తాడేపల్లి ప్యాలెస్ కు జెట్ సెట్ గో సెగ?

Publish Date:Nov 17, 2022

Advertisement

ఢిల్లీ మద్యం కుంభకోణం మూలాలన్నీ ఏపీ సీఎం జగన్ సన్నిహితుల చుట్టూనే తిరుగుతున్నాయి. తాజాగా మద్యం కుంభకోణంకు సంబంధించి కోట్లాది రూపాయలను బేగం పేట విమానాశ్రయం నుంచి ప్రైవేట్ చార్టర్డ్ విమానాల ద్వారా తరలించారని ఈడీ వెల్లడించిన నేపథ్యంలో ఈ సొమ్ము తరలింపునకు ఉపయోగించిన ప్రైవేట్ విమానాలు ఈ స్కాంలో అరెస్టయిన అరబిందో డైరెక్టర్ భార్య కనికా టేక్రీవాల్ రెడ్డికి చెందిన జెట్ సెట్ గో సంస్థవేనని తేలడంతో ఇప్పుడు చూపులన్నీ జగన్ కు సన్నిహితులైన వారిపైకి మళ్లాయి.

ముఖ్యంగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి శరత్ చంద్రారెడ్డి సమీప బంధువు. విజయసాయి అల్లుడి అన్న శరత్ చంద్రారెడ్డి. ఆ శరత్ చంద్రారెడ్డి భార్యే కనికా టేక్రీవాల్ రెడ్డి. దీంతో మద్యం కుంభకోణం వ్యవహారంలో విజయసాయి పాత్రపై లోతైన విచారణ జరగాలని తెలుగుదేశం డిమాండ్ చేస్తోంది. బేగంపేట విమానాశ్రం  నుంచి ప్రవేటు విమానాల రాకపోకలు, వాటిలో ప్రయాణించిన వారి గురించి ఆరా తీసిన విధంగానే గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రైవేటు విమానాల రాకపోకలు, వాటిలో ప్రయాణించిన వారి వివరాలనూ కూడా ఈడీ దర్యాప్తు చేయాలని తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిథి పట్టాభి డిమాండ్ చేశారు.  

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన శరత్ చంద్రారెడ్డికి వైసీపీ అగ్రనాయకత్వంతో అనుబంధం చిన్నదేమీ కాదు. శరత్ చంద్రారెడ్డికి వైసీపీ ఎంపీ విజయసాయితో చుట్టరికం ఉందని మాత్రమే ఇంత కాలం అనుకుంటూ వచ్చాం. కానీ విజయసాయితో చుట్టరికానికి ముందే ఆయనకు వైఎస్ జగన్ తో అనుబంధం ఉందన్నదీ వెలుగులోకి వచ్చింది. ఎలా అంటే  జగన్ అక్రమాస్తుల కేసులో శరత్ చంద్రారెడ్డి కూడా సహ నిందితుడు. ఆ అనుబంధంతోనే శరత్ చంద్రారెడ్డికి జగన్ ఏపీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి దక్కేలా చేశారు.

ఔను పీనపాక శరత్ చంద్రరెడ్డి ఏపీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు. జగన్ తో అసోసియేషన్ కారణంగానే శరత్ చంద్రారెడ్డికి ఏపీ క్రికెట్ అసోసియేషన్ పదవి దక్కిందన్న విమర్శలు ఉన్నాయి. వీరిరువురి మధ్యా అసోసియేషన్ జగన్ అక్రమాస్తుల కేసులో శరత్ చంద్రారెడ్డి కూడా ఒక నిందితుడు అవ్వడంతోనే అర్ధమౌతుంది. ఆయనే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ఏపీలో అరబిందో ఎన్నో ప్రాజెక్టులు దక్కించుకుంది.  అలాగే అంబులెన్స్ కాంట్రాక్ట్ కూడా అరబిందోకే దక్కింది.   అలాగే అధికార బలం అండతో  ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌  అద్యక్ష పదవీ శరత్ చంద్రారెడ్డి దక్కించుకున్నారు. తన అల్లుడి సోదరుడు అయిన శరత్ చంద్రారెడ్డి జగన్ అధికారం చేపట్టిన అనతి కాలంలోనే ఏసీఏ ప్రెసిడెంట్ అయ్యారు.

