ఢిల్లీ లిక్కర్ స్కాం.. తెలుగు రాష్ట్రాలలో డొంకలు కదులుతున్నాయి

Publish Date:Nov 16, 2022

Advertisement

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో సంచలన వెలుగులోకి వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులకు ఈ స్కాంతో లింకులు ఉన్నట్లుగా దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఈ స్కాంకు సంబంధించి బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి ప్రైవేట్ చార్టర్డ్ విమానాల ద్వారా భారీ ఎత్తున  నగదును ఢిల్లీ,  తదితర ప్రాంతాలకు తరలించారని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల అండతోనే ప్రైవేటు ఛార్టర్డ్ విమానాల ద్వారా నగదు తరలింపు జరిగిందని విశ్వసిస్తున్నాయి. బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి ప్రైవేట్ చార్టర్డ్ విమానాల రాకపోకలను  నిలిపివేశారు. 

 అంతే కాకుండా ఈ నగదు తరలింపునకు జెట్ సెట్ గో విమానాలను ఉపయోగించారని అనుమానిస్తున్న ఈడీ ఆ విమానాల ద్వారా ప్రయాణించిన వారి జాబితాను కోరుతూ ఈడీ లేఖ రాసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇక ప్రత్యేకంగా పేర్కొనాల్సిన విషయమేమిటంటే ప్రైవేటు చార్టర్డ్ విమానాలను అద్దెకిచ్చే సెట్ జెట్ గో కంపెనీ ఓనర్ కనికా టేక్రివాల్ రెడ్డి అనే మహిళ. ఈ కనికా టేక్రీవాల్ రెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఇటీవల అరెస్టయిన అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి సతీమణి. కనికా టేక్రీవాల్ రెడ్డి జెట్ సెట్ గో కంపెనీ ద్వారా ప్రైవేట్ ఛార్టర్డ్ విమాన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈమె కంపెనీకి చెందిన విమానాల రాకపోకలు, వాటిలో ప్రయాణించిన వారి వివరాలనే కోరుతూ ఇప్పుడు ఈడీ   ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు లేఖ రాసింది. అక్టోబర్ 17న ఈడీ రాసిన లేఖను  ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా  దేశంలోని అన్ని విమానాశ్రయ   డైరెక్టర్లకు పంపింది.

కనికా టేక్రీవాల్ రెడ్డి చెందిన విమానాల్లో కీలక వ్యక్తులు, ప్రముఖులు ప్రయాణాలు సాగించినట్లు ఇప్పటికే ఈడీ నిర్ధారించింది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సహా    తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు కనికా  టేక్రీవాల్ రెడ్డి కంపెనీకి చెందిన విమానాలను ఉపయోగిస్తున్నారని కూడా ఈడీ దర్యాప్తులో తేలిందని అంటున్నారు.  ఏపీకి చెందిన రాజకీయ నాయకులు, ప్రముఖులు   ఎవరికి ప్రైవేట్ ఛార్టరడ్డ్ ఫ్లైట్ అవసరమైనా సమకూర్చేది కనికా టేక్రీవాల్ రెడ్డేనని దర్యాప్తులో వెల్లడైనట్లు ఈడీ చెబుతోంది.

చార్టెర్డ్ విమానాలకు అధిక అద్దెలు వసూలు చేసినట్లు ఇప్పటికే కనికా టేక్రీవాల్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ స్కామ్‌లో ఏపీకి చెందిన ఉన్నత స్థాయి నేతలు ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఢిల్లీ మద్యం స్కాంకు సంబంధించిన నగదును కనికా టేక్రీవాల్ రెడ్డి కి చెందిన విమానాలలోనే తరలించారని ఈడీ అనుమానిస్తోంది.

అందుకే ఈ కంపెనీకి చెందిన విమానాలు బేగంపేట నుంచి ఎక్కడెక్కడకు వెళ్లాయి.. ఈ విమానాల్లో ఎవరెవరు ప్రయాణించారన్న వివరాలను ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు లేఖ రాసి మరీ సేకరించింది. ఈ వివరాలతో ఢిల్లీ లిక్కర్ స్కాం పాత్రధారులు, సూత్ర ధారులెవరన్నది పూర్తి ఆధారాలతో సహా బయటపడతాయని భావిస్తున్నారు.   

By
en-us Political News

  
మహానగరంలో శాంతిభద్రతలకు సవాల్ విసురుతూ మరో కిరాతక ఘటన వెలుగు చూసింది.
పెంపుడు జంతువుల పట్ల యజమానులు చూపే ప్రేమ రోజుకో కొత్త రూపం దాల్చుతోంది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మేనల్లుడైన ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం (FRRO) నుంచి కఠినమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
అమెరికాలోని చికాగో సమీపంలో ఒక భారీ ఉగ్ర కుట్ర తృటిలో తప్పింది.
బెంగళూరులోని ఒక పబ్‌లో పోలీసులతో జరిగిన వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కఠినంగా స్పందించింది.
నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు.. ఎన్నో కలలు కన్నారు.. కుటుంబాల వ్యతిరేకతను ఎదుర్కొని మరీ ఒక్కటయ్యారు.
ప్రియుడిని బయటకు తీసుకురావాలనుకుంది.. చివరికి తానే కటకటాల వెనక్కి.!
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా జరుగుతున్న నాల్గో టీ20 పోరులో భారత జట్టు టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.