ఢిల్లీ నుంచి గల్లీ దాకా.. పొత్తుల పైనే చర్చలు

Publish Date:Sep 3, 2022

Advertisement

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు. శాశ్వత శతృవులు ఉండరు... ఇది ఒక విధంగా  సర్వామోదం పొందిన నానుడి. యూనివర్సల్ ట్రూత్.  సో .. పార్టీల మధ్య స్నేహ సంబంధాలు అటూ ఇటూ కావడం, పొత్తులు, కూటములు విచ్చిన్నం కావడం, పాత పొత్తులు వాడి,  కొత్త పొత్తులు విచ్చుకోవడం, కొత్త విషయం కాదు. నిన్న గాక మొన్న బీహారులో ఏమి జరిగిందో చూశాం.  రెండేళ్ళ క్రితం 2020 అక్టోబర్, నవంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనతా దళ్ (యు) పార్టీలు పొత్తు పెట్టుకుని, ఒకే కూటమిగా (ఎన్డీఎ) పోటీ చేశాయి. కూటమి విజయం సాధించింది. ఎన్డీఎ ప్రభుత్వం ఏర్పడింది. జేడీయు కంటే బీజేపీకి రెట్టింపు సీట్లు వచ్చినా, ముందే కుదిరిన ఒప్పందం ప్రకారం  జేడీయు నేత నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా  బాధ్యతలు చేపట్టారు. అయితే, ఈ రెండు సంవత్సరాలలో లోలోపల ఏమి జరిగిందో ఏమో కానీ, నితీష్ కుమార్ బీజేపీ చేయి వదిలి ఆర్జేడీ చేయి పట్టుకున్నారు. మళ్ళీ ఆయనే పీఠం ఎక్కారు. నితీష్  ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. సరే, నితీష్ కుమార్ మనసు మళ్ళీ ఎప్పుడు మారుతుంది, ఈ ప్రభుత్వం ఎంతకాలం మనుగడ సాగిస్తుందనే భేతాళ ప్రశ్నలు ఉంటే ఉండవచ్చును కానీ, రాజకీయ ఎన్నికల పొత్తులకు సంబంధించి ఇదొక లేటెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ గా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నిజమే, ఇంతకు ముందు ఇదే బీహారులో ఇదే తరహ పొత్తులు కుడి ఎడమలు అయిన సందర్భాలున్నాయి. మహారాష్ట్రలోనూ కొంచెం అటూ ఇటుగా అదే జరిగింది. ఇతర రాష్ట్రలలోనూ, చివరకు జాతీయ స్థాయిలోనూ ఇలాంటి ఉదంతాలు అనేక ఉన్నాయి. కూటమిలో వచ్చిన కుమ్ములాటల కారణంగా ఒకే ఒక్క ఓటు తేడాతో  అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వం కూలి పోయింది. 

అదలా ఉంచితే, ఇప్పుడు జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాల వరకు పొత్తులు, ఎత్తులకు సంబంధించిన చర్చలే జోరుగా జరుగుతన్నాయి. టీవీ డిబేట్స్ మొదలు రచ్చబండ రాజకీయ చర్చల వరకు పొత్తుల మీదనే చర్చ నడుస్తోంది. ఎవరితో ఎవరు జట్టు కడతారు, ఎవరితో ఎవరు చేతులు కలుపుతారు ఎవరు ఎవరితో చేతులు కలిపితే ఫలితాలు ఎలా తారుమారు అవుతాయి అనే లెక్కల చుట్టూనే చర్చలు సాగుతున్నాయి.  

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీహార్ రాజధాని పాట్నా వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో సమావేశమై జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావలసిన అవసరాన్ని ఇటు బీహారు పెద్దాయనకు, అటు దేశ ప్రజలకు ఒకేసారి విశద పరిచే ప్రయత్నం చేశారు. అలాగే, అంతకు ఒక రోజు ముందే ఎన్సీపీ అధినేత  శరద పవార్  బీజేపీయేతర రాజకీయ పార్టీలను జాతీయ స్థాయిలో ఏకం చేసి, ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. అయితే అందులో తనది సలహాదారు పాత్ర మాత్రమే అని కూడా సెలవిచ్చారు.