ఆయన అధ్యక్షుడయ్యాకే  ఏసీఏ అవినీతి ఊబిలో కూరుకుపోయింది. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి.  దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్రారెడ్డి అరెస్టుతో ఆ కుంభకోణానికి ఏపీతో లింకులు ప్రస్ఫుటమయ్యాయి.   ఈ స్కామ్ కు సంబంధించి   ఈడీ అరెస్టు చేసింది.  అరబిందో ఫార్మా ఎండీ శరత్ చంద్రారెడ్డిని, వినయ్ కుమార్ ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరిరువురినీ  ఢిల్లీలో రెండు రోజుల పాటు విచారించి ఆ తరువాత అరెస్టు చేసినట్లు ప్రకటించింది. అరబిందో శరత్ చంద్రారెడ్డి, వినయ్ కుమార్ లకు కోట్లాది రూపాయల మద్యం వ్యాపారాలతో సంబంధాలున్నాయని ఈడీ పేర్కొంది. శరత్ చంద్రారెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు కావడంతో ఆ సెగ తాడేపల్లి ప్యాలస్ కు తగిలింది. దీంతో సకల శాఖల మంత్రి సజ్జల రంగంలోకి దిగి శరత్ చంద్రారెడ్డి విజయసాయి అల్లుడు కాదనీ, ఆయన సోదరుడనీ చెబుతూ.. సోదరుడి అక్రమాలతో విజయసాయి అల్లుడికి ఏం సంబంధం అని మీడియా ముఖంగా చెప్పారు.

అయితే ఏ సంబంధం, అనుబంధం లేకుండానే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పదవిని శరత్ చంద్రారెడ్డికి కట్టబెట్టారా?  ఏ సంబంధం లేకుండానే జగన్ అక్రమాస్తుల కేసులో ఏ1, ఎ2తలో పాటు శరత్ చంద్రారెడ్డి కూడా నిందితుడిగా ఉన్నారా అని నెటిజన్లు నిలదీస్తున్నారు. ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి అరెస్టుతో లిక్కర్ స్కాం దర్యాపులో ఈ లింకులు ఎంత వరకూ ఉన్నాయో బహిర్గతమయ్యే అవకాశం ఉంది.

ఇప్పుడు మద్యం స్కాం సొమ్ముల తరలింపులో శరత్ చంద్రారెడ్డి భార్యకు చెందిన జెట్ సెట్ గో సంస్థ విమానాలను వినియోగించారని తమ దర్యాప్తులో తేలిందని ఈడీ వెల్లడించింది. అంతే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల అండతోనే ప్రైవేటు ఛార్టర్డ్ విమానాల ద్వారా నగదు తరలింపు జరిగిందని భావిస్తున్నట్లు ఈడీ పేర్కొంది. దీంతో బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి ప్రైవేట్ చార్టర్డ్ విమానాల రాకపోకలను  నిలిపివేశారు. ఇక విజయవాడ నుంచీ ఈ సంస్థకు చెందిన ప్రైవేట్ విమానాల ద్వారా రాకపోకలు సాగించిన వారి వివరాలనూ ఈడీ సేకరిస్తే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు. ఆ దిశగా ఈడీ అడుగులు వేయాలన్న డిమాండ్ జోరందుకుంది.

By
en-us Political News

  
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మహానగరంలో శాంతిభద్రతలకు సవాల్ విసురుతూ మరో కిరాతక ఘటన వెలుగు చూసింది.
పెంపుడు జంతువుల పట్ల యజమానులు చూపే ప్రేమ రోజుకో కొత్త రూపం దాల్చుతోంది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మేనల్లుడైన ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం (FRRO) నుంచి కఠినమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
అమెరికాలోని చికాగో సమీపంలో ఒక భారీ ఉగ్ర కుట్ర తృటిలో తప్పింది.
బెంగళూరులోని ఒక పబ్‌లో పోలీసులతో జరిగిన వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కఠినంగా స్పందించింది.
నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు.. ఎన్నో కలలు కన్నారు.. కుటుంబాల వ్యతిరేకతను ఎదుర్కొని మరీ ఒక్కటయ్యారు.
ప్రియుడిని బయటకు తీసుకురావాలనుకుంది.. చివరికి తానే కటకటాల వెనక్కి.!
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.