ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత: 24 గంటలు ఇంటర్నెట్ బంద్. !

Publish Date:Oct 9, 2026

Advertisement

దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన ఆందోళన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.ఈ నిరసనల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు అత్యంత కఠినమైన ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా నగరంలోని అత్యంత కీలకమైన ప్రాంతంలో కమ్యూనికేషన్స్‌ను పూర్తిగా కట్టడి చేసింది. నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో శాంతిభద్రతలను కాపాడేందుకు కేంద్ర హోంశాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. అక్టోబర్ 8 నుంచి 12 వరకు సుమారు 23 వేల మంది సిబ్బందితో కూడిన 221 కేంద్ర సాయుధ పోలీసు బలగాల కంపెనీలను ఢిల్లీలో మోహరించినట్లు సమాచారం. జమ్ముకశ్మీర్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్ తదితర ప్రాంతాల నుంచి బలగాలను రప్పించి, సున్నితమైన ప్రాంతాల్లో నిఘా పెంచారు.జన్‌పథ్  కర్తవ్య పథ్ కూడలి కేంద్రంగా నాలుగు కిలోమీటర్ల మేర పరిధిలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

 శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ ఆంక్షలు సరిగ్గా 24 గంటల పాటు, అంటే శనివారం రాత్రి 10 గంటల వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్-ఐడియా  ఎంటీఎన్ఎల్ తదితర ప్రముఖ టెలికం నెట్‌వర్క్ సంస్థలకు ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం నుంచి ప్రత్యేక ఆదేశాలు జారీ అయ్యాయి. టెలికమ్యూనికేషన్స్ చట్టం-2023 నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి నుంచి కూడా అధికారిక అనుమతి లభించడంతో, ఆయా కంపెనీలు తక్షణమే అన్నిరకాల మొబైల్ డేటా సేవలను నిలిపివేయాలని పోలీసులు ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు జరగకుండా ఈ ఆంక్షలు దోహదపడతాయని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు, నిరసనలను అణచివేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న ఇటువంటి కఠిన చర్యలపై సుప్రీంకోర్టు ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.

 ప్రజా రవాణా వ్యవస్థలు  మెట్రోలను నిలిపివేయడాన్ని తప్పుపడుతూ, 'ఈగను చంపడానికి సుత్తిని ఉపయోగించలేరు కదా' అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఉన్న సున్నితమైన పరిస్థితుల దృష్ట్యా పోలీసులు మాత్రం తమ భద్రతా చర్యలను ఎక్కడా సడలించలేదు. ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావులేకుండా నగర వ్యాప్తంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ తాజా పరిణామాలు ఆంక్షల కారణంగా సామాన్య ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానున్న రోజుల్లో ఈ నిరసనల పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయోనని రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చనీయాంశమైంది. 

మరోవైపు, నిరసనల నేపథ్యంలో రద్దీ, హింసాత్మక ఘటనలను నివారించేందుకు ఢిల్లీలోని సుమారు 57 మెట్రో స్టేషన్లను మూసివేసే అంశం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. అయితే, ఈ స్టేషన్ల మూసివేతపై అధికారిక ప్రకటన వెలువడిందా లేదా అన్నది నిర్ధారించుకోవాల్సి ఉంది.ప్రస్తుతం ఢిల్లీలో భారతీయ నాగరిక సురక్ష సంహిత (BNSS) సెక్షన్ 163 కింద ఆంక్షలు అమల్లో ఉన్నట్లు పేర్కొంటున్నారు. దీంతో పోలీసులు నిరసనలపై మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యమని పోలీసులు చెబుతుండగా, మరోవైపు నిరసన హక్కును అడ్డుకుంటున్నారంటూ ఆందోళనకారులు విమర్శిస్తున్నారు. ఈ పరిణామాలతో దేశ రాజధానిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. నిరసనలకు అనుమతి నిరాకరణ, భద్రతా బలగాల మోహరింపు, ఇంటర్నెట్ ఆంక్షలపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

 

 

 

[ Delhi internet shutdown, CJP protest Delhi, Gyanesh Kumar protest, Janpath internet ban, Delhi Police restrictions, Delhi Police, CJP protest, Jantar Mantar, metro stations closed, security forces, internet suspended, Telugu One, Telugu News ]

By
en-us Political News

  
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
ఉత్తరాఖండ్‌లో నెలకొన్న దుర్భర రవాణా పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఓ నవవధువు ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసిపాప.. క్షణాల వ్యవధిలోనే కన్నుమూసింది.
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ దేశం నుంచి అత్యున్నత గౌరవం దక్కింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరో వాతావరణ గండం ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రకృతిని ఎదిరించి జీవించడం ఎవరికీ సాధ్యం కాదని, దానితో ఘర్షణకు దిగితే మానవాళి తీవ్ర విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హితవు పలికారు.
DRDO ఉద్యోగి ఎదురింట్లో ఉన్న ఓ యువతిపై మనసు పడ్డాడు.. అవకా శం కోసం ఎదురుచూశాడు యువతి ఒంటరిగా ఉన్నట్లు గుర్తించి ఇంట్లోకి చొరబడ్డాడు.
ఆకలి వేస్తే అన్నం పెట్టే విశాల హృదయం మనది.. దాహమేస్తే గుక్కెడు మంచినీళ్లు ఇవ్వడం మన సంస్కృతి.
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.