ముక్కోటి ఏకాదశి సందర్భంగా కిటకిటలాడుతున్న ఆలయాలు

Publish Date:Dec 29, 2025

Advertisement

ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోని దేవాలయాలన్నీ భక్తజనకోటితో కిక్కిరిసిపోయాయి. దేవాలయాలతో వైకుంఠ ద్వార దర్శనాలకు అర్ధరాత్రి నుంచే భక్తులు పోటెత్తారు.  తిరుమలలో శ్రీవారి ఆలయంలో సోమవారం (డిసెంబర్ 29) అర్ధరాత్రి దాటిన తరువాత నుంచి అంటే  12గంటలు దాటిన తరువాత నుంచీ ఉత్తర ద్వార దర్శనాలకు భక్తులను అనుమతించారు.  వేకువజామున 1.30 గంటల నుంచి ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులను  ఉత్తర ద్వార దర్శనం ద్వారాదర్శనానికి అనుమతించారు. ఇక ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు ఉత్తర ద్వార దర్శనానికి అనుమతిచ్చారు. 
అలాగే చిన్న తిరుపతిగా ప్రఖ్యాతిగాంచిన  ద్వారకా తిరుమలలో ఈ తెల్లవారు జామునుంచే ఉత్తర ద్వార దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఉదయం ఐదున్నర నుంచి శ్రీవారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునేందుకు అనుమతించారు.  భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.  

ఇక సింహాచలంలో  శ్రీవరాహా లక్ష్మీ నారసింహ స్వామి వారి దేవాలయంలో ఘనంగా వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.   అలాగే ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రసిద్ధ ఆలయాలలోనూ ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి దేవదేవుడిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్నారు. 

అదే విధంగా తెలంగాణలోని అన్ని వైష్ణవాలయాలూ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు తరలివచ్చిన భక్తులతో ఆలయాలన్నీ కిటకిట లాడు తున్నాయి.  రాష్ట్రంలోని   భద్రాచలం, యాదగిరిగుట్ట వంటి పుణ్యక్షేత్రాలతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వైష్ణవాలయాలూ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.  

By
en-us Political News

  
మహబూబ్‌నగర్ జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్‌పై ఏసీబీ దర్యాప్తు మరింత వేగవంతం చేశారు.
గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న బంజారాహిల్స్‌కు చెందిన హస్సా అనే మహిళను అరెస్ట్ చేశారు
తెలంగాణలో 3 శాతం సైబర్ నేరాలు తగ్గాయని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు.
ఏపీ గ్రూప్-2 రిజర్వేషన్లపై దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.
వన్యప్రాణి మాంసం విక్రయిస్తూ ఓ నిందితుడు ఎస్ఓటి పోలీసుల చేతికి చిక్కిడు
శ్రీలంకతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో నాలుగు వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత మహిళల జట్టు క్లీన్‌స్వీప్‌తో.. ఈ ఏడాదికి గ్రాండ్‌గా గుడ్‌బై చెప్పాలనుకొంటోంది.
అయితే ఈ సారి ఈ ఇబ్బంది లేకుండా చేయడానికి తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారులపై వెళ్లే వాహనదారులు టోల్ గేట్ల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా నేరుగా వెళ్లిపోయేందుకు వీలు కల్పించేలా వాహనాల టోల్‌చార్జీలను ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ఆ మేరకు నిర్ణయం అయితే తీసేసుకుందని విశ్వసనీయంగా తెలిసింది.
కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటులో ఎలాంటి మార్పులు లేవు. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో మదనపల్లె కేంద్రంగా అన్నమయ్య జిల్లాను పూర్తిగా పునర్వ్యవస్థీకరించనుంది.
. ప్రస్తుతం ఉన్న మూడు కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరిస్తూ నాలుగు కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. అంటే ప్రస్తుతం ఉన్న మూడు కమిషనరేట్లకు అదనంగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసింది.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, రాచకొండ పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న జి. సుధీర్ బాబును కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌కు పోలీస్ కమిషనర్‌గా నియమించింది.
మూడుకమిషనరేట్ లకు అదనంగా గా ఫ్యూచర్ సిటి కమిషనరేట్ ను ఏర్పాటు చేసి.. ఫ్యూచర్ సిటీ కమిషనర్ గా సుధీర్ బాబును నియమించింది.
బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహ్మాన్ భార్య అయిన ఖలీదా జియా.. తన భర్త మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చి అజేయ శక్తిగా ఎదిగారు. బంగ్లాదేశ్ ప్రధానిగా మూడు సార్లు  బాధ్యతలు చేపట్టిన ఆమె, ఆ దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు విశేషంగా కృషి చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్బంగా ముఖ్యమంత్రి ఫ్యామిలీ రేపు శ్రీవారిని దర్మించుకోనుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.