దేవినేని రాజకీయ ప్రస్థానం ఇలా...
Publish Date:Apr 17, 2017
Advertisement
రాజకీయ ప్రస్థానం...
ఆంధ్రప్రదేశ్, కృష్ణజిల్లా రాజకీయాల్లో చెరగని ముద్రవేసిన టీడీపీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ ఈరోజు ఉదయం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలోఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. మరోవైపు నెహ్రూ మరణవార్త వినగానే టీడీపీ నేతలు ఒక్కసారిగా దిగ్భాంతికి గురయ్యారు. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నెహ్రూ కుటుంబ సభ్యులకు తన సంతాపం తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... నెహ్రూ మృతి పార్టీకి, వ్యక్తిగతంగా తనకు తీరని లోటని... మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆయన ప్రజలకు అనేక సేవలు అందించారని అన్నారు. కాగా దేవినేని నెహ్రూ మృతిపై స్పీకర్ కోడెల శివప్రసాద్, మంత్రులు నారా లోకేశ్, ప్రత్తిపాటి పుల్లారావు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు సంతాపం ప్రకటించారు. అంతేకాదు ఇక ఆయన లేరు అనే విషయం తెలియగానే అభిమానులంతా నెహ్రూ ఇంటికి చేరారు. విజయవాడకు చెందిన ప్రజలు వేలాదిగా తరలి వచ్చారు. ఇక ఆయన రాజకీయ ప్రస్థానం గురించి చెప్పాలంటే..
1954 జూన్ 22 న జన్మించి... 1982లో యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (యూఎన్ఓ)ను నెహ్రూ ఏర్పాటు చేసి.. విజయవాడ రాజకీయాల్లో ఎంతో కీలక పాత్ర పోషించిన నెహ్రూ రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీ నుండే మొదలైంది. 1983లో టీడీపీ ఆవిర్భావ సమావేశంలో రాజకీయ ప్రవేశం చేసిన ఆయన ఆ తరువాత వరుసగా 1983, 1985, 1989, 1994, 2009లో విజయవాడ సమీపంలోని కంకిపాడు నుంచి, తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1996 తర్వాత మారిన పరిస్థితులతో టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2004 లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2009లో గెలిచారు. 2014లో ఎన్నికల్లో మళ్లీ పరాజయం పాలయ్యారు. ఆ తరువాత రాష్ట్ర విభజన అనంతరం.. కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు.
http://www.teluguone.com/news/content/devineni-nehru-39-73997.html





