క్రెడిట్ కోసం ఉబలాటం.. పలుచనౌతున్న జగన్ ప్రతిష్ఠ!

Publish Date:Mar 26, 2026

Advertisement

ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క పరిశ్రమను తీసుకురాలేదు సరికదా.. అప్పటికే ఉన్న పరిశ్రమలను తరిమేసింది. జగన్ హయాంలో ఏపీలో పెట్టుబడులు అన్న మాట ఎత్తడానికే పారిశ్రామిక వేత్తలు భయపడ్డారు. అభివృద్ధి అన్న మాటే జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఏపీలో ఎక్కడా వినిపించలేదు. ఐదేళ్లు అధికారంలో ఉండి జగన్ సాధించిందేమిటయ్యా అంటే ఎవరైనా సరే జీరో అనే చెబుతారు. 

2014 నుంచి 2019 వరకూ ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్నారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ లో దక్షిణ కొరియాకు చెందిన ఆటోమెబైల్ దిగ్గజ కంపెనీ కియా మోటర్స్ ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో భారీ పెట్టుబడితో తన కార్ల తయారీ కంపెనీని స్థాపించింది. అప్పట్లో కియాదే దేశంలోకెల్లా అత్యంత భారీ విదేశీ పెట్టుబడి. జగన్ అధికార పగ్గాలు చేపట్టిన తొలి రోజుల్లో   కియా జగన్ అస్తవ్యస్థ విధానాలకు విసిగి ఏపీనుంచి తరలిపోవాలని నిర్ణయించుకుందన్న వార్తలు వినిపించాయి. ఒక వైసీపీ ఎంపీ అయితే బహిరంగంగా కియా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ ను బెదిరించడం కనిపించింది. అయితే కియా విషయంలో  ప్రజల నుంచి వైసీపీపై తీవ్ర వ్యతిరేకత రావడంతో అప్పట్లో వైసీపీ వెనకడుగు వేసింది. దీంతో కియా రాష్ట్రంలో కొనసాగింది. అయితే కియా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కారణం చంద్రబాబు కాదనీ, ఆ క్రెడిట్ మొత్తం జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిదనీ వైసీపీ క్లెయిమ్ చేసుకుంది. ఎప్పుడో వైఎస్ రాజశేఖరరెడ్డి రాసిన లేఖ కారణంగానే కియా ఏపీలో పెట్టుబడులు పెట్టిందని జగన్ హయాంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన బుగ్గన రాజేంధ్రనాథ్ క్రెడిట్ మొత్తం జగన్ కు కట్టబెట్టేయడానికి ప్రయత్నించారు.

అలాగే.. టీసీఎస్ విశాఖలో బ్రాంచి ఏర్పాటు చేయనున్నదనీ, దీని ద్వారా ప్రత్యక్షంగా పది వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయనీ నారా లోకేష్ ప్రకటించారు.లోకేష్ ఇలా ప్రకటించారో లేదో.. అలా వైసీపీ టీసీఎస్ రాష్ట్రానికి రావడానికి క్రెడిట్ జగన్ దే అంటూ ప్రచారం మొదలెట్టేసింది. ఇందు కోసం కొన్ని పేపర్ కట్టింగులు, వైబ్ సైట్ లింకులను సొంత సామాజిక మాధ్యమంలో సర్క్యులేట్ చేసి   జగన్ సర్కార్ ఎప్పుడో 2020లోనే టీసీఎస్ ను విశాఖకు తీసుకువచ్చిందనీ, ఆ ఘనత అంతా జగన్ దే అంటూ భజన చేసుకుంది.  వాస్తవానికి జగన్  హయాంలో  టీసీఎస్ విశాఖలో తన బ్రాంచ్ ప్రారం భిస్తున్నట్లు అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. అలాగే అప్పట్లో జగన్ సర్కార్ టీసీఎస్ కు ఇస్తున్న ఇన్సెంటివ్ ల గురించి కానీ, కేటాయిస్తున్న భూమి గురించి కానీ ఎటువంటి ప్రకటనా చేయలేదు. అయితే తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే  టీసీఎస్ విశాఖలో బ్రాంచిని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటనా వెలువడింది. వాస్తవం ఇలా ఉంటే  జగన్ మాత్రం విశాఖకు టీసీఎస్ తన క్రెడిట్ అంటూ క్రిడిట్ చోరీకి నానా పాట్లూ పడ్డారు

అలా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు.. ప్రస్తత తెలుగుదేశం కూటమి సాధిస్తున్న విజయాలనూ, తీసుకువస్తున్న పరిశ్రమలనూ తన ఖాతాలో వేసుకుని క్రెడిట్ కొట్టేయాలన్న తాపత్రయంలో ఓ జోకర్ స్థాయికి దిగజారి పోతున్నారని పరిశీలకులు విమర్శిస్తున్నారు. నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. మడమ తిప్పను, మాట తప్పను, విశ్వసనీయతకు నిలువెత్తు రూపం అంటూ గతంలో పదేపదే చెప్పుకున్న జగన్ ఇప్పుడు.. నిత్యం అసత్యాలను వల్లెవేస్తూ.. విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారంటున్నారు.  

