పదునెక్కిన అన్నమయ్య జిల్లా వివాదం

Publish Date:Feb 1, 2022

Advertisement

ఏ ప్రతిఫలాన్ని ఆశించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లాల విభజనను తెర మీదకు తెచ్చారో కానీ.. ఇప్పుడు ఆ ప్రతిపాదన ఆయనకు ఊపిరి ఆడనివ్వకుండా చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజిస్తూ కొద్ది రోజుల క్రితమే జగన్ సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజలు, ప్రజా సంఘాలు ప్రజాభిప్రాయం చెప్పాలని కోరింది. అభిప్రాయాలు, అభ్యంతరాలు చెప్పేందుకు ఫిబ్రవరి 26 వరకూ గడువు కూడా ఇచ్చింది. జిల్లాల పునర్విభజనను కొందరు వ్యతిరేకిస్తే.. మరి కొందరు మిశ్రమంగా స్పందిస్తుండడం గమనార్హం.

ఈ క్రమంలో కడప జిల్లాలో రెండు జిల్లాల పేర్లపై రచ్చ జరుగుతోంది. రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. రాజంపేట జిల్లాకు రాజంపేటనే జిల్లా కేంద్రంగా పేర్కొంది ప్రభుత్వ నోటిపికేషన్. అయితే.. జిల్లా పేరును రాజంపేట అని కాకుండా అన్నమయ్య పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ రోజు రోజుకూ పెరిగిపోతోంది. ప్రభుత్వం ప్రతిపాదించిన రాజంపేట జిల్లాకు బదులుగా అన్నమయ్య జిల్లా అని పేరు పెట్టాలని పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. కడప నుంచి విభజించే జిల్లాకు పద కవితా పితామహుడు అన్నమయ్య పేరు పెట్టాలంటూ గడచిన ఐదు రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి.

ఈ నిరసనలను అణచివేసేందుకు జగన్ రెడ్డి సర్కార్ దమననీతికి పాల్పడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజంపేటలో పోలీసలులు అడుగడుగునా ఆంక్షలు విధించడం ఆందోళనకారుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. రాజంపేటలోకి బయటి వ్యక్తులను రానివ్వకుండా పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. ఆందోళనలో భాగంగా రాజంపేటలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీలో అఖిలపక్షర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీతో పాటుగా, అధికార వైసీపీ నుంచి కూడా నాయకులు, శ్రేణులు పాల్గొనడం విశేషం. మొత్తం మీద రాజంపేట వద్దు.. అన్నమయ్యే ముద్దు అంటూ స్థానకులు, రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు చేస్తున్న ఆందోళనలకు ఫలితం ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే.

By
en-us Political News

  
చనిపోయిన రోగుల పేర్లపైనా బిల్లులు..ఏసీబీ దాడుల్లో బట్టబయలు.!
నడవడానికి కేటాయించిన ఫుట్‌పాత్‌పై కూడా ప్రశాంతంగా అడుగులు వేయలేని పరిస్థితి.. రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తప్పించుకోవడానికి కొందరు వాహనదారులు ఏకంగా పాదచారుల దారినే ఆక్రమిస్తున్నారు.
బంగారం ధరలు భారీగా పడిపోవడం ఆభరణాల కొనుగోలుదారులకు ఊరటనిస్తుంటే.. పసిడిని తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న వారికి మాత్రం కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు? ముఖంపై చిన్న మొటిమ వచ్చినా.. చర్మంపై నల్లటి మచ్చ కనిపించినా అమ్మాయిలు ఆందోళన చెందుతారు.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బెంగళూరుకు చేరుకోవడంతో యలహంక ప్యాలెస్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రంగంలో లోతైన సాంకేతిక నైపుణ్యం కలిగిన నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ నెలకొంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
మత్తుపదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నషా ముక్త్ భారత్ ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలని సినీ నటుడు ప్రభాస్‌ను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆహ్వానించారు.
ఇద్దరు ఆడపిల్లలు పుట్టారన్న కారణంతో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.