ఏపీలో నడకే నేరమా? జగన్ హయాంలో ప్రజాస్వామ్యం బందీ!

Publish Date:Oct 26, 2022

Advertisement

ఊరంతా ఒకదారి అయితే ఉలిపికట్టెదొక దారి అన్నది సామెత.. అలాగే దేశమంతా ఒక దారి అయితే జగన్  అధికారంలో ఉన్న ఏపీది ఒక్కటీ ఒక దారి అని చెప్పుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. అమరావతి రైతుల మహాపాదయాత్రను నిలువరించడానికి జగన్ సర్కార్ చేయని ప్రయత్నం లేదు. అయితే దేశంలో ఇదే సమయంలో ఎన్నో పాదయాత్రలు జరుగుతున్నాయి.

జగన్ ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్ బీహార్ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారు. భారత్ జోడో యాత్ర పేరిట కాంగ్రస్ ప్రముఖ నేత రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర ఇటీవలే ఏపీలో నిరాటంకంగా పూర్తి చేసుకుని తెలంగాణలో ప్రవేశించింది. ఇక జగన్ కు స్వయాన సోదరి.. వెసీపీ తెలంగాణ పార్టీ (వైఎస్సార్టీపీ) అధినేత్రి షర్మిల తెలంగాణలో సుదీర్ఘ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. వీరెవరికీ ఎలాంటి అభ్యంతరాలు, అడ్డంకులూ లేవు. కానీ ఏపీలో రైతుల పాదయాత్రకు మాత్రం అడుగడుగునా అడ్డంకులు. ప్రభుత్వం, పోలీసులు, అధికారులు, వైసీపీ నేతలు ఇలా ప్రభుత్వం చెప్పుచేతల్లో, కనుసన్నలలో మెలగడమే తమకు రక్ష  అని భావించే వారంతా పాదయాత్రను అడ్డుకోవడమే ఏకైక అజెండా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

రైతుల పాదయాత్రను అడ్డుకోవడం కోసం ప్రభుత్వం రాష్ట్రంలో రైతుల పాదయాత్ర ఒక్కటే సమస్య అన్నట్లుగా వ్యవహరిస్తున్నది. ముఖ్యమంత్రికి స్వయానా బాబాయ్ అయిన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను వేరే రాష్ట్రానికి మార్చేందుకు సుప్రీం కోర్టు అంగీకరించడం జగన్ సర్కార్ కు చెంపపెట్టు లాంటిదే అయినా.. దాని గురించిన పట్టింపే లేకుండా సర్కార్ వ్యవహరిస్తున్నారు. అమరావతి రైతులపైనే కాదు.. వారి పాదయాత్రకు మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీలపైనా, ప్రజా సంఘాలపైనా కూడా ఆంక్షలు విధించడం ద్వారా రైతులే కాదు.. వారి మద్దతు దారులెవరూ రోడ్లపై నడవడానికి వీల్లేదన్న ఒక వింత, కొత్త నిబంధనలకు ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అయినా విమర్శలు, కోర్టు మొట్టికాయలకు అలవాటు పడిపోయిన జగన్ సర్కార్ వాటిని వేటినీ ఖాతరు చేయడం లేదు. దేశంలో రైతుల పాదయాత్రకు తప్ప మరే పాదయాత్రలోనూ అందులో పాల్గొన్న వారి గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డులూ అడగడం లేదు. కానీ రాష్ట్ర రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులు న్యాయం కోసం రోడ్డెక్కి యాత్ర చేస్తుంటే మాత్రం వారి గుర్తింపు చూపించిన తరువాతే అడుగు కదపాలంటూ నియంత్రిస్తున్నారు. నిజమే  కోర్టు ఆరువందల మంది రైతులు మాత్రమే పాదయాత్రలో పాల్గొనడానికి అనుమతి ఇచ్చింది. అయితే ఆ కోర్టు తీర్పు కాపీ ఇంకా అందనే లేదు.. కానీ పోలీసులు మాత్రం ఆధార్ కార్డులు, గుర్తింపు కార్డులు చేపించిన తరువాతే అడుగు ముందుకు వేయాలంటూ అమరావతి రైతులను నిలువరించారు.

అమరావతి రైతులకు మద్దతుగా వచ్చిన వారినీ ఆపేశారు. దీంతో రైతులు కోర్టులోనే తెల్చుకుంటామంటూ పాదయాత్రకు విరామం ప్రకటించారు. తాము తీసుకున్నది విరామమే కానీ.. యాత్రను ఆపేయలేదని వారు స్పష్టం చేశారు. అయితే బొత్స వంటి మంత్రులు.. ఇతర ఘనత వహించిన వైసీపీ నేతలూ మాత్రం రైతుల యాత్ర ఆగిపోయినట్లేననీ, మహాపాదయాత్ర పేరిట నడుస్తున్న వారెవరూ రైతులే కాదంటూ తమ వాచాలతకు పదును పెట్టారు.

వాస్తవానికి రైతుల మహాపాదయాత్రకు అధికార వైసీపీ వినా.. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలూ, ప్రజా సంఘాలూ, ప్రజలూ మద్దతు ఇస్తున్నారు. ఆఖరికి మూడు రాజధానులంటూ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని జగన్ సర్కార్ వ్యూహాత్మకంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులూ, విశాఖ గర్జనలూ కూడా ప్రజాదరణ ముందు విఫలమయ్యాయి. విశాఖ వాసులు కూడా అమరావతికే జై కొడుతున్నారనడానికి విశాఖ గర్జన్ తుస్సు మనడమే నిదర్శనమని పరిశీలకులు సైతం అభివర్ణిస్తున్నారు. స్వయంగా మంత్రి ధర్మానే పలు సందర్భాలలో విశాఖ వాసులే మూడురాజధానుల అంశానికి మద్దతు ఇవ్వడం  లేదంటూ చిర్రుబుర్రులాడారు.

కానీ జగన్ సర్కార్ మాత్రం రైతుల మహాపాదయాత్ర తన రాజకీయ అస్థిత్వానికే సవాల్ గా భావిస్తున్నది. విపక్ష నేతగా స్వయంగా జగన్ సైతం రాష్ట్రంలో పాదయాత్ర చేసిన సంగతి అందరికీ తెలిసిందే. నాడు ఆ పాదయాత్రను ఇలాగే అడ్డుకుని ఉంటే వైసీపీ నేడు అధికారంలో ఉండి ఉండేదా అని సామాన్యులు సైతం ప్రశ్రిస్తున్న పరిస్థితి నేడు ఏపీలో నెలకొని ఉంది. అయినా దమనకాండతో.. పోలీసులను ప్రయోగించి సర్వ హక్కులనూ కాలరాయడానికి జగన్ సర్కార్ వెనుకాడటం లేదు. 

By
en-us Political News

  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.