కొద్ది నెలల క్రితం ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఒడిశాకు వెళ్లిపోతోంది.. చంద్రబాబు ఏపీకి వస్తుందంటూ ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నారు అని ఎగతాళి చేసిన జగన్..  ఇప్పుడు అదే ప్లాంట్‌కు రాష్ట్రంలో శంకుస్థాపన జరగడంతో వెంటనే ప్లేట్ ఫిరాయించేశారు. రాష్ట్రానికి అర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంటును తీసుకువచ్చింది తానే అంటూ తన భుజాలను తానే చరిచేసుకుంటూ.. స్వోత్కర్షకు దిగారు.

 ఇందుకు సంబంధించి ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు చెప్పుకుంటున్న గొప్పలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఆయన మాటల్లోని డొల్ల తనాన్ని మరో సారి ప్రస్ఫుటంగా బయటపెడుతున్నాయి.  ఆయన పాత వీడియోలు, ప్రస్తుత వ్యాఖ్యలు కలిపి  నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఆయన రాజకీయ పరిణితిపై సందేహాలు ముప్పిరిగొనేలా చేస్తున్నాయి.  

ఒక్క స్టీల్ ప్లాంట్ ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్  విషయంలోనే కాదు..   అనేక అంశాల్లో క్రెడిట్ కోసం జగన్ ఉబలాటం నవ్వుల పాలైంది.   అసలాయన మాటలను సొంత పార్టీ నేతలూ, శ్రేణులకు నమ్మకం లేకుండా పోయింది.   ప్రతి విషయంలోనూ క్రెడిట్  తన ఖాతాలో వేసుకోవడం కోసం ఆయన పడుతున్న పాట్లు, చేస్తున్న వాదనలు ఆయన ప్రతిష్ఠను ప్రజలలో చులకన చేస్తున్నాయి.   

By
en-us Political News

  
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం, ఏదైనా న్యాయస్థానం ప్రజాప్రతినిధులకు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తేనే వారిపై అనర్హత వేటు పడుతుంది. అయితే ఈ నిబంధనను మరింత కఠినతరం చేస్తూ కేవలం 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఉన్నా పదవి కోల్పోయేలా మార్పులు చేయాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నారు.
అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో సానుభూతిని తిరిగి సంపాదించుకోవడానికి, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని శాంతిభద్రతల విషయంలో ఇరకాటంలో పెట్టడానికే వైసీపీ ఈ బాట ఎంచుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ తరహా రాజకీయ వ్యూహాలు వైసీపీకి ప్లస్ అవ్వడం అటుంచి బూమరాంగ్ అవుతూ.. ఆ పార్టీకి మరింత వ్యతిరెకత జనంలో కలగడానికి మాత్రమే దోహదపడుతున్నదంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు గుప్పించే కేటీఆర్.. తాజాగా చంద్రబాబు పాలనా దక్షత, ఆయన ముందుచూపును అభినందించారు. కేటీఆర్ చంద్రబాబును అభినందించడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు విషయంలో జగన్ మాట్లాడిన మాటలు అసలాయనకు చట్టాలు తెలుసా? ఈ వ్యక్తా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధికారం చెలాయించింది అన్న అనుమానాలు కలగక మానవు.
యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఒక బహిరంగ వేదికపై తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వేదికపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఏబీవీ, ఇలా వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికపై కనిపించడం రాజకీయవర్గాలలో చర్చకు తెరలేపింది.
హరీష్ రావు అతి తొందరలో కారు దిగి కాషాయ జెండా పట్టుకుంటారనీ, ఆ దిశగా హరీష్ ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరిపారనీ రేవంత్ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలు అవాస్తవమని హరీష్ రావు భద్రాద్రి రామునిపై ఓట్టేసి చెప్పగలరా అని సవాల్ చేశారు.
ప్రశ్న రావణ్ విషయంలో పూటకోమాట, రోజుకో స్టాండ్ అన్నట్లుగా వ్యవహరించి వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ పోయింది.
దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం
గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది.
ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.