ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు.. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత నిర్దోషులు!
Publish Date:Feb 27, 2026
Advertisement
దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్ఠించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసును ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం (ఫిబ్రవరి 27) కొట్టివేసింది. మద్యం విధానం రూపకల్పనలో ఎటువంటి అవినీతి జరగలేదని పేర్కొంటూ ఈ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీసీఎం మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత తదితరులను నిర్దోషులుగా ప్రకటించింది. మద్యం కుంభకోణం పాలసీ రూపకల్పనలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా 23 మందిపై మోపిన అభియోగాలను కొట్టివేస్తూ, వారిని నిర్దోషులుగా పేర్కొంటూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది. రెండేళ్ల పాటు సాగిన సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత.. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు విద్యాశాఖ మాజీ మంత్రి మనీశ్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత, ఆమె ఆడిటర్ బుచ్చిబాబు సహా 20 మందినీ కోర్టు నిర్దోషులుగా తేల్చింది. ఈ మేరకు వారిపై మోపిన ఆరోపణలను కొట్టివేసింది. కాగా తీర్పు వెలువడిన వెంటనే కేజ్రీవాల్ భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. తనను అక్రమంగా ఇంటి నుంచి తీసుకెళ్లి జైల్లో పెట్టిన రోజులను గుర్తు చేసి, చివరకు సత్యమే గెలిచిందందన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తమపై బురద జల్లారని ఆరోపించారు. ఈ కేసులో సీబీఐ సమర్పించిన సాక్ష్యాల్లో పస లేదనీ, కేవలం అనుమానాలతో తీవ్రమైన ఆరోపణలు చేయజాలరన్నారు. ఆధారాలు లేకుండా ఒక వ్యక్తిని దోషిగా నిలబెట్టడం సరైంది కాదని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పేర్కొంది. తీర్పు తరువాత కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్ తనను జైలు గోడలు భయపెట్టలేదన్నారు. సుదీర్ఘ న్యాయపోరాటం తరువాత న్యాయం జరిగిందన్నారు. అందుకే ఆనందం కన్నీళ్ల రూపంలో బయటకు వస్తోందనీ, ఇవి ఆనందబాష్ఫాలనీ చెప్పారు. నన్ను జైలుకు పంపడం ద్వారా ఆప్ ను అంతం చేయాలని చూశారన్న కేజ్రీవాల్.. ఈ తీర్పుతో ఆ కుట్రలు పటాపంచలయ్యాయన్నారు. ఇలా ఉండగా ఈ కేసు వివరాల్లోకి వెడితే.. 2021-22 సంవత్సరానికి గాను ఢిల్లీ ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో 2022 జూలైలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించారు. మరోవైపు లైసెన్స్ ఫీజు మాఫీ చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల నష్టం వాటిల్లిందని అప్పటి ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నివేదిక ఇచ్చారు. మద్యం వ్యాపారులకు మేలు చేసేలా ఢిల్లీ మద్యం పాలసీని రూపొందించారనీ, అందుకు ప్రతిఫలంగా ఆప్ నాయకులకు రూ.కోట్ల ముడుపులు అందాయని సీబీఐ అధికారులు అభియోగాలు మోపారు. ఈ స్కామ్‌లో సౌత్ గ్రూప్ పేరుతో కొందరు వ్యాపారులు, కల్వకుంట్ల కవిత, మరి కొందరు రాజకీయ నాయకులు కీలక పాత్ర పోషించారని సీబీఐ అభియోగాలు చేసింది. 100 కోట్ల రూపాయల వరకూ వరకు ముడుపులు చేతులు మారాయని సీబీఐ దర్యాప్తులో తేల్చి నిందితులపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే 2023 ఫిబ్రవరి ఫిబ్రవరి 26న ఆప్పటి ఢిల్లీ ఉపముఖ్య మంత్రి మనీష్ సిసోడియా, 2024 మార్చి 15న కల్వకుంట్ల కవిత, మార్చి 21న అప్పటికి సీఎం హోదాలో ఉన్న సీఎం అరవింత్ కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. అనంతరం వారంతా ఒక్కొక్కరుగా బెయిల్‌పై విడుదలయ్యారనుకోండి అది వేరే సంగతి. ఆ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం (ఫిబ్రవరి 27) తీర్పు వెలువరించింది. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవితతో సహా మొత్తం ఈ కేసులో నిందితులుగా సీబీఐ పేర్కొన్న 23 మందినీ నిర్దోషులుగా ప్రకటించింది.
http://www.teluguone.com/news/content/delhi-rous-avenue-court-dosmiss-delhiliquor-sacm-39-214732.html





