నెహ్రూ పవర్ ముందు అనంత రక్తచరిత్ర దిగదుడుపే
Publish Date:Apr 18, 2017
Advertisement
అనంతపురం రక్తచరిత్రకు ఎంత పేరుందో, బెజవాడ రౌడీయిజానికి అంతకంటే ఒక ఆకు ఎక్కువే ఉంటుంది. చలసాని వెంకటరత్నంతో మొదలైన కథ... అనేక మలుపులు తిరిగి, చివరికి వంగవీటి, దేవినేని కుటుంబాల మధ్య వార్‌తో రక్తచరిత్రగా మారింది. 1978-79 నాటికి అది తీవ్ర రూపం దాల్చింది. ఒకప్పుడు కలిసి పనిచేసిన వంగవీటి-దేవినేని కుటుంబాలు.. ఆ తర్వాత బద్ధ శత్రువులుగా మారి ఒకరినొకరు చంపుకుంటూ రక్తచరిత్రను రాసుకున్నారు. మొదట్లో వంగవీటి వర్గం పైచేయి సాధించినట్లు కనిపించినా, దేవినేని నెహ్రూ ఎంట్రీతో అది తారుమారైంది. తన సోదరులు దేవినేని గాంధీ, మురళిల హత్యతో రగిలిపోయిన నెహ్రూ... అందుకు తిరుగులేని ప్రతీకారం తీర్చుకున్నారని అంటారు. అంతేకాదు ప్రత్యర్ధులు కనీసం తన నీడను కూడా తాకలేని స్థాయికి దేవినేని నెహ్రూ ఎదిగారు. తన సోదరుడు దేవినేని మురళి హత్యకు గురయ్యాక.... శపథం చేసి మరీ వంగవీటి రంగాను నెహ్రూ మట్టుబెట్టాడని నేటికీ విజయవాడ వాసులు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. మురళి సంవత్సరీకంలోపే వంగవీటి రంగా అంతు చూస్తానని శపథం చేసిన దేవినేని నెహ్రూ.... తాను అన్నట్లుగానే 9 నెలల్లోపే రంగాను అడ్డుతొలగించాడని చెబుతారు. అయితే రంగా హత్యకు ప్రతీకారంగా నెహ్రూని చంపేస్తామని రంగా అనుచరులు శపథం చేసినా అది వాళ్ల వల్ల కాలేకపోయిందట. అందుకు నెహ్రూ తీసుకున్న జాగ్రత్తలే కారణం . ఇంటి నుంచి కాలు బయటికి పెట్టాలన్నా, వంద రకాలుగా ఆలోచించేవారట. ఎంతో తెలివిగా, ముందుచూపుతో వ్యవహరిస్తూ ప్రత్యర్ధులకు చిక్కకుండా తిరిగేవారట. అందుకే వందసార్లు పైగా నెహ్రూని చంపేందుకు రంగా వర్గీయులు ప్రయత్నించినా తప్పించుకోగలిగారని బెజవాడ టాక్. ఇంకో విషయం ఏంటంటే రంగా హత్య తర్వాత జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నెహ్రూని అంతం చేయాలనుకున్న రంగా వర్గీయులకు నిరాశే ఎదురైందట. శత్రుశేషం లేకుండా రంగాకి కుడిభుజం, ఎడమభుజాలుగా చెప్పుకునే ముఖ్యమైన వ్యక్తులను నెహ్రూ వర్గీయులు మట్టుబెట్టారట. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల రూలింగ్‌లో ....అపోజిషన్‌లో ఉండి కూడా వంగవీటి వర్గంలోని పదిమందికి పైగా హత్యకు గురయ్యారట. దీంతో విజయవాడపై దేవినేని నెహ్రూకి తిరుగులేని పట్టు దొరికింది. నెహ్రూ ఎంత పవర్‌ఫుల్‌గా ఎదిగారంటే... రంగా వర్గీయులు.... తన అనుచరుల్లో ఒక్కరినీ కూడా టచ్ చేయలేనంతగా. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా రంగా వర్గీయులను ముట్టుబెట్టడంతో విజయవాడతో పాటు పరిసర ప్రాంతాల్లో దేవినేని నెహ్రూ ప్రాబల్యం పెరిగింది. అప్పటి నుంచి నెహ్రూ చెప్పిందే వేదం... మాటే శాసనంగా మారింది.
http://www.teluguone.com/news/content/devineni-nehru-45-74052.html





