సజ్జల కబ్జాల పర్వంపై విచారణకు ఆదేశించిన పవన్ కల్యాణ్

Publish Date:Jan 3, 2025

Advertisement

సజ్జల పాపాల పుట్ట పగులుతోంది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆయన పాల్పడిన భూకబ్జాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. కాదేదీ కబ్జాకు అనర్హం అన్నట్లుగా ఆయన అటవీ భూములను సైతం వదల లేదు. అటవీ భూములలో ఏకంగా గెస్ట్ హౌస్ లే నిర్మించుకుని జల్సాలు చేసిన వైనం విస్తుగొల్పుతోంది.

 సజ్జల భూ బాగోతంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశించారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా పని చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ ప్రభుత్వంలో సకల శాఖల మంత్రిగా సర్వం తానై వ్యవహరించిన సంగతి తెలిసిందే. షాడో సీఎంగా సజ్జలే ప్రభుత్వ వ్యవహారాలన్నీ నడిపారన్న ఆరోపణలకు కూడా ఉన్నాయి. 

వాస్తవానికి జగన్ ఐదేళ్ల పాలనా దోపిడీ, దౌర్జన్యాలు, అవినీతి, కబ్జాలకు హద్దన్నదే లేదన్నట్లుగా సాగింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ పార్టీ నేతలు యధేచ్ఛగా కబ్జాలకు పాల్పడ్డారు. అందిన కాడికి భూముల కబ్జాయే లక్ష్యమన్నట్లుగా వారి తీరు సాగింది. ప్ర‌భుత్వ భూములు,  అట‌వీ భూములు, ప్రైవేట్ భూములను ఇష్టారీతిగా ఆక్రమించేసి.. కబ్జాకు కాదేదీ అనర్హం అన్నట్లుగా చెలరేగిపోయారు.  జగన్ పాలన అంతా  ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ భూముల‌ను దోచుకోవ‌ట‌మే అన్నట్లుగా సాగింది.  జగన్ కేబినెట్ లో ఐదేళ్లు మంత్రిగా కొన‌సాగిన పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఆయ‌న కుటుంబం పెద్ద ఎత్తున  భూకబ్జాలకు పాల్పడింది. అలాగే విశాఖపట్నంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు  విజ‌య‌సాయిరెడ్డి భూదందా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలా వైసీపీ హ‌యాంలో ఆ పార్టీ నేత‌ల భూక‌బ్జాల ప‌ర్వం అడ్డూ అదుపూ లేకుండా సాగింది.

ఇప్పుడు తాజాగా  స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, ఆయ‌న కుటుంబం భూదందా వ్య‌వ‌హారం వెలుగులోనికి వచ్చింది. జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి  యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడ్డారు. ఆయన భూ కబ్జాల పర్వం ఇప్పుడు ఒక్కటొక్కటిగా బయటకు వస్తోంది.  అధికారాన్ని అడ్డుపెట్టుకొని సజ్జల ఏకంగా అట‌వీ భూమిని  క‌బ్జా చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి.  కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత స‌జ్జ‌ల‌ భూ కబ్జాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తడంతో   అధికారులు ఆరా తీయడం ప్రారంభించారు. ఈ క్ర‌మంలో తాజాగా స‌జ్జ‌ల రామ‌కృ ష్ణా రెడ్డి భారీ అవినీతి బాగోతం వెలుగులోకి వ‌చ్చింది. స‌జ్జ‌ల బ్ర‌ద‌ర్స్ ఏకంగా 42 ఎక‌రాల అట‌వీ భూమిని క‌బ్జా చేసిన‌ట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ భూములలో  పండ్ల‌తోట‌లు, ఇత‌ర పంట‌లు సాగు చేస్తున్నారు. అంతే కాక అట‌వీ భూముల్లో గెస్ట్ హౌస్‌లు, ప‌నివారికోసం షెడ్లు క‌ట్టించారు. అయితే, స‌జ్జ‌ల పేరు బ‌య‌ట‌కు రాకుండా ఆయ‌న అండ‌తో  సోద‌రులు, కుటుంబ స‌భ్యులు అట‌వీ భూముల‌ను ఆక్ర‌మించిన‌ట్లు స‌మాచారం. వారంతా స‌జ్జ‌ల బినామీలేన‌ని ప్ర‌చారం జరుగుతోంది. గ‌త ప్ర‌భుత్వంలో స‌జ్జ‌ల సోద‌రులు క‌డ‌ప శివారు ప్రాంతంలో చేసిన అక్రమాలు కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వెలుగులోకి వ‌చ్చాయి. ప్రస్తుతం ఈ ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.  

By
en-us Political News

  
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.