ఐటి రంగం అభివృద్ధి  మ‌న కృషే  ... చంద్ర‌బాబు

Publish Date:Aug 15, 2022

Advertisement

దేశ సమైక్యత విషయంలో తెలుగు దేశం పార్టీ ఎప్పుడు ముందుంటుందని, టెలీ కమ్యూ నికేషన్ రంగంలో మార్పులకు తెలుగు దేశం పార్టీ నాంది పలికిందని టీడీపీ జాతీయ అధ్య క్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సోమవారం గుంటూరు జిల్లా, చేబ్రోలులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లా డుతూ, విమానాశ్రయాలు, నౌకాశ్రయాల నిర్మాణానికి కృషి చేశామని,  మనం చేసిన కృషి కారణంగా ఐటి రంగం అభివృద్ధి జరిగిం దని, ఇప్పుడు  అదే వెన్నెముకగా మారిం దన్నారు.  
 
స్వాతంత్య్రం నుంచి దేశంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయని చంద్రబాబు అన్నారు. కరోనాను లెక్క చేయకుండా దేశా నికి అన్నం పెట్టడానికి శ్రమించిన రైతులను మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలన్నారు. ఒకనాడు పేదరికంలో మగ్గిన దేశం  నేడు ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి వచ్చిందని, రక్షణ రంగంలో ఎంతో పురోభివృద్ధి సాధించామన్నారు. సొంతగా ఆయుధాలు తయారు చేసుకుంటున్నామన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత పేదరికం, రైతుల ఆత్మహత్యలు, రహదారులు లేకపోవటం వంటి సమస్యలు ఉన్నాయని, ప్రభుత్వ విధానాల వల్ల సమస్యలు వస్తాయన్నారు.

విదేశి పాలనలో దేశం దోపిడీకి గురైందని, ప్రజలు బానిసత్వంలో మగ్గారని, విదేశీ పాలనలో పేదరికం, కరవు కాటకాలు అనుభ వించారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  అన్నారు.  నెహ్రూ నుంచి పీవీ నరసిం హారావు , వాజ్ పేయి వంటి వారు దేశం కోసం ఎన్నో పనులు చేశారని కొనియాడారు. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నో విషయాల్లో ముందున్నారని, ప్రపంచంలో మేటైన మేధావులు ఉండే దేశం మనదని, పీవీ నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు మన దేశాన్ని ప్రపం చంతో పోటీ పడేలా చేశాయన్నారు. ఈ సందర్భంగా ఎన్టీ రామారావుని కూడా స్మరించు కోవా లన్నారు. పేద ప్రజలకు మేలు చేయటం కోసం ఆయన రాజకీయాల్లోకి వచ్చారని కొనియాడారు.

రాబోయే పాత‌కేళ్లలో ఏం చేయాలో ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళ్లాలని చంద్రబాబు సూచించారు. విలువలతో కూడిన సమాజం ఏర్పాటుకు కృషి చేయాలని, లేకపోతే సమాజం విచ్ఛిన్నం అవుతుందన్నారు. మేము తీసుకున్న చర్యల వల్ల రైతు బిడ్డలు కూడా ఐటి రంగంలోకి వచ్చారని, అప్పుడు వేసిన విత్తనం ఇప్పుడు వృక్షంగా మారి ఫలసాయం వస్తోందన్నారు.  ప్రపం చంలోని పెద్ద పెద్ద కంపెనీలకు మన వాళ్లే సీఈవోలుగా ఉన్నారని, అది తెలుగువారి సత్తా.. బారతీయుల సత్తా అని అన్నా రు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి పోవాలని, వారిని ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపిచ్చారు. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా రైతుల ఆత్మహత్యలు దేశానికి మంచిది కాదన్నారు. విద్య, ఆరోగ్యం విషయంలో ఇంకా ముం దుకు పోవాలని, త‌మ పాల‌న‌లో తెచ్చిన మహిళా రిజర్వేషన్లతో వారు చదివి, ఉద్యోగాల్లో స్థిర పడ్డారని, పురుషులతో సమానంగా పోటీ పడి ముందుకు వెళ్తున్నారన్నారు. 

నదుల అనుసంధానం ఈ దేశంలో చిరకాల వాంఛ అని, నదీ జలాలను సముద్రంలో కలవ కుండా సద్వినియోగం చేసుకోవాల న్నారు. టీడీపీ హయాంలో గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం చేసి చూపామని, గంగా, కావేరి నదుల అనుసంధానం చాలా ముఖ్యమని అభిప్రాయం వ్యక్తం చేశారు. అవినీతి ఉన్నచోట అభివృద్ధి జరగదన్నారు. జన్మభూమి అభివృద్ధి కోసం ప్రవా సులు కృషి చేయాలని పిలుపిచ్చారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మనకు ఆదర్శమని, మహత్మా గాంధీ చేసిన పోరాటం  ప్రపంచానికి స్ఫూర్తి అని, మన గౌరవం, ప్రతిష్ట పెరగాలంటే దేశభక్తి, క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలన్నారు. 

By
en-us Political News

  
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
రా బిడ్డా.. అసెంబ్లీకి’.. KTRకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్.!
భారతీయ రైల్వేలో ప్రయాణం చేయడానికి ప్రయాణికులు చాలా కాలం ముందే టికెట్లను రిజర్వ్ చేసుకుంటూ ఉంటారు.
తండ్రి అంటే పిల్లలకు ఉండే ప్రాణం, ఆప్యాయత ఎంతో గొప్పవి. కానీ ఆ ప్రేమ కొన్నిసార్లు ఊహకందని వింత నిర్ణయాలకు దారితీస్తుంది.
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో తీవ్ర కలకలం రేపిన ఉదంతంలో ఒకరు దారుణ హత్యకు గురయ్యారు.
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
జమ్మూకశ్మీర్‌‌లోని కతువా జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్‌ నగరంలోని నిమ్స్‌ అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీ భాస్కర్‌పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తును ముమ్మరం చేసింది.
హైదరాబాద్‌లోని టెక్ హబ్ మాదాపూర్‌లో జరిగిన ఒక సంచలన ఘటన కలకలం రేపింది.
దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. పబ్‌కు తీసుకెళ్లి రూ.29 వేల బిల్లు.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.