ఢిల్లీ లిక్క‌ర్‌స్కామ్‌.. జోనాట్రావెల్స్ స్పెష‌ల్ ఫ్లైట్లు

Publish Date:Sep 20, 2022

Advertisement

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌  కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. లిక్కర్‌ పాలసీ కార్యకలాపాల కోసం స్పెషల్ ఫ్లైట్స్‌ బుక్ చేసినట్లు అధికారులు గుర్తించారు. జోనా ట్రావెల్స్ వివరాల ఆధారంగా ఫ్లైట్స్‌ వెళ్లి నట్లు నిర్ధారించారు. జోనా ట్రావెల్స్‌ను రమాసింగ్‌ లీడ్ చేస్తున్నట్లు గుర్తించారు. లిక్క‌ర్ పాల‌సీ కార్య‌ క‌లాపాల కోసం ప్ర‌త్యేక విమానాల‌ను బుక్చేసిన‌ట్లు అధికారులు గుర్తించారు అందుకు సంబంధించి జోనాట్రావెల్స్వ‌ద్ద స్వాధీనం చేసుకున్న‌ వివరాల ఆధారంగానే ఈ సంగ‌తి బ‌య‌ట‌ ప‌డింది. 

పంజాబ్ ఎన్నికల సమయంలో ఢిల్లీ పార్టీ నేతలకు 200 కోట్లు ఇచ్చినట్టు, శ్రీనివాస్ రావు ద్వారానే లావా దేవీలు జరిగినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. 200 కోట్లు లావాదేవీల పైన శ్రీనివాస్ రావును  ఈడీ ప్రశ్నించింది. లిక్కర్ టెండర్ల కోసం చెల్లించారా లేదా మరో దానికా అనే కోణంలో దర్యాప్తును ఈడీ కొనసా గిస్తోంది.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్ప‌టికే అరుణ్ రామచంద్ర పిళ్ళై, గోరుంట్ల బుచ్చి బాబు (సీఏ), అభినవ్ రెడ్డి, అభిషేక్ రావు, గండ్ర సృజన్ లను విచారించిన ఈడీ.. వీరు ఇచ్చిన సమాచారం మేరకు సోమ వారం ఆరు చోట్ల సోదాలు  నిర్వహించింది. సుచిత్రా, కొండాపూర్ లోని రెండు నివాసాలలో, మాదాపూర్ వార్సన్ సాఫ్ట్ వేర్ సంస్థ, ఉప్పల్ లోని సాలిగ్రామ్ టెక్నాలజీలో ఈడీ సోదాలు నిర్వహించింది. బిల్డర్ శ్రీనివాస్ ఇంట్లో సోదాలు చేసి అతన్ని అదుపులోకి తీసుకొని సుమారు ఆరు గంటల పాటు ఈడీ అధికారులు విచా రించి అతని స్టేట్ మెంట్ నమోదు చేసుకున్నారు. శ్రీనివాస్ రావు ఇచ్చిన సమాచారం మేరకు మరికొంత మందినిసైతం విచారించేందుకు ఈడీ అధికారులు సిద్ధమవు తున్నారు.

ఈడీ అధికారులు నిన్న సుదీర్ఘంగా 7 గంటలపాటు శ్రీనివాసరావును విచారించి అతని స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఆయన ఇంట్లో సోదాలు చేసిన తర్వాత కీలక పత్రాలతోపాటు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకు న్నారు. వివిధ కన్నాల్టెన్సీలు, కంపెనీల్లో సోదాలు చేసి వాటిని సీజ్ చేశారు. మంగళవారం మరికొంత మందికి నోటీసులు జారీ చేయడం, మరికొన్ని కంపెనీలు, కార్యాలయాల్లో సోదాలు చేసే అవకాశముంది. ఇప్పటివరకు దాదాపు నాలుగుదఫాలుగా 23 బృందాలు.. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూ రు లో సోదాలు చేశారు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఉన్న కంపెనీలకు.. హైదరాబాద్‌లోని పలు కంపెనీలు, అలాగే శ్రీనివాసరావు కు చెందిన కంపెనీల నుంచే ముడుపులు వెళ్లినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. శ్రీనివాసరావు ద్వారానే కోట్లలో లావాదేవీలు జరిగినట్లు నిర్దారించారు. కంపెనీల ఏర్పాటుకు సంబంధించి కీలక పత్రాలు స్వాధీ నం చేసుకున్నారు. పిళ్ళై, శ్రీనివాసరావు మధ్య సంభాషణలను ఈడీ అధికారులు రిట్రైవ్ చేశారు. ఆ ఇద్దరి నుంచి అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు సమాచారం.

కాగా ఈడీ అధికారుల సోదాల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. పంజాబ్ ఎన్నికల్లో ఢిల్లీ నేతలకు రూ. 200కోట్లు ఇచ్చినట్లు ఆధారాలు సేకరించారు. శ్రీనివాసరావు ద్వారానే కోట్లలో లావాదేవీలు జరిగి నట్లు గుర్తించారు. రూ.200 కోట్ల లావాదేవీలపై శ్రీనివాసరావును అధికారులు ప్రశ్నించారు. లిక్కర్ టెండ ర్ల కోసం చెల్లించారా? లేదా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీలోని తొమ్మిది  లిక్కర్ కంపెనీలతో హైదరాబాద్ వ్యాపారవేత్తలకు లింకులు ఉన్నట్లు కనుగొన్నారు. ఈ డబ్బు ఎవరి ఖాతా నుంచి వెళ్లిందనే అంశం పై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

By
en-us Political News

  
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.