలు.. మనసులో ఒక పెద్ద కల! ఉద్యోగం కోసం ఎదురుచూడకుండా, ముగ్గురు స్నేహితులు చాయ్‌తో తమ సొంత సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఒకప్పుడు సెకండ్‌హ్యాండ్ మొబైల్ ఫోన్లు అమ్మిన ఈ యువకులే.. నేడు వందల కోట్ల వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. కేవలం ఒక చిన్న చాయ్ కేఫ్‌తో మొదలైన వారి ప్రయాణం.. ఏకంగా రూ.100 కోట్ల టర్నోవర్‌ దాటింది. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు? వాళ్ల ఆలోచన ఏమిటి? రూ.3 లక్షల పెట్టుబడి ఎలా వందల కోట్ల వ్యాపారంగా మారింది? ఇదే ‘చాయ్ సుట్టా బార్’ సక్సెస్ స్టోరీ.

ఉద్యోగాల కోసం పెద్ద చదువులు చదివి.. ఇంటర్వ్యూల చుట్టూ తిరిగే యువతకు ఇండోర్‌కు చెందిన ముగ్గురు స్నేహితులు సరికొత్త మార్గాన్ని చూపించారు. కేవలం రూ.3 లక్షల పెట్టుబడితో ప్రారంభించిన చిన్న చాయ్ వ్యాపారాన్ని.. నేడు రూ.100 కోట్ల టర్నోవర్ సాధించే స్థాయికి తీసుకెళ్లారు. అదే ‘చాయ్ సుట్టా బార్’.మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన అనుభవ్ దూబే, ఆనంద్ నాయక్ తొలుత సాధారణ ఉద్యోగాల వైపు వెళ్లకుండా సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా సెకండ్‌హ్యాండ్ మొబైల్ ఫోన్ల విక్రయాలు చేపట్టి వ్యాపార నిర్వహణలో అనుభవం సంపాదించారు. ఆ తర్వాత రాహుల్ పాటిదార్ వీరితో కలవడంతో ముగ్గురి ప్రయాణం మరో మలుపు తిరిగింది.2016లో ఈ ముగ్గురు కలిసి రూ.3 లక్షల ప్రారంభ పెట్టుబడితో ఇండోర్‌లో తొలి ‘చాయ్ సుట్టా బార్’ ఔట్‌లెట్‌ను ప్రారంభించారు.

 సంప్రదాయానికి ప్రాధాన్యం ఇస్తూ.. ప్లాస్టిక్, పేపర్ కప్పులకు బదులుగా మట్టి కప్పుల్లో అంటే కుల్హాడ్లలో చాయ్ అందించడం ప్రారంభించారు. ఈ ప్రత్యేకత కస్టమర్లను ఆకట్టుకుంది.పేరులో ‘సుట్టా’ ఉన్నప్పటికీ.. కేఫ్‌లలో ఎక్కడా పొగతాగడానికి అనుమతి లేదు. దీంతో యువతతో పాటు కుటుంబాలు కూడా ఈ కేఫ్‌లకు రావడం మొదలైంది. సాధారణ చాయ్‌తో పాటు అల్లం, తులసి, చాక్లెట్, కేసర్ వంటి వివిధ రకాల ఫ్లేవర్డ్ చాయ్‌లను మెనూలో చేర్చారు. చాయ్‌తో పాటు కాఫీ, పాస్తా, బర్గర్లు, నూడుల్స్ వంటి స్నాక్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.అందుబాటు ధరల్లో నాణ్యమైన ఉత్పత్తులను అందించడం.. కస్టమర్లకు ప్రత్యేక అనుభూతిని కల్పించడం.. బ్రాండ్‌ను వేగంగా విస్తరించడం వంటి వ్యూహాలతో ‘చాయ్ సుట్టా బార్’కు ఆదరణ పెరిగింది. 

ముఖ్యంగా ఫ్రాంచైజీ మోడల్‌ను అనుసరించడంతో వ్యాపారం వేగంగా విస్తరించింది.ప్రస్తుతం ఈ బ్రాండ్‌కు భారత్‌తో పాటు కెనడా, యూఏఈ, నేపాల్ వంటి దేశాల్లోనూ ఔట్‌లెట్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 650కి పైగా ఔట్‌లెట్లతో విస్తరించిన ఈ సంస్థ.. రూ.100 కోట్లకు పైగా టర్నోవర్ సాధించినట్లు పేర్కొంటోంది. చిన్న ఆలోచనకు పట్టుదల తోడైతే.. భారీ విజయాన్ని సాధించవచ్చని ఈ ముగ్గురు స్నేహితుల ప్రయాణం నిరూపించింది. ఉద్యోగం కోసం ఎదురుచూడటం మాత్రమే కాకుండా.. అవకాశాలను సృష్టించుకోవచ్చని చూపిస్తూ నేటి యువతకు ‘చాయ్ సుట్టా బార్’ సక్సెస్ స్టోరీ ఒక స్ఫూర్తిగా నిలుస్తోంది.

 

 

 

[ Chai Sutta Bar, Chai Sutta Bar Success Story, Anubhav Dubey, Anand Nayak, Rahul Patidar, Tea Business, Business Success Story, Startup Success Story, Indian Entrepreneurs, Tea Cafe Business, 3 Lakh Investment, 100 Crore Turnover, Franchise Business, Startup India, Entrepreneurial Journey ]

By
en-us Political News

  
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్‌ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది.
అంతర్జాతీయ విమానయాన రంగంలో కలకలం సృష్టించిన ఫ్లైదుబాయ్ విమాన హైజాక్ యత్నం కేసులో విచారణ వేగవంతం కాగా, ఊహించని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ వీర జవాన్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
ఆశిష్ అనే యువకుడు జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కేసు.. దర్యాప్తు ముమ్మరం.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.