గుడివాడ బరిలో దేవినేని ఉమ.. కొడాలి నానికి చెక్!?

Publish Date:Sep 17, 2022

Advertisement

వైసీపీకి, ఆ పార్టీలోని కొందరు కీలక నేతలకు ముఖ్యంగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని లాంటి వారికి వచ్చే ఎన్నికల్లో ముకుతాడు వేసి, టీడీపీని పంచకళ్యాణి గుర్రంలా పరుగెత్తించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహాలు చురుగ్గా రచిస్తున్నారు.  విర్రవీగి  అసభ్యంగా మాట్లాడుతున్న కొడాలి నాని మెడలో గుడివాడ బరిలోనే గుదిబండ వేసి మరీ టీడీపీ జెండా రెపరెపలాడించాలని టీడీపీ అధిష్టానం ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో గుడివాడలో అమలు చేయాల్సిన ఎన్నికల వ్యూహాలపై ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీలో బలమైన నేతగా, వైసీపీకి దీటుగా జవాబు చెప్పగల నేతగా పేరున్న మాజీ మంత్రి దేవినేని ఉమను గుడివాడ బరిలో దింపాలనే యోచన చంద్రబాబు చేస్తున్నారని తెలుస్తోంది.

గుడివాడలో బలమైన అభ్యర్థి ఉంటే కొడాలి నానిని మట్టి కరిపించవచ్చని, ‘కొడాలి ఓటమి మిషన్’ సక్సెస్ అవుతుందన్న భావన టీడీపీ వర్గాల్లో బలంగా వ్యక్తం అవుతోందని సమాచారం. ఈ క్రమంలోనే పార్టీ అధినేత చంద్రబాబు కూడా దేవినేనికి గుడివాడ టికెట్ ఇచ్చి, సీటు గెలుచుకువచ్చే బాధ్యతలు అప్పగించాలనే యోచన చేస్తున్నారంటున్నారు. కొడాలి నానికి దేవినేని ఉమ అయితే.. సమ ఉజ్జీ అవుతారని, ఉమ గెలుపు తథ్యం అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

గుడివాడలో కొడాలి నానిని ఓడించడం, టీడీపీకి విజయం సాధించడం ఆ పార్టీ నేతల ముందు ఉన్న ముఖ్యమైన లక్ష్యంగా ఉంది. కొడాలి నానిని ఓడించడం కృష్ణా జిల్లా టీడీపీ నేతలే కాకుండా.. ఆ పార్టీ  కూడా ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోందని అంటున్నారు. తెలుగుదేశం అధినేత సహా,   పార్టీలోని పెద్దలపై నోరు పారేసుకుని మరీ విమర్శలు, ఆరోపణలు చేస్తున్న కొడాలి నానికి గుణపాఠం చెప్పే కార్యాచరణతో టీడీపీలోని కీలక నేతలు ఇప్పటికే వడివడిగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. కొడాలిపై ఫోకస్ పెట్టిన క్రమంలో టీడీపీలో కీలకమైన చర్చ కొనసాగుతోందంటున్నారు. ఈ చర్చల్లో భాగంగా కొడాలి నానికి గుడివాడ నియోజకవర్గం టీడీపీ ఇన్ చార్జి, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు దీటుగా బదులిస్తారా? లేక మరింత బలమైన నేతను బరిలో దింపాలా అన్న విషయం  తెరమీదకు వచ్చిందంటున్నారు. ఈ చర్చల క్రమంలోనే గుడివాడ నుంచి దేవినేని ఉమను బరిలో దింపితే ఫలితం అనుకూలంగా వస్తుందనే ధీమా పార్టీ నేతలలో వ్యక్తమైందని అంటున్నారు

రావి వెంకటేశ్వరరావు గతంతో పోల్చుకుంటే.. ఇప్పుడు మరింత యాక్టివ్ అయ్యారు. అయినప్పటికీ రావి వెంకటేశ్వరరావు స్పీడు రానున్న ఎన్నికల్లో కొడాలి నానిపై విజయం సాధించేందుకు సరిపోదనే అభిప్రాయం స్థానిక తెలుగు తమ్ముళ్లలో వ్యక్తమైందని సమాచారం. టీడీపీపై, టీడీపీ నేతలపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు.. ఆయన ఇమేజ్ ని చాలా వరకూ తగ్గించిందని, అయినప్పటికీ.. చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలన్నట్లు దేవినేని ఉమతో చెక్ చెప్పాలనే అభిప్రాయం టీడీపీ అధినేతకు కూడా వచ్చిందని చెబుతున్నారు. ఇదే అభిప్రాయం పలువురు టీడీపీ నేతల్లో కూడా కలిగిందని తెలుస్తోంది. అందుకే ప్రత్యేకంగా కృష్ణా జిల్లాలోని అనేక మంది కార్యకర్తలు, ముఖ్యమైన నేతలు కూడా దేవినేని ఉమ పేరును పార్టీ చీఫ్ చంద్రబాబుకు సూచిస్తున్నారంటూ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

నిజానికి దేవినేని ఉమ గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా జిల్లాతో మరీ ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గంలోని అనేక మంది పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఉన్న దేవినేని ఉమ గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. దాంతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ విస్తృత సమావేశంలో దేవినేని ఉమ చేసిన ప్రసంగం, తొడగొట్టి మరీ కొడాలి నానికి చాలెంజ్ విసరడంపై ఆ పార్టీ గుడివాడ నేతలు ప్రధానంగా చర్చించుకుంటున్నారు. ఈ విషయాలన్నీ విశ్లేషించుకుంటే.. బూతుల మాజీ మంత్రి కొడాలికి సరైన ప్రత్యర్ది దేవినేని ఉమ అవుతారని, లెక్క సరిపోతుందని అంటున్నారు. ‘మాహిష్మతీ ఊపిరి పీల్చుకో.. నా కొడుకు వచ్చాడు.. బాహుబలి తిరిగొచ్చాడు’ అని బాహుబలి సినిమాలో దేవ సేన అన్నట్లు.. ‘గుడివాడా ఊపిరి పీల్చుకో.. కొడాలి నాని కోరలు పీకేందుకు దేవినేని ఉమ వస్తున్నాడు’ అని టీడీపీ శ్రేణులు సంబరపడుతున్నాయి.

By
en-us Political News

  
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.