అలాగే, తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఇలా ఎవరికి వారు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని గద్దెదించడం కోసం ఎవరికి వారు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఏకమయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ, నాయకత్వం విషయంలో ఎవరి దారిన వారు విడి పోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  పాట్నా పర్యటనలో ఇదే  తగవు తలమానికంగా నిలిచింది. చివరకు ఆయన వెళ్ళిన పని, పంచిన కోటి రూపాయల నజరానాలు అన్నీ పక్కకి పోయి, నాయకత్వం విషయంలో కేసీఆర్, నితీష్ కుమార్ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదన్న విషయమే ప్రముఖంగా బయటకు వచ్చింది.నాయకత్వ విషయం వచ్చే సరికి నితీష్ కుమార్ లేచి పోవడం, కేసీఆర్ ఆయన్ని కూర్చో పెట్టిందుకు భైఠోజీ .. భైఠో అని బతిమిలాడుకోవడమే హైలైట్ గా నిలిచింది. 

అదొకటి అలా ఉంటే, ఆంద్ర ప్రదేశ్ లో టీడీపీ, బీజేపీల మధ్య మళ్ళీ పొత్తు పొడుస్తోందని, త్వరలోనే టీడీపీ ఎన్డీఎలో చేరుతోదంటూ గత వారం పదిరోజులుగా సాగుతున్న ప్రచారానికి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చక్కగా చుక్క(ఫుల్ స్టాప్) పెట్టారు. ఏపీ అభివృద్ది కోసం అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు అన్నారు.

ఇప్పటి వరకూ పొత్తుల గురించి తానెక్కడా మాట్లాడలేదని చెప్పారు. పొత్తులపై నాయకుల్లోనూ ఈ స్పష్టత ఉండాలని తెలిపారు. నిజం, గతంలోనూ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసమే, ప్రత్యేక  హోదా కోసమే  పెట్టుకున్న పొత్తును తుంచేసుకుంది.   ఇప్పడు కూడా అదే పద్ధతిలో, ఎన్నికలు వచ్చినప్పుడు, అప్పటి రాజకీయ పరిస్థితి, రాజకీయ అవసరాలు, అన్నిటినీ  మించి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవడమే సరైన నిర్ణయం అవుతుందని టీడీపీ భావిస్తోంది. చంద్రబాబు నాయుడు చెప్పింది కూడా అదే. నిజానికి ఇప్పడు కాదు,

మొదటి నుంచి చంద్ర బాబు నాయుడు పొత్తుల చర్చలకు ఇంకా సమయం రాలేదనే అభిప్రాయం తోనే ఉన్నారు. అదలా ఉంటే తెలంగాణలో త్వరలో ఉప ఎన్నిక జరగనున్న మునుగోడులో అధికార తెరాసకు మద్దతు ఇవ్వాలని ఉభయ  కమ్యునిస్ట్ పార్టీలు సిపిఐ, సిపిఎం నిర్ణయించాయి. నిజమే, కొత్త పొత్తులకు పాత తగవులు అడ్డు రావని, లెఫ్ట్ పార్టీలే కాదు అన్ని పార్టీలు ఎప్పుడో నిర్ణయించాయి.ఇక్కడ నైతిక విలువలు అవీ ఇవీ అని మాట్లాడవలసిన అవసరం లేదు. అయితే, సిపిఐ, సిపిఎం పార్టీలు బీజేపీని ఓడించేందుకు తెరాసకు మద్దతు ఇస్తున్నామని చెప్పుకోవడం తాడి చెట్టు ఎందుకు ఎక్కావు అంటే ... ఆవుదూడ మేతకు అన్నట్లు ఉందని కొందరు  ఎద్దేవా చేస్తున్నారనుకోండి అది వేరే విషయం. గతంలో కేసేఆర్ లెఫ్ట్ పార్టీలను, ఆ పార్టీ నాయకులను ఎంతగా చులకన చేశారు, ఎంతగా అవహేళన చేశారు, లెఫ్ట్ నేతలు కేసీఆర్ ను  ఏ భాషలో దూషించారు అనేది ఇప్పడు అప్రస్తుతం. 

అయితే, ఇలా  పొత్తుల చుట్టూ తిరుగుతున్న చర్చలో జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి నుంచి నియోజక వర్గ స్థాయి వరకు బీజేపీని ఓడించడమే లక్ష్యంగా కనిపిస్తోందని,  ఇన్ని పార్టీలు, ఇంత మంది మహా నాయకులు అందుకోసమే పనిచేస్తున్నారు, అని పిస్తుంది. కానీ... బీజేపీని, మోడీని ఓడించడం అయ్యే పనేనా అంటే రేపటి సంగతి ఏమో కానీ ఈరోజుకు అయితే కాదనే అనిపిస్తుందని విశ్లేషకులే కాదు, సామాన్యులు కూడా భావిస్తున్నారు. ఎందుకలా ...?!

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బ‌లోపేతం, స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం, క‌మిటీల నిర్మాణం లాంటి అంశాల‌పై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్‌ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన యువగళం పాదయాత్ర లోకేష్‌ను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా.. ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి.
కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది. టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.